Radhika Sarathkumar
-
తిరుమలలో కుండపోత.. స్వామి వారిని దర్శించుకున్న స్నేహారెడ్డి, రాధిక (ఫొటోలు)
-
నయన్- ధనుశ్ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్ కుమార్
ధనుశ్- నయనతార వ్యవహారం కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇటీవల విడుదలైన నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ స్పందించారు. నానుమ్ రౌడీ ధాన్‌లో కీలక పాత్ర పోషించిన రాధిక ధనుశ్ ప్రవర్తనపై మాట్లాడారు. ఈ మూవీ సెట్స్‌లో నయనతార, విఘ్నేష్ శివన్‌ల ప్రేమ వ్యవహారం గురించి తనతో చెప్పాడని తెలిపింది. ఆ మూవీ షూటింగ్ టైమ్‌లో ధనుశ్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడని వివరించింది. ధనుశ్ ఫోన్లో మాట్లాడుతూ అక్కా.. నీకు సిగ్గు లేదా? అని అడిగాడు. అతను ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. 'ఏం జరుగుతుందో నీకు తెలియదా?, 'విక్కీ, నయన్‌లు డేటింగ్ చేస్తున్నారని ధనుశ్ నాతో అన్నాడని తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో రాధిక వివరించింది. ఆ తర్వాత వెంటనే 'ఏం మాట్లాడుతున్నావ్.. నాకేమీ తెలీదు' అని షాకింగ్‌కు గురైనట్లు డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది.కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. -
ఈ ‘టీమిండియా క్రికెటర్’ ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ అల్లుడు (ఫొటోలు)
-
రహస్య కెమేరాలు అమర్చారు: రాధికా శరత్‌కుమార్
కేరళ రాష్ట్రం రిలీజ్ చేసిన హేమా కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమనే కాకుండా ఇతర పరిశ్రమలనూ కుదిపేస్తోందనే చెప్పాలి. ఇంతకు ముందు దగా పడ్డ నటీమణులు ఇప్పుడు తమ ఆవేదనను వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాధికా శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ‘‘నేను నటించిన ఒక మలయాళ చిత్రం షూటింగ్ సమయంలో క్యారవేన్‌లో రహస్య కెమేరాలు అమర్చారు. నటీమణులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించి కొందరు నటులు సెల్ఫోన్లో చూసి, ఆనందించడం నా కంటపడింది. చాలా కోపం వచ్చింది.నేను క్యారవేన్కు వెళ్లకుండా హోటల్‌కు వెళ్లి దుస్తులు మార్చుకున్నాను. ఆ తర్వాత వాహన ఇన్చార్జ్ని ఇంకోసారి ఇలా జరిగితే జాగ్రత్త అని హెచ్చరించాను. సినిమా రంగంలో సిస్టమ్ సరిగ్గా లేదు. నటీమణుల గది తలుపులను తట్టే పరిస్థితి పలు చిత్ర పరిశ్రమల్లో ఉంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చే మహిళలు తమను తాము నిరూపించుకోవడానికి హార్డ్‌వర్క్ చేస్తారు. ఎన్నో త్యాగాలు చేస్తారు. మేం అందరం అలా ఎదిగినవాళ్లమే. ఒక మహిళ ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు చూపించమని అడుగుతారు. అంటే... జరిగే ఘటనను మేం వీడియో తీయాలా? ఇప్పుడు మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ ఈ విషయంపై కోలీవుడ్‌లో మాట్లాడుతున్న నటులెవరైనా ఉన్నారా? ‘ఉల్లొళుకు’ సినిమాలో ఊర్వశితో కలిసి పార్వతి బాగా నటించింది. ఆమెకు ఎందుకు అవార్డు రాలేదని మలయాళ ఇండస్ట్రీలో కొందరిని అడిగాను. ‘పార్వతి అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది. సమస్యల గురించి మాట్లాడుతుంది’ అన్నారు. అంత ప్రతిభ ఉన్న నటిని ఇలానా ట్రీట్ చేసేది అనిపించింది’’ అన్నారు.అవకాశాల కోసం అడ్జెస్ట్ అవుతారని...2018లో ‘మీటూ’లో భాగంగా తమిళ రచయిత వైరముత్తు గురించి చిన్మయి చేసిన ఫిర్యాదు గురించి ప్రస్తావించారు రాధిక. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘నేను యూ ట్యూబ్‌లో ఓ వీడియో చూశాను. ఒక వ్యక్తి... అతను జర్నలిస్ట్ కాదు... అతను నటీమణులు అవకాశాల కోసం అడ్జెస్ట్ అవుతారు అన్నట్లుగా మాట్లాడాడు. నడిగర్ సంఘమ్ జనరల్ సెక్రటరీ విశాల్‌కి ధైర్యం ఉంటే.. వెళ్లి అతన్ని చెప్పుతో కొట్టమనండి. తనతో పాటు నేను కూడా వెళతాను’’ అని ఘాటుగా స్పందించారు రాధిక. -
గాయపడ్డ సీనియర్ నటి రాధిక.. వీడియో వైరల్!
ఒకప్పటి హీరోయిన్ రాధిక గాయపడింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. తాజాగా తన రీల్ బ్రదర్ శివకుమార్ ఇంటికి వచ్చేసరికి అతడితో పాత ముచ్చట్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!)ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేసిన రాధిక.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో తల్లి పాత్రలు చేస్తోంది. అలానే గతంలో పలు సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు చేసి అలరించింది. అలా సీరియల్స్ చేస్తున్న టైంలో శివకుమార్ (హీరో సూర్య తండ్రి)కి చెల్లిగా పలు సీరియల్స్ చేసింది. అయితే వీళ్లు సీరియల్స్‌లో నటించి చాలా కాలమైంది.ఇక చాలా రోజుల తర్వాత రాధిక ఇంట్లో వీళ్లిద్దరూ కలిశారు. ఈ క్రమంలోనే తనకు కాలికి గాయమైన విషయాన్ని రాధిక బయటపెట్టింది. అప్పటి ఆల్బమ్స్, పాత ముచ్చట్లని వీళ్లిద్దరూ గుర్తుచేసుకున్నారు. కొన్నిరోజుల ముందు 'యానిమల్' చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..)A bond for life with #sivakumar anna, who came to see me as I am recovering from a leg procedure.shared so much on drawings , pictures and our travel 🙏🙏🙏🙏 pic.twitter.com/qxwuBMZD4q— Radikaa Sarathkumar (@realradikaa) May 18, 2024 -
Lok sabha elections 2024: మాణిక్కం ఠాగూర్ వర్సెస్ రాధిక
సాక్షి, న్యూఢిల్లీ: డీఎంకేతో పొత్తులో భాగంగా తమిళనాడులో పోటీ చేస్తున్న తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. శుక్రవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో విరుధునగర్ సహా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. విరుధునగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మరోసారి బరిలో దిగుతున్నారు. మరోవైపు ఈ స్థానాన్ని సినీ నటి రాధికా శరత్‌కుమార్‌కు కేటాయిస్తూ బీజేపీ కూడా శుక్రవారమే నిర్ణయం తీసుకుంది! దాంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. 2009లో కూడా ఇక్కడ మాణిక్కం నెగ్గారు. 2014లో డీఎంకే, కాంగ్రెస్ విడిగా పోటీ చేయడంతో అన్నాడీఎంకే అభ్యర్థి టి.రాధాకృష్ణ భారీ గెలుపొందారు. 2019లో కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేయడంతో మాణిక్కం ఠాగూర్ మరోసారి నెగ్గారు. డీఎంకే మద్దతుతో ఈసారీ సునాయాసంగా నెగ్గుతామని కాంగ్రెస్ భావిస్తోంది. -
బీజేపీ నాలుగో జాబితా విడుదల
సాక్షి, చెన్నై: లోక్‌సభ అభ్యర్థుల కోసం బీజేపీ నాలుగో జాబితా శుక్రవారం విడుదల చేసింది. తమిళనాడు నుంచి 14 స్థానాలకు, అలాగే.. పుదుచ్చేరి నుంచి ఒక స్థానానికి అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మొత్తం 16 మందిలో పీ కార్తికేయిని చిదంబరం(ఎస్సీ నియోజకవర్గం) నుంచి అభ్యర్థిగా ఎంపిక చేసింది. కార్తికేయిని 2017లో అన్నాడీఎంకే నుంచి బీజేపీలో చేరారు. నటి నుంచి పొలిటీషియన్‌గా మారిన రాధికా శరత్‌కుమార్‌కు విరుద్‌నగర్ టికెట్ ఇచ్చింది. రాధిక భర్త శరత్ కుమార్ స్థాపించిన అఖిల ఇండియా సమతువ మక్కల్ కల్చి(AISMK)ను ఈమధ్యే బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ మూడో జాబితా గురువారం రిలీజ్ కాగా.. 9 మంది లిస్ట్‌లో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్‌తో పాటు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలైతో పాటు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి కూడా టికెట్ కేటాయించారు. #BJP 2nd list of candidates for TN.. Actress @realradikaa to contest from #VirudhuNagar #LokSabhaElections2024 #AbkiBaar400Paar#TNBJP #INDIAAlliance #nda #TamilNadu #KAnnamalai pic.twitter.com/vPBj6YTX8M — நிலேஷ் மகாதேவ்🔱 (@NileshMahadev) March 22, 2024 -
వరలక్ష్మి శరత్‌కుమార్ బర్త్ డే.. సర్ప్రైజ్ చేసిన రాధిక
నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి నేడు (మార్చి 5) 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాధిక ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ రేర్ ఫోటోలతో ఓ వీడియోను విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు. నటుడు శరత్‌కుమార్ 1984లో ఛాయాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జన్మించిన కూతురే వరలక్ష్మి. 2000 సంవత్సరంలో శరత్‌కుమార్ ఛాయతో విడాకులు తీసుకుని నటి రాధికను ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయ ప్రస్తుతం తన కూతురు వరలక్ష్మితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన తండ్రి బాటలోనే సినిమా ఇండస్ట్రీలో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ నటిగా ఆమె కొనసాగుతున్నారు. కొద్దిరోజులుగా ఆమె నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలుస్తోంది. దీంతో ఆమెకు భారీ అవకాశాలు వస్తున్నప్పటికీ సెలెక్టెడ్ సినిమాలకే ప్రధాన్యత ఇస్తూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే వరలక్ష్మి పెళ్లి వార్త చెప్పింది. ఆమె త్వరలో నికోలయ్ సచ్దేవ్ను పెళ్లి చేసుకోబోతోంది. ముంబైలో ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్న అతనితో చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. వరలక్ష్మి శరత్‌కుమార్ నేడు పుట్టినరోజు సందర్భంగా మొదట రాధిక ప్రేమతో ఒక వీడియో క్రియేట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వరలక్ష్మి ఫ్యాన్స్ కూడా విషెష్ చెబుతూ మెసేజ్‌లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
విదేశీ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటి.. పోస్ట్ వైరల్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి రాధిక శరత్ కుమార్. డేరింగ్ అండ్ డాషింగ్ నటిగా 1978లో భారతీరాజా దర్శకత్వం వహించిన కిళక్కే పోగుమ్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విజయం తర్వాత నటిగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. (ఇది చదవండి: మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!) తమిళం, తెలుగు, మలయాళం, హిందీ ఇలా పలు భాషల్లో ప్రముఖ హీరోల సరసన కథానాయకిగా నటించి బహుభాషా నటిగా రాణించారు. ఆ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి వివిధ రకాల పాత్రలో ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా 2001 వివాహం చేసుకున్నారు. అలా తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలను చూసిన రాధిక శరత్ కుమార్ నిర్మాతగాను కొన్ని చిత్రాలు చేశారు. అదే విధంగా సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. తాజాగా స్వదేశీ భాషలను అధిగమించి ఫ్రెంచ్ చిత్రంలో నటించడం విశేషం. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఆ చిత్రంలో నటించడానికి ఫ్రాన్స్ దేశానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ఆ చిత్ర షూటింగ్లో తన ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అందులో తాను ఫ్రెంచ్ చిత్రంలో నటించడానికి ప్రోత్సహించిన తన భర్త శరత్ కుమార్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి!) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
టీడీపీ సత్యనారాయణపై నటి రాధిక సీరియస్.. మంత్రి రోజాకు మద్దతు
సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి రోజాకు సినీనటి రాధికా శరత్‌కుమార్ అండగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రాధిక తప్పుపట్టారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా మరో సినీ నటి రాధిక.. మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రాధిక తప్పుపట్టారు. వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణను డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? చివరికి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తారా?. దీని వల్ల మేము భయపడబోము. ఇలా మాటలతో హింసించడం సిగ్గు చేటు. I condemn below the belt hitting , labelling women, objectifying and being unparliamentary, an ex minister #bandarasatyanarayana has no qualms with his language and attitude. I stand for minister /actor amd good friend @RojaSelvamaniRK #women #harassment #politics pic.twitter.com/nmGHyeLgi2 — Radikaa Sarathkumar (@realradikaa) October 6, 2023 బండారు సత్యనారాయణ వెంటనే క్షమాపణలు చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోండి. రోజాకు నేను అండగా ఉంటాను. ఇంత నీచంగా మాట్లాడటం దారుణం. ఇవి లో క్వాలిటీ పాలిటిక్స్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ వివక్షపై ప్రధాని మోదీ దృష్టి సారించాలి అని వీడియోలో రాధిక తెలిపారు. మంత్రి రోజాకు నటి కుష్బూ సపోర్ట్.. ఇదిలా ఉండగా, అంతకుముందు.. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సినీ నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని, తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా?. ఓ మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం. మహిళలను గౌరవించేవారు ఎవరూ బండారులా మాట్లాడరు. బండారు ఒక సగటు మనిషిగా కూడా విఫలమయ్యారు సీరియస్ అయ్యారు. ఈ విషయంలో మంత్రి రోజా నా మద్దతు ప్రకటిస్తున్నా. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండారు క్షమాపణలు చెప్పే దాకా సాగే పోరాటంలో తాను కలుస్తానని చెప్పారు. మహిళల కోసం రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ అధినియం బిల్లు) ప్రధాని మోదీ తెచ్చారని, మహిళ సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వాళ్లు మహిళా నేతలను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడతారా..? అని కుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. -
రాధికా శరత్‌కుమార్‌కు గోల్డ్ రింగ్ గిఫ్టుగా ఇచ్చిన లారెన్స్
కంగనా రనౌత్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న సినిమా చంద్రముఖి-2. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 17 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా చంద్రముఖి–2 సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి తొలిభాగం దర్శకత్వం వహించిన పి. వాసునే తెరకెక్కించారు. ఇందులో లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, వడివేలు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. చదవండి: హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్ ఇక ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ మాసంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్లో లారెన్స్ తనకు బంగారు ఉంగరంతో పాటు ఖరీదైన వాచీ గిఫ్టుగా ఇచ్చినట్లు నటి రాధికా శరత్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు లెరన్స్తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఖుషీ అయ్యారు. -
నయనతార-విగ్నేశ్ల ఇంటికి వెళ్లిన రాధికా శరత్‌కుమార్
తమిళసినిమా: సంచలన నటి నయనతార దర్శకుడు విగ్నేశ్ శివన్‌ల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 2016 నుంచి ఈ జంట సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా గత జూన్‌లో ఈ ప్రేమ జంట వివాహం చేసుకున్నారు. అయితే నయనతార విజయ్ సేతుపతి జంటగా నటించిన నానుమ్ రౌడీదాన్ చిత్రానికి విగ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. అప్పుడే నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య ప్రేమ చిగురించింది. కాగా ఈ జంట అద్దె తల్లి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలోనూ సంచలనం కలిగించారు. పలు వురి విమర్శల మధ్య ఇది ప్రభుత్వం వరకు వెళ్లింది. నయనతార విగ్నేశ్శివన్లకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు సమన్లు జారీ చేయడం, వారు వి వరణ ఇవ్వడం విచారణ వంటి సంఘటన తరువాత అన్నీ సక్రమమే అన్న ప్రత్యేక కమిటీ ప్రకటనతో నయనతార విఘ్నే ష్ శివన్‌లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు అందించా రు. తాజాగా నటి రాధికాశరత్‌కుమార్ స్వయంగా స్థానిక ఎగ్మోర్‌లోని నయనతార ఇంటికి వెళ్లి ఆమె కవల పిల్లలను చూశారు. అలాగే నయనతార విఘ్నేష్ శివన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి, నయనతార కవల పిల్లలు చాలా బాగున్నారు అంటూ పేర్కొన్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
సీనియర్ నటి రాధిక సినిమాలో హీరోగా చిరంజీవి..
Chiranjeevi Movie With Radhika Sarathkumar Radaan Banner: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం 'ఆచార్య'తో ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదే కాకుండా చిరంజీవి చేతిలో మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్‌తోపాటు బాబీ డైరెక్షన్లో మెగా154 చిత్రం సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. తాజాగా చిరంజీవి మరో సినిమాలో నటించనున్నట్లు సమాచారం. సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ నిర్మాణంలో ఓ కొత్త సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఫిషియల్‌గా ఆదివారం (మే 1) సోషల్ మీడియా వేదికగా రాధిక తెలిపారు. భవిష్యత్తులో మా రాడాన్ బ్యానర్లో ప్రాజెక్ట్ చేసేందుకు మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. కింగ్ ఆఫ్ మాస్ అయిన మీతో బ్లాక్ బస్టర్ తీసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని రాధిక ట్వీట్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. చదవండి: అజిత్-విజయ్‌తో మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. Thank you dear @KChiruTweets for giving your consent to do a project for #radaan @realsarathkumar In the near future. Looking forward to making a blockbuster with the King of Mass🙏🙏🙏 — Radikaa Sarathkumar (@realradikaa) May 1, 2022 -
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ రివ్యూ
-
తారలు కలిసి మెరిశారు: చాలా ఎంజాయ్ చేశాం!
తమిళసినిమా: 1980 సంవత్సరంలో ప్రముఖ కథానాయకులు, నాయకిలుగా వెలుగొందిన తారలు కొన్ని ఏళ్లుగా ఏడాదికోసారి ఒక చోట కలిసి సరదాగా గడపడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. దక్షిణాదికి చెందిన రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, నటీమణులు రాధిక శరత్‌కుమార్, సుహాసిని, అంబిక, రాధ, లిజి మొదలగు పలువురు నటీనటులు ఏడాదికి ఒకసారి ఒక ఫాంహౌస్లాంటి ప్రాంతంలో కలుసుకుని తమ అనుభవాలను, అనుభూతులను పంచుకుంటుంటారు. అదేవిధంగా ఈ వీకెండ్లో 1980లో ప్రముఖ నాయికలుగా రాణించిన నటీనటులు చెన్నైలో కలుసుకుని సరదాగా ముచ్చట్లు చెప్పుకొని పసందైన విందు ఆరగించి ఆనందంగా గడిపారు. అలా కలుసుకున్న వారిలో నటి రాధిక శరత్‌కుమార్, కుష్బూ, సుహాసిని, రాధ, అంబిక, పూర్ణిమా భాగ్యరాజ్, లిజి, నటుడు రఘు వున్నారు. ఫొటోలను నటి రాధిక శరత్‌కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ 1980లలో ప్రముఖ హీరో హీరోయిన్లుగా రాణించిన వారందరూ ఇప్పటికీ సన్నిహితంగా మెలుగుతున్నారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా తాము కలుసుకోలేకపోయామని ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుతో ఈ వీకెండ్లో మళ్లీ తామంతా కలుసుకుని గత అనుభవాలను, అనుభూతులను పంచుకుని ఆనందంగా గడిపినట్లు తెలిపారు. ఇందుకు స్పందించిన ఖుష్బూ సుందర్.. ‘‘చాలా చాలా ఎంజాయ్ చేశాం. ఎంతో ఉల్లాసంగా గడిపాం’’ అని పేర్కొన్నారు. -
ఉక్కు మనిషికి హ్యాపీ బర్త్‌డే: రాధికా శరత్‌కుమార్
Sarathkumar Birthday: తమిళ సినీ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్ నేడు(జూలై 14న) 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, నటి రాధిక సోషల్ మీడియా వేదికగా భర్తకు బర్త్‌డే విషెస్ తెలిపింది. 'ఉక్కు మనిషి, బంగారం లాంటి మంచి మనసున్న శరత్‌కుమార్‌కు హ్యాపీ బర్త్‌డే' అంటూ ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో తన ఫ్యామిలీ ఫొటోలతో పాటు రాధిక శరత్‌తో కలిసి దిగిన ఫొటోలను మనం చూడొచ్చు. పనిలో పనిగా తన ఫోన్ వాల్‌పేపర్‌ను కూడా రివీల్ చేసిందీ నటి. అలాగే శరత్ తనలోని పాకశాస్త్ర నిపుణుడికి పని చెప్తూ కిచెన్‌లో వంట చేయడం కూడా కనిపిస్తోంది. కాగా శరత్‌కుమార్ 1986లో 'సమాజంలో స్త్రీ' అనే తెలుగు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో నెగెటివ్ రోల్స్ చేసిన ఆయన తర్వాత సపోర్టింగ్ రోల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని అనతికాలంలోనే హీరోగా మారాడు. 2007లో సొంతంగా పార్టీ స్థాపించి రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. పొలిటికల్ రంగంలోనూ శరత్ విజయాన్ని సాధించడం విశేషం. Man of steel , heart of gold @realsarathkumar Happy birthday pic.twitter.com/bhLvRo1d3O — Radikaa Sarathkumar (@realradikaa) July 14, 2021 Happppppppyyyyyyyy birthdayyyyyyyy daddyyyyy..... you are the strongest person I know..love you to the mooonnnnn n backkkkkkkkk times infinity..😘😘😘😘 thank you for being you..have a fantastic day daddy...!! @realsarathkumar pic.twitter.com/ITBUxQIUbj— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) July 14, 2021 -
కరోనా వ్యాక్సిన్ వేసుకున్న సీనియర్ నటి
‘మెడ్రాస్ ఎన్నా... మెల్బోర్న్ ఎన్నా’... అనే పాటలో ఇటీవల యాక్ట్ చేసి వచ్చారు రాధిక ‘ఓ అంధ నాట్కల్’ అనే తాజా తమిళ సినిమా కోసం. ఇప్పుడు ‘కోవిడ్ ఎన్నా’ అంటారేమో. ఎందుకంటే మలి విడత వాక్సినేషన్ లో దక్షిణాది సినిమా రంగం నుంచి దాదాపుగా రాధికనే మొదటి డోస్‌ను వేసుకున్నారని చెప్పవచ్చు. కమలహాసన్, చారుహాసన్ తదితరులు తరువాతి వరుస లో ఉన్నారు. నర్సులు తనకు వేక్సిన్ వేస్తున్న ఫోటోను ట్విట్టర్లో పెట్టి ‘వేక్సిన్ వేసుకున్నాను. దయచేసి మిమ్మల్ని, మీ ఆత్మీయుల్ని వేక్సిన్ ద్వారా రక్షించుకోండి’ అని కామెంట్ పెట్టారు. చిరంజీవి, రజనీకాంత్, కృష్ణ, కృష్ణంరాజు, చంద్రమోహన్ వంటి స్టార్లందరితో రాధిక కలిసి నటించారు. అయితే వేక్సిన్ విషయంలో అందరికంటే ముందు ఉన్నారు. రాధిక ఏనాడూ నటన నుంచి విరామం తీసుకోలేదు. పెద్ద తెర మీదా లేదా చిన్నతెర మీద నటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒకనాటి హీరోయిన్లు సుహాసిని, ఊర్వశి, ఖుష్బూలతో కామెడీ సినిమాగా ‘ఓ అంధ నాట్కల్’లో నటిస్తున్నారు. ఇది తెలుగులో తప్పక అనువాదం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాధిక తెలుగు తెర మీద ఇటీవ కనిపించిన సినిమా ‘రాజా ది గ్రేట్’ అని పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఆమె భర్త శరత్ కుమార్ కూడా తెలుగులో తరచూ నటిస్తున్నారు. చదవండి: గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు -
ఎన్నికల బరిలో సినీ నటి రాధిక
సాక్షి, చెన్నై: సినీ నటి రాధిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఎస్ఎంకే నేత శరత్‌కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. నటిగా రాధిక అందరికీ సుపరిచితురాలే. భర్త శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి మహిళా విభాగం ఇన్చార్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు. శరత్‌కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాధిక పోటీ చేయనున్నారని ప్రకటించారు. అన్నాడీఎంకే కూటమిలోనే ఉన్నామని, అధిక సీట్లు ఆశిస్తున్నామని ప్రత్యేక చిహ్నంపై పోటీ చేస్తామన్నారు. బీజేపీలోకి కరాటే.. కాంగ్రెస్‌లో ఏళ్ల తరబడి శ్రమించిన నేత కరాటే త్యాగరాజన్. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినానంతరం రజనీకాంత్ పార్టీ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. దీంతో త్వరలో ఆయన బీజేపీలోకి చేరడం ఖాయం అని మద్దతుదారులు పేర్కొంటున్నారు. రాహుల్ పర్యటనలో మార్పు.. తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని ముగించిన రాహుల్‌గాంధీ మలి విడతకు సిద్ధమయ్యారు. 14 నుంచి ఆరు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే, 14వ తేదీ ప్రధాని రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన నున్నారు. దీంతో రాహుల్ పర్యటనలో స్వల్పమార్పులు తప్పలేదు. ఈనెల పదిహేను తర్వాత రాహుల్ పర్యటన తేదీ ప్రకటించనున్నారు. -
తమిళ నటుడికి కరోనా పాజిటివ్
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్‌కు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి రాధిక సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించారు. లక్షణాలేవీ లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతూ కూతురు వరలక్ష్మి శరత్‌కుమార్ ట్వీట్ చేశారు. (చదవండి: థియేటర్లలో చంపడానికి రాబోతుంది: ఆర్జీవీ) కాగా శరత్ ప్రస్తుతం "పొన్నియిన్ సెల్వన్" చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే జీవీ ప్రకాశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఆడంగత్తె' సినిమాలోనూ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఆయన కూతురు వరలక్ష్మి విషయానికి వస్తే.. పలు సినిమాల్లో నటించిన ఆమె 'కన్నామూచ్చి' అనే తమిళ సినిమాతో దర్శకురాలిగా మారబోతున్నారు. కన్నామూచ్చి అంటే తెలుగు దాగుడుమూతలు అని అర్థం. అలాగే తెలుసులో రవితేజ ‘క్రాక్’, అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాల్లో నటిస్తున్నారు. (చదవండి: ఒకరికొకరు నిలబడదాం: వరలక్ష్మి శరత్‌కుమార్) Today Sarath tested positive for Coronavirus in Hyderabad. He’s asymptomatic and in the hands of extremely good doctors! I will keep you updated about his health in the days to come. @realsarathkumar @rayane_mithun @imAmithun_264 @varusarath5 — Radikaa Sarathkumar (@realradikaa) December 8, 2020 -
డెవిల్స్ ఎట్ వర్క్
మళ్లీ సినిమా షూటింగ్ ప్రారంభించాను అన్నారు నటి రాధికా శరత్ కుమార్. దీపక్ సౌందరరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఓ కామెడీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారామె. విజయ్ సేతుపతి, తాప్సీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఆదివారం చిత్రీకరణలో పాల్గొన్నారు రాధిక. తాప్సీతో దిగిన ఓ ఫోటోను షేర్ చేసి, ‘డెవిల్స్ ఎట్ వర్క్’ (పనిలో ఉన్న దెయ్యాలు) అని కామెంట్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో కొద్దిమంది చిత్రబృందంతో జరుగుతోంది. 80 శాతం చిత్రీకరణ ఇక్కడే పూర్తి చేయనున్నారట. ఏడాది చివరి కల్లా సినిమాను పూర్తి చేస్తారట కూడా. -
చిరు ఇంట్లో అలనాటి తారల సందడి
దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన 80వ దశకపు తారలంతా ప్రతి ఏటా ఏదో ఒకచోట చేరి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి రీయూనియన్‌కు మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదికైంది. ఇందుకోసం చిరంజీవి తన ఇంట్లో అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అలనాటి ప్రముఖ నటీనటులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ వేడుకలో రాధిక, శరత్‌కుమార్, ప్రభు, భానుచందర్, మోహన్‌లాల్, రెహమాన్, వెంకటేశ్, సరిత, లిజీ, సుభాషిణితో పాటు పలువురు తారలు పాల్గొన్నారు. ఈ వేడుకలో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. అలాగే రాధిక శరత్‌కుమార్ కూడా తన తోటి తారలతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 80వ దశకపు తారలు అందరు ఇలా రీయూనియన్ కావడం ఇది పదోసారి. అప్పట్లో తీరిక లేకుండా గడిపిన వీరంతా ఇలా ఒకచోట చేరి సందడి చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అమితాబ్ బాటలో రాధిక కానీ..
వెండితెర మీద ఎంత పాపులారిటీ సంపాదించారో.. బుల్లి తెర మీద కూడా అదే స్థాయిలో అభిమానులను అలరించారు సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్. ఇన్ని రోజుల్లో టీవీ సీరియల్స్‌తో అలరించిన త్వరలో హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) విశేష ఆదర సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళంలో కేబీసీ మాదిరి ‘కోడీశ్వరి’(కోటీశ్వరి) గేమ్ షోను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్విజ్ షోకు రాధిక హోస్ట్‌గా ఉండనున్నారు. అయితే కేబీసీలో మహిళలకు, పురుషులకు అవకాశం కల్పించగా.. కోడీశ్వరిలో కేవలం మహిళలు మాత్రమే పాల్గొనేందకు అవకాశం కల్పించారు. ఈ షో కలర్స్ తమిళ్ చానల్లో ప్రసారం కానుంది. ఈ షోకు సంబంధించి రాధిక లుక్‌తో కూడిన చిన్న టీజర్‌ను ఆ చానల్ విడుదల చేసింది. కాగా, ఈ షో డిసెంబర్ నుంచి ప్రసారం కానున్నట్టుగా తెలుస్తోంది. கலர்ஸ் தமிழ் பெருமையுடன் வழங்கும் உலகத்தின் மிகப்பெரிய வண்ணமயமான "கேம் ஷோ..!!". முதல்முறையாகப் பெண்கள் மட்டுமே கலந்துகொள்ளும் ஒரு பிரம்மாண்டமான மேடை 'கோடீஸ்வரி'..!!#ColorsKodeeswari | #ColorsKOD | #ColorsTamil | @realradikaa pic.twitter.com/kt4FetFfaK — Colors Tamil (@ColorsTvTamil) October 17, 2019 అయితే కేబీసీ ఆధారంగా తమిళంలో ఇదివరకే ‘నీంగలుమ్ వెల్లాలుమ్ ఒరు కోడీ’పేరుతో ఓ షో ప్రసారం అయింది. మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకు సూర్య, ప్రకాశ్‌రాజ్, అరవింద్‌స్వామిలు ఒక్కో సీజన్లో హోస్ట్‌లుగా వ్యవహరించారు. పలు భారతీయ భాషల్లో కూడా కేబీసీ ఆధారంగా ఇప్పటికే షోలు వచ్చిన సంగతి తెలిసిందే. -
నవ్వించే ఇట్టిమాణి
‘ఒడియన్, లూసిఫర్’ సినిమాలలో పూర్తి సీరియస్ పాత్రలను చేశారు మోహన్‌లాల్. ప్రస్తుతం వాటికి భిన్నంగా పూర్తిస్థాయి హాస్య చిత్రం చేశారు. ‘ఇట్టిమాణి: మేడ్ ఇన్ చైనా’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. జిబి, జోజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చైనా దేశ మూలాలున్న త్రిచూర్ క్రిస్టియన్ పాత్రలో మోహన్‌లాల్ నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. హనీ రోస్, రాధికా శరత్‌కుమార్, సిద్ధిఖీ ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలోనే సినిమా రిలీజ్ కానుంది. -
విశాల్‌పై రాధిక ఫైర్
నడిగర్ ఎన్నికలు ఈ సారి మరింత రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి గెలిచి సత్తా చాటాలని విశాల్ సారధ్యంలోని పాండవర్ టీం ప్రయత్నిస్తుంది. అయితే ఈ సారి విశాల్ టీంకు వ్యతిరేకంగా భాగ్యరాజ్ బరిలో దిగటంతో పోటి ఆసక్తికరంగా మారంది. ప్రచారంలో భాగంగా విశాల్ ఇటీవల విడుదల చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. గత కమిటీలపై దుమ్మెత్తిపోస్తూ గత ఎన్నికలలో కొందరు శరత్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యల వీడియోలను ట్వీట్లుగా యూట్యూబ్ ద్వారా మళ్లీ తెరపైకి తెచ్చాడు విశాల్. అయితే ఈ వీడియోలపై శరత్ కుమార్ భార్య సీనియర్ నటి రాధిక, కుమార్తె వరలక్ష్మిలు తీవ్రస్థాయిలో చిరుచుకు పడుచున్నారు. ఇప్పటికే విశాల్‌కు ట్విటర్ ద్వారా బహిరంగ లేఖ రాసిన వరలక్ష్మీ శరత్‌కుమార్ నా ఓటును కోల్పోయావ్ అంటూ ట్వీట్ చేశారు. గతంలో ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ బయటపెట్టడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై సీనియర్ నటి, శరత్‌కుమార్ సతీమణి రాధిక స్పందించారు. నిజంగా శరత్ కుమార్ తప్పు చేసుంటే న్యాయస్థానం తేల్చుతుందని, న్యాయస్థానంలో ఉన్న కేసుపై విశాల్ వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం అని ఆమె మండిపడ్డారు. అంతేకాదు.. నిజంగానే విశాల్ టీమ్ ఈ రెండేళ్ళలో అభివృద్ది చేసుంటే వాటిని చూపించి ఓట్లు అడగాలి, కాని పాత విషయాలు, న్యాయస్థానంలో ఉన్న విషయాలను విశాల్ మాట్లాడుతున్నారంటే ఆయనకు నడిగర్ సంఘానికి చేసింది ఏమిలేదని అర్థం అవుతుందన్నారు. ఇదే ఇప్పుడు విశాల్ కు ఇబ్బందులు తెచ్చిపడుతుంది. 23న నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్న వేళ రాధిక, వరలక్ష్మిలతోపాటు మరికొందరు సీనియర్ల విమర్శలు దక్షిణాది సినిమా నటీనటుల సంఘంలో చర్చనీయాంశంగా మారింది. -
తృటిలో బయటపడ్డ సినీ నటి రాధిక
సాక్షి, చెన్నై : శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది. సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను ఖాళీ చేశారు. ఈ ఘటనపై రాధిక ట్వీటర్లో స్పందిస్తూ... ‘ పేలుళ్ల గురించి విని షాకయ్యాను. పెలుళ్లకు కొద్ది నిమిషాల ముందు నేను అక్కడే బస చేశా. అక్కడ బాంబు పేలుళ్లు జరిగియాంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. దేవుడు అందరితో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్విట్ చేశారు. OMG bomb blasts in Sri Lanka, god be with all. I just left Colombo Cinnamongrand hotel and it has been bombed, can’t believe this shocking. — Radikaa Sarathkumar (@realradikaa) 21 April 2019 శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం వరుస బాంబ్ పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 165 మంది మృతి చెందగా, 280మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్న భక్తులను లక్ష్యంగా పెట్టుకొని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. షాంగ్రి లా హోటల్, కింగ్స్ బరీ హోటల్లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. చదవండి : బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో