దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన 80వ దశకపు తారలంతా ప్రతి ఏటా ఏదో ఒకచోట చేరి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి రీయూనియన్‌కు మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదికైంది. ఇందుకోసం చిరంజీవి తన ఇంట్లో అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అలనాటి ప్రముఖ నటీనటులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ వేడుకలో రాధిక, శరత్‌కుమార్, ప్రభు, భానుచందర్, మోహన్‌లాల్, రెహమాన్, వెంకటేశ్, సరిత, లిజీ, సుభాషిణితో పాటు పలువురు తారలు పాల్గొన్నారు.
ఈ వేడుకలో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అలాగే రాధిక శరత్‌కుమార్ కూడా తన తోటి తారలతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 80వ దశకపు తారలు అందరు ఇలా రీయూనియన్ కావడం ఇది పదోసారి. అప్పట్లో తీరిక లేకుండా గడిపిన వీరంతా ఇలా ఒకచోట చేరి సందడి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment