South cinema
-
టాప్ పెయిడ్ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిందెవరో తెలిస్తే..షాక్‌వుతారు
Trisha Krishnan సౌత్ ఇండియన్ సినిమాలో హీరోయిన్ల్ హవా కొనసాగుతోంది. ఒకర్ని మించి ఒకరు పలుభాషల హీరోయిన్లు తమ సత్తా చాటుకుంటున్నారు అందం, అభినయంతో స్టార్ హీరోలకు ధీటుగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఏ-లిస్ట్ హీరోలు సినిమా చేయడానికి చాలా ఎక్కువ ఫీజు తీసుకుంటారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇపుడిక సౌత్ టాప్ హీరోయిన్లు ఫీజు చాలా మంది బాలీవుడ్ నటుల ఫీజు కంటే ఎక్కువే అనడంలో ఎలాంటి సందేహంలేదు. తాజాగా ఈ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష కృష్ణన్. ఫిన్‌క్యాష్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, మణిరత్నం చిత్రం 'పొన్నియన్ సెల్వన్' తర్వాత త్రిష స్టార్ వాల్యూ ఒక రేంజ్లో పెరిగిందట. త్రిష తన నెక్ట్స్ మూవీకి రూ. 10 కోట్లు వసూలు చేస్తుందని, తద్వారా సౌత్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా అవతరించింది. త్రిష త్వరలో విజయ్ దళపతితో కలిసి 'లియో' చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రాన్నిఅక్టోబర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 14 ఏళ్ల విరామం తర్వాత విజయ్, త్రిష జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. (15 ఏళ్ల స్టార్టప్ సీఈవోకి లింక్డ్ఇన్లో నిషేధమా? ట్వీట్ వైరల్) మల్టీ స్టారర్ 'పొన్నియన్ సెల్వన్' రెండు భాగాలుగా విడుదలైంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్న ఈ చిత్రంలో త్రిష ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఈ మూవీల్లోతన అద్భతమైన నటనతో ఆకట్టుకుంది. అంతకుమంచిన అందంతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. కాగా టాలీవుడ్ టాప్ స్టార్ సమంత రూత్ ప్రభు 'సిటాడెల్ ఇండియా' కనిపించనుంది. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప లోని ఐటెం సాంగ్ 'ఊ అంటావా' తో సామ్ పాపులారీటీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తన ఫీజును పెంచిందని, ‘సిటాడెల్ ఇండియా’ వెబ్ సిరీస్ కోసం 10 కోట్ల రూపాయలను ఛార్జ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ధృవీకరణ ఏదీ లేదు. (హైదరాబాద్‌లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?) -
సౌత్, నార్త్ అని మాట్లాడితే అస్సలు నచ్చదంటున్న అక్షయ్
సౌత్ మూవీ, నార్త్ మూవీ, పాన్ ఇండియా సినిమా.. ఇలా విభజించి మాట్లాడటం తనకు నచ్చదంటున్నాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. అతడు ప్రధాన పాత్రలో నటించిన పృథ్వీరాజ్ మూవీ తెలుగు, తమిళం, హిందీలో జూన్ 3న విడుదలవుతోంది. చంద్రప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అక్షయ్ మహారాజు పృథ్వీరాజు చౌహాన్‌గా నటించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీని ఉత్తరాది, దక్షిణాది అని ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నాడు. ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడితే అంతే చాలన్నాడు. బ్రిటీష్ పాలకులు ఇండియాను విభజించి పాలించారని, ఇప్పటికీ దాని నుంచి మనం ఏమీ నేర్చుకోలేదని అనిపిస్తోందని తెలిపాడు. ఉన్నది ఒకటే ఇండస్ట్రీ అని, దాన్ని మెరుగుపర్చేందుకు మనమందరం కలిసి పని చేయాలన్నాడు. అంతేకానీ సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ అని మాట్లాడితే తనకసలు నచ్చదన్నాడు. చదవండి 👉🏾 బెడ్ సీన్ గురించి నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా హీరోయిన్ రిప్లై నా నామినేషన్స్ బాగా నచ్చాయట, కాబట్టి మళ్లీ వెళ్తా: మిత్ర -
సౌత్ డైరెక్టర్ నాతో దారుణంగా ప్రవర్తించాడు: హీరోయిన్
హీరోయిన్ నిక్కీ తంబోలీ హిందీ బిగ్‌బాస్ 14లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమెకు ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచిమంచి ఆఫర్లు వస్తున్నాయట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు దక్షిణాదిలో ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. 'నాకిప్పటికీ గుర్తుంది, ఓ సౌత్ డైరెక్టర్ నాతో ప్రవర్తించిన తీరు నాకస్సలు నచ్చలేదు. సెట్స్‌లో నాతోపాటున్న డ్యాన్సర్స్ అందరినీ మెచ్చుకుంటున్నాడు. నన్ను మాత్రం ఎక్కడినుంచి వస్తారో నీలాంటి వాళ్లు? అంటూ చులకన చేసి మాట్లాడాడు. అప్పుడు నాకు అక్కడి భాష మాట్లాడానికి వచ్చేది కాదు. కానీ అతడు మాత్రం చాలా చెత్తగా ప్రవర్తించాడు. విదేశాల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో నన్ను చీప్‌గా చూస్తూ దారుణంగా ప్రవర్తించేవాడు. నేను ఇంటికి వచ్చాక చాలా ఏడ్చేదాన్ని. కానీ మధ్యలో వెనకడుగు వేయలేదు. ఎందుకంటే ఎప్పటికైనా అతడు తన తప్పు తెలుసుకుని ఫీల్ అవుతాడని భావించాను. ఇప్పటికీ ఆయన నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నాడు. కాలం అన్నింటినీ మార్చేస్తుంది' అని చెప్పుకొచ్చింది. కాగా నిక్కీ తంబోలి తెలుగులో 'చీకటి గదిలో చితక్కొట్టుడు', 'కాంచన 3', 'తిప్పరా మీసం' వంటి చిత్రాల్లో నటించింది. చదవండి: నా ఫ్రెండ్స్ నన్ను ద్వేషించేవారు, ఎన్నో కష్టాలు అనుభవించాను డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతిపై అనుమానాలు, లిక్కర్ ఎక్కువవడం వల్లే.. -
ధనుష్‌ను బీట్ చేసిన మహేష్
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనను అనుసరించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తాజాగా మహేష్ ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య 9 మిలియన్లు దాటింది. దీంతో సౌత్ ఇండియాలో 9 మిలియన్ల ట్విటర్ ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి నటుడిగా మహేష్ నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మహేష్.. తన కొత్త ప్రాజెక్టులతో పాటు, ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటారు. అలాగే ఇతర నటులకు విషెస్ చెప్పడంతోపాటు.. సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. సినిమాల విషయానికి వస్తే.. సరిలేరు నీకెవ్వరు తర్వాత తను చేయబోయే సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు చిరంజీవి–కొరటాల శివ కాంబినేషన్లో చేస్తున్న సినిమాలో మహేశ్ ఓ కీలక పాత్ర చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, సౌత్ ఇండియా నటుల్లో మహేష్ తర్వాత ధనుష్‌కు ట్విటర్లో 8.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత సౌత్‌లో సమంతకు 7.8, శృతిహాసన్‌కు 7.5, మోహన్‌లాల్‌కు 5.9, నాగార్జునకు 5.9, రానాకు 5.8, శివకార్తికేయన్‌కు 5.8, రజనీకాంత్‌కు 5.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. -
చిరు ఇంట్లో అలనాటి తారల సందడి
దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన 80వ దశకపు తారలంతా ప్రతి ఏటా ఏదో ఒకచోట చేరి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి రీయూనియన్‌కు మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదికైంది. ఇందుకోసం చిరంజీవి తన ఇంట్లో అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అలనాటి ప్రముఖ నటీనటులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ వేడుకలో రాధిక, శరత్‌కుమార్, ప్రభు, భానుచందర్, మోహన్‌లాల్, రెహమాన్, వెంకటేశ్, సరిత, లిజీ, సుభాషిణితో పాటు పలువురు తారలు పాల్గొన్నారు. ఈ వేడుకలో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. అలాగే రాధిక శరత్‌కుమార్ కూడా తన తోటి తారలతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 80వ దశకపు తారలు అందరు ఇలా రీయూనియన్ కావడం ఇది పదోసారి. అప్పట్లో తీరిక లేకుండా గడిపిన వీరంతా ఇలా ఒకచోట చేరి సందడి చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మణిరత్నం చిత్రంలో బొమ్మాళి?
సాక్షి, తమిళ సినిమా : మణిరత్నం చిత్రంలో అనుష్క నటించనుందా? అంటే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఎన్నో భారీ చిత్రాలను, వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రాలను వెండితెరపై తనదైన శైలిలో ఆవిష్కరించి సంచలన విజయాలను అందుకున్న దర్శకుడు మణిరత్నం. ప్రస్తుతం ఆయన ఒక మహాయజ్ఞానికి సిద్ధం అవుతున్నారు. ఎంజీఆర్, కమలహాసన్ వంటి దిగ్గజాలు నటించాలని ఆశపడ్డ ‘పొన్నియన్ సెల్వన్’ కథను తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. గతంలోనే ఈ ప్రాజెక్టును చేపట్టినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుకు సాగించలేకపోయారు. ఇప్పుడు పట్టువీడని విక్రమార్కుడిలా పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించడానికి మణి సిద్ధమయ్యారు. ఈసారి మరింత భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. కోలీవుడ్ నుంచి కార్తీ, జయంరవి, విక్రమ్, టాలీవుడ్ నుంచి మోహన్‌బాబు, మాలీవుడ్ నుంచి కీర్తీ సురేశ్, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి వారు నటించనున్నారు. వీరిలో పొన్నియన్ సెల్వన్‌గా టైటిల్ పాత్రలో నటుడు జయంరవి, వందియ దేవన్‌గా కార్తీ, ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్, కందవైగా కీర్తీసురేశ్ నటించనున్నారు. సుందరచోళన్‌గా అమితాబ్‌బచ్చన్, పళవేట్టరైయర్‌గా మోహన్‌బాబు నటించనున్నారు. నటుడు సత్యరాజ్ కూడా ఇందులో నటించబోతున్నట్లు సమాచారం. ఇక కుట్రలు చేసే మాయామోహిని నందినిగా నటి ఐశ్యర్యరాయ్ నెగిటివ్ పాత్రల్లో నటించబోతున్నట్లు తెలిసింది. మరో కీలక పూంగుళలి పాత్రలో అగ్రనటి నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం విజయ్ చిత్రంతోపాటు రజనీకాంత్‌తో దర్బార్ చిత్రంలో ఆమె నటిస్తుండటంతో.. మణిరత్నం చిత్రానికి కాల్షీట్స్ కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమెకి బదులు మరో అగ్రనటి అనుష్కను ఆ పాత్రలో నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. భాగమతి తరువాత చాలా విరామం తీసుకుని ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తోంది అనుష్క. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఆగస్ట్‌లో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
కేజీఎఫ్‌లో...
అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, వివేక్ ఒబెరాయ్ వంటి స్టార్స్ ఆల్రెడీ సౌత్ సినిమాలవైపు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో సంజయ్ దత్ పేరు కూడా చేరనుందని తెలుస్తోంది. యశ్ హీరోగా నటించిన కన్నడ సూపర్ హిట్ చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’. ఈ సినిమా హిందీ, తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ‘కేజీఎఫ్’కు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో సంజయ్‌దత్ ఓ కీలక పాత్ర చేయనున్నారట. ‘‘కేజీఎఫ్ చాప్టర్ 1’లోనే సంజయ్ దత్‌గారికి ఓ రోల్ ఆఫర్ చేశాం. కానీ ఆయన డేట్స్ కుదర్లేదు. ఇప్పుడు చాప్టర్ 2 కోసం అడగడం జరిగింది’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మరి... సంజయ్ దత్ ఈ చిత్రానికి సరే అంటారా? వెయిట్ అండ్ సీ. -
బాలి మళ్లింది!
మేరే పాస్ గాడీ హై.. బంగళా హై.. బ్యాంక్ బ్యాలెన్స్ హై. తేరే పాస్ క్యాహై?ఈ ప్రశ్నకు.. దక్షిణాది ప్రొడ్యూసర్లు ఆహా.. హ్హా.. హా అని నవ్వి...‘మేరే పాస్ అమితాబ్ హై.. అక్షయ్ హై.. ఇంకా.. అజయ్ హై.. నవాజ్ హై..’ అంటున్నారు!సౌత్ ఇండియన్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఇప్పుడంతా బాలీవుడ్ హవా వీస్తోంది.టాలీవుడ్‌కు, మాలీవుడ్‌కు, కోలీవుడ్‌కు బాలి మళ్లింది! సౌత్ టు నార్త్ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు నార్త్ టు సౌత్ అనాలి. అవును.. ఒకప్పుడు దక్షిణాది తారలు ఉత్తరాది చిత్రాల్లో నటించేవాళ్లు. ఇప్పుడు ఉత్తరాది వాళ్లు దక్షిణాదికి వస్తున్నారు. అఫ్కోర్స్.. హీరోయిన్ల ఎగుమతి ఎప్పటినుంచో ఉందనుకోండి. అయితే హిందీ నటులు ఇక్కడ నటించడం చాలా చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు మేల్ ఆర్టిస్టులు కూడా దక్షిణాది చిత్రాలపై మొగ్గు చూపుతున్నారు. రానున్న రోజుల్లో మన తెరపై కనిపించబోతున్న బాలీవుడ్ స్టార్స్ ఎవరో ఒకసారి చూద్దాం. ఇటు తెలుగు అటు తమిళ్ యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో నటుడిగానే కాదు నిర్మాతగానూ తన లక్‌ని టెస్ట్ చేసుకున్నారు అమితాబ్. డాక్యుమెంటరీలు, మ్యూజికల్ వీడియోస్‌లో కూడా మెరిశారాయన. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో చిన్ని తెర ప్రేక్షకులను ఆయన మెస్మరైజ్ చేసిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అమితాబ్ ఇవన్నీ చేసింది హిందీ చిత్రపరిశ్రమలోనే. ఇప్పుడు ఆయన చూపు సౌత్ ఇండస్ట్రీపై పడింది. ఇంతకు ముందు తెలుగు చిత్రాలు ‘అమృత వర్షం’ (2006), ‘మనం’ (2014)లలో అతిథిలా కనిపించారు. రానా ‘ఘాజీ’ చిత్రానికి గొంతు వినిపించారు. ఇప్పుడు చిరంజీవి ‘సైరా’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే ‘ఉయంర్ద మణిదన్’ సినిమాతో తమిళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తమిళవానన్ దర్శకుడు. దేనికైనా రెడీ హిందీలో బయోపిక్స్, సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలతో బిజీగా ఉన్నారు హీరో అక్షయ్ కుమార్. కానీ క్యారెక్టర్ నచ్చితే విలన్‌గా అయినా రెడీ అంటూ.. ఇప్పుడు దక్షిణాది సినిమా ‘2.ఓ’లో విలన్‌గా చేశారు. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా రూపొందిన ‘2.ఓ’ చిత్రం ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఎందిరిన్’కి సీక్వెల్. ఈ చిత్రం నవంబర్ 29న విడుదల కానుంది. ‘పేట్టా’లో నవాజ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, చాన్స్ దొరికితే హీరోగా చేస్తూ మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఇప్పుడీ సూపర్ యాక్టర్ సౌత్‌లో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘పేట్టా’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారాయన. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు నవాజ్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. కమల్‌కి విలన్‌గా? ప్రస్తుతం బాలీవుడ్లో బిజీ బిజీగా ఉన్న నటుల్లో అజయ్ దేవగణ్ ఒకరు. యాక్టర్‌గా, నిర్మాతగా ఆయన చేతిలో ఇప్పుడు దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆయన కూడా సౌత్ బాట పట్టడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. అది కూడా శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాలో విలన్‌గా వస్తారట. 22 ఏళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో కమల్ నటించిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ ‘ఇండియన్ 2’. మస్త్ బిజీ రామ్‌గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ సిరీస్‌లో నటుడు వివేక్ ఒబెరాయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. బాలీవుడ్‌లోనూ మంచి విలన్‌గా పేరు తెచ్చుకున్నారు వివేక్ ఒబెరాయ్. ఆ టాక్‌తో గతేడాది అజిత్ హీరోగా నటించిన ‘వివేగమ్’ సినిమాలో విలన్‌గా నటించారు. ఈ సినిమాలో వివేక్ నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. ఇంకేముంది! చాన్సులు క్యూ కట్టాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో వివేకే విలన్. అలాగే శివరాజ్‌కుమార్ ‘రుస్తుం’ మోహన్‌లాల్ ‘లూసిఫర్’ చిత్రాల్లో నటిస్తూ ఫుల్బిజీగా ఉన్నారు వివేక్ . మరికొంతమంది! మూడేళ్ల క్రితం ‘గోపాల గోపాల’, ‘మలుపు’ చిత్రాల్లో నటించిన మిథున్ చక్రవర్తి ఇటీవల కన్నడ ‘ది విలన్’లో నటించారు. మరో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా కన్నడ చిత్రం ‘పహిల్వాన్’లో నటిస్తున్నారు. ఇక సీనియర్ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ప్రస్తుతం సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. తమిళ ‘ఇమైక్క నొడిగళ్’ సినిమాతో సౌత్ గడప తొక్కిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రస్తుతం మలయాళంలో ‘ముతూన్’ నటిస్తున్నారట. వీరిలాగే నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడి సౌత్ బాట పట్టారు.ఈ సంగతి అలా ఉంచితే... సౌత్ సినిమాల నిర్మాతలు కూడా మార్కెట్‌ను పెంచుకునే ఆలోచనలో భాగంగానే బహు భాషల్లో తమ చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘బాహుబలి’ పలు భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు రజనీకాంత్ ‘2.ఓ’, చిరంజీవి ‘సైరా’, ప్రభాస్ ‘సాహో’, రానా ‘అరణ్య’, మోహన్‌లాల్ ‘ఒడియన్, కుంజాలి మరక్కార్, మహాభారత్’ వంటి చిత్రాలు కూడా బహుళ భాషల్లో రిలీజ్ కానున్నాయి. ఇలా సౌత్ ఇండస్ట్రీ ప్రస్తుతం సినీ ప్రపంచంలో సత్తా చాటుతోంది. – ఇన్పుట్స్: ముసిమి శివాంజనేయులు -
మొత్తంగా అమ్ముడు పోయింది..
తమిళసినిమా: వరలక్ష్మీ చిత్రం అమ్ముడు పోయింది అంటే ఇదేదో చిత్ర టైటిల్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. నటి వరలక్ష్మీశరత్‌కుమార్ నటించిన హెచ్చరికై ఇదు మనిదర్గళ్ నడమాడుం ఇడం మొత్తంగా అమ్ముడు పోయింది. ఈరోజుల్లో చిత్రం నిర్మించడం సులభమే కానీ, దాన్ని విడుదల చేయడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది. సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు దొరకడం అన్నది ఆక్సిజన్ లాంటిదే. అలా కొనేవారు లేక చాలా చిత్రాలు అటకెక్కుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్చరికై ఇది మనిదర్గళ్ నడమాడుం ఇడం చిత్రం చూసిన క్లాప్ బోర్డు సంస్థ అధినేత వి.సత్యమూర్తి చాలా బాగుందని ప్రశంసిండంతో పాటు చిత్ర విడుదల హక్కులను మొత్తంగా కొనేశారు. ఆయన ఇంతకు ముందు తప్పుదండా చిత్రం ద్వారా హీరోగా, నిర్మాతగానూ పరిచయం అయ్యారన్నది గమనార్హం. సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన నెంజిల్ తునిచ్చల్ ఇరుందాల్, విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ఒరు నల్లనాళ్ పార్తు సొల్రేన్ చిత్రాల విడుదల హక్కులను పొంది విడుదల చేశారు. తాజాగా సత్యరాజ్ రిటైర్డ్ పోలీసు అధికారిగా ప్రధాన పాత్రలో నటించిన హెచ్చరికై ఇదు మనిదర్గళ్ నడమాడుమ్ ఇడమ్ చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేశారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సీపీ.గణేశ్, సుందర్ అన్నామలై కలిసి నిర్మించారు. కథ, దర్శకత్వం బాధ్యతలను సర్జన్ నిర్వహించారు. ఈయన మణిరత్నం, ఏఆర్.మురుగదాస్‌ల వద్ద సహాయదర్శకుడిగా పనిచేశారు. అంతే కాదు యూ ట్యూబ్‌లో ప్రాచుర్యం పొందిన మా, లక్ష్మీ చిత్రాల దర్శకుడు ఈయనే. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ కిడ్నాప్ ఇతివృత్తంతో తెరకెక్కించిన సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రంగా హెచ్చరికై ఇదు మనిదర్గళ్ నడమాడుమ్ ఇడమ్ ఉంటుందన్నారు. ఇందులో రిటైర్డ్ పోలీస్అధికారిగా సత్యరాజ్ దుమ్మురేపుతారని చెప్పారు. దీనికి కేఎస్.సుందరమూర్తి సంగీతాన్ని, సుదర్శన్ శ్రీనివాసన్ ఛాయాగ్రహణం అందించినట్లు తెలిపారు. చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేని సత్యమూర్తి తన క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ పతాకంపై తాజాగా నిర్మిస్తున్న ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. త్వరలో ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. -
ఆ చిత్రంలో నటించడం అవసరమా?
తమిళసినిమా: ఆ చిత్రంలో నటించడం అవసరమా అని స్నేహితులు, సన్నిహితులు అన్నారని నటి రియామిక పేర్కొంది. సమీపకాలంలో తెరపైకి వచ్చిన ఎక్స్ వీడియోస్ చిత్రంలో కథానాయకిగా నటించిన నటి రియామిక. చెన్నైలో ఉన్నత విద్యను పూర్తి చేసిన బెంగళూర్ బ్యూటీ ఈమె. అమ్మ ఆశను పూర్తి చేసిన కూతురుల పట్టికలో రియామిక ఒకరు. కళాశాలలో చదువుతుండగానే కొన్ని వాణిజ్య చిత్రాల్లో నటించిన రియామికకు ప్రముఖ ఛాయాగ్రాహకుడు బాలసుబ్రమణియన్ కుటుంబ స్నేహితుడన్నది గమనార్హం. రియామికకు తొలి చిత్రం కుండ్రత్తిలే కుమరనుక్కు కొండాట్టం అయినా పేరు తెచ్చి పెట్టింది మాత్రం ఎక్స్ వీడియోస్నేనట. ఈ చిత్రంలో నటించడం కూడా అనూహ్యంగా జరిగిందని రియామిక చెప్పింది. మొదట దర్శకుడు కథ చెప్పకుండా తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలనే తెలిపారని అంది. అంతే కాకుండా చిత్రంలో నటించడం మొదలెట్టిన తరువాతే టైటిల్ చెప్పారని పేర్కొంది. అయితే ఎక్స్ వీడియోస్ చిత్రంలో తన నటనను పలువురు ప్రశంసించినా, సన్నిహితులు, స్నేహితులు కొందరు ఇలాంటి చిత్రంలో నటించడం అవసరమా అని ప్రశ్నించారని చెప్పింది. అయినా ఒక మంచి అవగాహనాత్మక చిత్రంలో నటించానని సంతృప్తి చెందినట్లు అంది. ఈ చిత్రం తరువాత అఘోరి చిత్రంలో నటించానని, హర్రర్ థ్రిల్లర్ ఇతివృత్తంతో కూడిన ఇందులో ఐదే పాత్రలు ఉంటాయని, అందులో తనదే మహిళ పాత్ర అని చెప్పింది. ఈ చిత్ర షూటింగ్ కేరళలో నెల రోజుల పాటు జరిగిందని తెలిపింది. అక్కడ షూటింగ్ గ్యాప్‌లో పిల్లలకు క్లాసిక్ డాన్స్ నేర్పించడంతో పాటు చిత్ర యూనిట్‌కు సాంకేతిక కళాకారిణిగానూ పనిచేసినట్లు చెప్పింది. ప్రస్తుతం మాయవన్ చిత్రం ఫేమ్ దర్శక నిర్మాత సీవీ.కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు తెలిపింది. మొదట ఆయన నిర్మించే చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, తరువాత ఒన్ ప్లస్ ఒన్లా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటించే అవకాశాన్ని కల్పించారని చెప్పింది. తన నటన చూసి అందరూ చాలా బాగా నటిస్తున్నావు.కూత్తుపట్టరై (ఫిల్మ్ ఇన్స్టిట్యూట్)లో శిక్షణ పొందావా అని అడుగుతుండడంతో, ఆ కూత్తుపట్టరైలో శిక్షణ ఎలా ఉంటుందో చూద్దామని, ప్రస్తుతం అక్కడ చేరినట్లు రియామిక తెలిపింది. మంచి ఛాలెంజింగ్‌లో కూడిన కథా పాత్రల్లో నటించాలని ఆశపడుతున్నట్లు చెబుతున్న ఈ బ్యూటీకి బాలీవుడ్ నటి కంగనా రావత్, కోలీవుడ్‌లో నయనతార నచ్చిన నటీమణులని తెలిపింది. -
అవకాశాలు వస్తే సినిమాల్లో నటిస్తా!
పెరంబూరు: అవకాశాలు వస్తే సినిమాల్లో నటించడానికి సిద్ధం అని కామన్వెల్త్ చాంపియన్ సతీష్‌కుమార్ శివలింగం పేర్కొన్నారు. ఈయన ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుని ఆ క్రీడలో పథకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కారు. ఒక వాణిజ్య సంస్థకు బ్రాండ్ అంబాసీడర్‌గా నియమితులైన సతీష్‌కుమార్ శివలింగం బుధవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వాణాజ్య ప్రకటనలు, సినిమాల్లో నటించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు సతీష్‌కుమార్ శివలింగం బదులిస్తూ అలాంటి అవకాశాలు వస్తే, సమయం కుదిరితే తప్పకుండా నటిస్తానని చెప్పారు. అయితే తాను ఎక్కువ సమాయాన్ని క్రీడా శిక్షణలోనే గడుపుతానని తెలిపారు. ప్రతిభ కలిగిన యువకులు గ్రామాల్లో చాలా మంది ఉన్నారని, వారంతా క్రీడల్లో రాణించడానికి మీరిచ్చే సలహా ఏమిటన్న ప్రశ్నకు యువత నిరంతర శిక్షణ పొందాలన్నారు. క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రీడా ప్రేక్షకులు కూడా క్రికెట్ క్రీడలానే ఇతర క్రీడలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. -
కోలీవుడ్‌కు ఆస్ట్రేలియా అందగత్తె
తమిళసినిమా: ఇండియాలోని ఉత్తరాది, దక్షిణాది భాషలకు చెందిన నటీమణులే కాకుండా కెనడా లాంటి ఇతర దేశాలకు చెందిన వారు కూడా కోలీవుడ్‌పై కన్నేస్తున్నారు. అయితే ఆ ట్రెండ్ ఇటీవల తగ్గిందనుకుంటే కాదు ఇది నిరంతర ప్రక్రియే అన్నట్టుగా మరో దేశానికి చెందిన బ్యూటీ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. అవును ఆస్ట్రేలియాకు చెందిన అందాలసుందరి ఆషిమా నెర్వాస్ తమిళ చిత్రంలో కథానాయకిగా పరిచయం అవుతోంది. అస్ట్రేలియాలో పుట్టి, పెరిగిన ఈ బ్యూటీ అక్కడ జరిగిన మిస్ ఇండియా, మిస్ ఆస్ట్రేలియా అందాల పోటీల్లో కిరీటాలను గెలుచుకుంది. ఆ తరువాత మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్న ఆషియా నెర్వాస్ ఇప్పుడు కోలీవుడ్‌లో విజయ్‌ఆంథోనికి జంటగా కొలైక్కారన్ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో నటుడు అర్జున్ విలన్‌గా నటిస్తున్నారు. నటి ఆషిమా నెర్వాస్ కుటుంబం సహా చెన్నైకి వచ్చి కొలైక్కారన్చిత్ర షూటింగ్లో పాల్గొంటోందట. నవ దర్శకుడు ఆండ్రూ లూయిస్ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఆయన ఈ చిత్రంలో ఆస్ట్రేలియా బ్యూటీని హీరోయిన్గా ఎంపిక చేయడం గురించి చెబుతూ ఆమెలో తమిళ అమ్మాయి ఛాయలు కనిపించడంతో తమ చిత్రంలో నాయకి పాత్రకు బాగుంటుందని ఎంపిక చేశామని చెప్పారు. కొలైక్కారన్ చిత్రం విడుదలనంతరం ఆషియా నెర్వాస్ కోలీవుడ్‌లో ఒక రౌండ్ చుట్టేస్తుందని అన్నారు. ఈ బ్యూటీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అక్కడ ఒక చిత్రం చేస్తోందట. చూడాలి మరి ఈ రెండు భాషల్లో ఎక్కడి అభిమానులను అలరించి పాగా వేస్తుందో! -
18న తెరపైకి 18–05–2009
తమిళసినిమా: ఒక తేదీనే టైటిల్‌గా చిత్రాలు తెరకెక్కిడం అరుదే. అదేవిధంగా తాజాగా 18–05–2009 పేరుతో ఒక చిత్రం రూపొందింది. అయితే ఈ టైటిల్ వెనుక బలమైన కథ, లక్షలాది మంది ప్రాణత్యాగాలు, పోరుబాట, ఆక్రందనలు, ఆవేదనలు ఉన్నాయి. శ్రీలంక తమిళుల హక్కుల పోరాటం, సాయుధ దళాల కిరాతకం లాంటి హృదయ విషాదకర కథాంశంతో కూడిన చిత్రం 18–05–2009. గురునాధ్ కలసాని నిర్మించిన ఈ చిత్రానికి కే.గణేశన్ దర్శకుడు. కర్ణాటకకు చెందిన తమిళుడైన గణేశన్ ఇంతకు ముందు పలు కన్నడ చిత్రాలతో పాటు తమిళం,తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. త తాజా చిత్రం గురించి ఆయన తెలుపుతూ శ్రీలంక తమిళులను ఆ దేశ సాయుదళాలు ఊచకోత కోసిన సంఘటనలు 18.05.2009 వరకూ కొనసాగాయన్నారు. ఇది చరిత్ర ఎప్పటికీ మరచిపోదన్నారు. ఒక్క చివరిరోజునే 40 వేల మంది ముక్కుపచ్చలారని చిన్నారులతో పాటు మహిళలు, పురుషులు హత్యకు గురయ్యారన్నారు. తమిళులుగా పుట్టిన ఒకే కారణంతో అమాయకపు మహిళలను కూడా రాక్షసత్వంతో శ్రీలంక సాయుధ దళాలు చంపేశాయన్నారు. న్యాయం కోసం గొంత్తెత్తిన వారి కేకలు శ్రీలంక గాలిలో కలిసిపోయాయన్నారు. ఈ సంఘటనలు కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించిన చిత్రం 18–05–2009 అని చెప్పారు. సుభాష్ చంద్రబోస్, ప్రభాకరన్, నాగినీడు, తాన్యా, జేకప్, శ్రీరామ్, బాలాజీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రానికి సంగీత రారాజు ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
థ్రిల్లర్ కథాంశంతో ఎన్ పేర్ ఆనందన్
తమిళసినిమా:హర్రర్ కథా చిత్రాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటోంది. దీంతో ఆ తరహా చిత్రాలు వరస కడుతున్నాయి. తాజాగా ఎన్ పేర్ అనందన్ అనే చిత్రం తెరకెక్కుతోంది. కావ్యా ప్రొడక్షన్స్ గోపి కృష్ణప్ప, సవితా సినీ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి శ్రీధర్ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తూ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శిస్తున్న 6 అధ్యాయం చిత్రంలో ఒక అధ్యాయమైన చిత్రం కొల్లుదడీకి దర్శకత్వం వహించారు. ఇందులో కథై తిరైకతై వచనం ఇయక్కం, దాయం చిత్రాల ఫేమ్ సంతోష్ ప్రతాప్ హీరోగా, అతుల్యరవి హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఇప్పటి వరకూ వచ్చిన థ్రిల్లర్ కథా చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. చిత్రంలో కొన్ని యాథార్ధ సంఘటనలు ఉంటాయన్నారు. ఇందులో తుది ఘట్టంలో 12 నిమిషాలతో కూడిన పాట ఉందన్నారు. ఈపాట భావోద్వేగంతో సాగుతుందన్నారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రాల తరహాలో నిర్మించడానికి ఒక కొత్త ప్రయత్నం చేశామన్నారు. అయితే తమిళ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను మధురై, తిరువణ్ణామలై, చెన్నై ప్రాంతాల్లో చిత్రీకరించామన్నారు. ఈ చిత్రాన్ని చూసిన కొందరు సినీ ప్రముఖులు ఆ మధ్య వచ్చిన అరువి చిత్రం ఎలాగైతే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందో అలాగే మంచి పేరు తెచ్చుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న చిత్రానికి జేమ్స్ ప్రాంకింగ్ సంగీతం, మనోజ్ ఛాయాగ్రహణను అందిస్తున్నారన్నారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
మహాబలిపురంలో మస్తీ!
ఎక్కడో పుట్టారు! ఎక్కడో పెరిగారు! కలిసింది మాత్రం ఇక్కడే... కళామతల్లి ఒడిలో, వెండితెర వెలుగుల్లో! అప్పట్నుంచి స్నేహంగా మెలుగుతూ మరింత ఎత్తుకు ఎదిగారు... ప్రేక్షకుల్లో ప్రేమాభిమానాల్ని సొంతం చేసుకుని పెరిగి పెద్దయ్యారు. అయినా సరే... ఏడాదికొకసారి కలవడం మాత్రం మరువలేదు. 1980లలో సౌత్ స్టార్లు అందరూ కలిసి ‘ఎయిటీస్ సౌత్ యాక్టర్స్’ పేరుతో ఓ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. రజనీకాంత్, మోహన్‌లాల్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, భాగ్యరాజ, అర్జున్, జాకీ ష్రాఫ్, సీనియర్ నరేశ్, సత్యరాజ్, సుమన్, ప్రభు, రమేశ్ అరవింద్, భానుచందర్, సురేశ్ తదితర హీరోలతో పాటు రేవతి, రమ్యకృష్ణ, రాధిక, సుహాసిని, నదియా, రాధ, మేనక తదితర హీరోయిన్లు ఈ ఎయిటీస్ క్లబ్లో సభ్యులు. ఎనిమిదేళ్లుగా వీళ్లందరూ ‘ఎయిటీస్ సౌత్ యాక్టర్స్–రీయూనియన్’ పేరుతో ఏదొక చోట కలుస్తుంటారు. ఈ ఏడాది మహాబలిపురంలో కలిశారు. ఈ నెల 17, 18వ తేదీల్లో గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. ఈ పార్టీల స్పెషాలిటీ ఏంటంటే... ప్రతి ఏడాది ఏదొక థీమ్ ప్రకారం చేసుకుంటారు. అందరూ ఒకే రంగు దుస్తులు ధరిస్తారు. ఈసారి ఊదా రంగు థీమ్‌తో డ్రస్సులు ప్లాన్ చేసుకున్నారు. ఐ–ఫీస్ట్ కదూ! ఈ తారలు గత 17వ తేదీన ఊదా రంగు దుస్తుల్లో మహాబలిపురంలో మీట్ అయ్యారు. తాము బస చేసిన హోటల్‌ను ఊదా రంగుతో అలంకరించారు. అలనాటి నటీమణులు సుహాసినీ, లిసీ, పూర్ణిమా భాగ్యరాజ్, ఖుష్బూ, నటుడు రాజ్‌కుమార్ సేతుపతిలు గెట్ టుగెదర్కి వచ్చిన వారికి ఆహ్వానం పలికారు. అందరూ ఆనందంగా అలనాటి జ్ఞాపకాలను పంచుకుని, ఫొటోలు దిగారు. తర్వాత పాటల పోటీ నిర్వహించారు. 1960 – 70 కాలంలో విడుదలైన ప్రముఖ హిందీ పాటలను నటీనటులు రేవతి, ఖుష్బూ, సురేశ్, రమ్య, సుమలత, నరేష్, రాధిక, శరత్‌కుమార్ ఆలపించారు. విజేతలు రేవతి, ఖుష్బూలకు బహుమతులు అందించారు. ర్యాంప్ వాక్: మొదటి రోజు పురుషులు, మహిళలకు ర్యాంప్ వాక్ పోటీ నిర్వహించారు. చిరంజీవి అధ్యక్షత జరిగిన ఈ షోలో పురుషుల బృందం గెలుపొందింది. రెండో రోజు ఆధ్యాత్మిక అంశాలపై చర్చా వేదికలు నిర్వహించారు. -
యువ నటుడు మృతి
సాక్షి, బెంగళూరు: కన్నడ యువ నటుడు, ‘పప్పుసీ కామెడీ’ ఫేం రాకేశ్(27) మంగళవారం మృతి చెందారు. కన్నడ సినిమా పరిశ్రమలో ‘బుల్లీ’గా సుపరిచితుడైన ఆయన కోరమంగలలో ఉన్న సెయింట్‌జాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గ్యాంగ్రిన్ వ్యాధితో బాధపడుతున్న రాకేశ్ రెండు నెలలక్రితం శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. మరోసారి వ్యాధి తిరగబెట్టడంతో ఆయన సెయింట్‌జాన్స్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. చెలువినచిత్తార చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయమైన రాకేశ్ పలు కన్నడ సినిమాల్లో ప్రతిభను కనబరిచారు. రాకేశ్ తల్లిదండ్రులు ఆశారాణి, నాగేశ్ కూడా నటులే. ఆయన ప్రధానపాత్రలో నటించిన తాజాచిత్రం ‘ధూమపాన’ షూటింగ్ పూర్తికావొచ్చింది. రాకేశ్ మృతికి పలువురు నటులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. -
'ఆ మొదటి బాలీవుడ్ నటుణ్ని నేనే'
ముంబై: పాతికేళ్ల కెరీర్లో బాలీవుడ్లో ఎన్నో సినిమాలు చేశాడు అక్షయ్‌కుమార్. 'బేబీ', 'స్పెషల్ 26', 'ఎయిర్‌లిఫ్ట్', 'ఓ మై గాడ్' వంటి సందేశాత్మక సామాజిక చిత్రాల్లో నటించి అభిమానులను మెప్పించారు ఆయన. తాజాగా తొలిసారి తమిళంలో ఎంట్రీ ఇస్తున్నారు ఈ యాక్షన్ స్టార్. రజనీకాంత్ హీరోగా దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రోబో 2' సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తొలిసారి తమిళ సినిమాలో నటిస్తున్న మొదటి బాలీవుడ్ నటుణ్ని తానేనని అక్షయ్‌కుమార్ చెప్పారు. 'తమిళ సినిమాలో నటిస్తున్న తొలి బాలీవుడ్ నటుణ్ని నేనే కావడం చాలా ఆనందం కలిగిస్తోంది. దక్షిణాది సినిమాల్లో సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లను మాత్రమే తీసుకుంటారు. బాలీవుడ్ హీరోలు దక్షిణాది సినిమాల్లో నటించరు. ఈ అపనమ్మకాన్ని నేను బ్రేక్ చేస్తున్నా. ఇప్పటివరకు మరాఠీ, పంజాబీ సినిమాల్లో నటించా. ఇకముందు గుజరాతీ, బిహారీ, బెంగాలీ సినిమాల్లో కూడా నటిస్తా' అని అక్షయ్ విలేకరులకు తెలిపారు. 'రోబో -2' కథ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమాలో ఓ సందేశం కూడా ఉందని, అయితే అదేమిటో ఇప్పుడే చెప్పబోనని ఆయన అన్నారు. ద్విభాష చిత్రంగా 'రోబో 2' తమిళం, హిందీలో తెరకెక్కుతున్నదా? అనే విషయాన్ని కూడా ఆయన ధ్రువీకరించలేదు. మరో నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, దాదాపు ఏడాది తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, అప్పుడే అన్ని విషయాలు తెలిసే అవకాశముందని చెప్పారు. -
ఇక సినిమాలకు గుడ్ బై..?
వినాయకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన, కేరళ కుట్టి శరణ్య మోహన్.. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటి, తరువాత దక్షిణాదిలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. హీరోయిన్ రోల్స్‌తో పాటు చెల్లెలి పాత్రల్లో కూడా అలరించిన ఆమె ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేసినట్టే అన్న టాక్ వినిపిస్తుంది. ఈ మధ్యే కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో అరవింద్ కృష్ణన్ ను పెళ్లాడిన శరణ్య.. సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తుందట. అయితే స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్, సింగర్ అయిన శరణ్య ఆ రంగాల్లో తన కెరీర్ ను కంటిన్యూ చేయాలనుకుంటుంది. మరి శరణ్య అనుకున్నట్టుగా సినిమాలకు దూరమవుతుందో లేక అందరూ హీరోయిన్ల లాగే లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి. -
రిలేషణం: మమ్మల్ని అన్‌లక్కీ బ్యాచ్ అనేవాళ్లు
దక్షిణాది సినిమా సంగీత ప్రపంచంలో మేరునగధీరుడు ఇళయరాజా. సినిమా పాటపై ఆయన సంతకం ప్రత్యేకమైనది. 37ఏళ్లుగా అవిశ్రాంతంగా స్వరాలందిస్తున్న ఇళయరాజా ఈ జనరేషన్‌కీ ఫేవరెట్ మ్యూజిక్ డెరైక్టరే. ఆయన తమ్ముడైన గంగై అమరన్ మంచి రచయిత, స్వరకర్త, దర్శకుడు. తెలుగులో ‘స్వరకల్పన’ చిత్రానికి సంగీతదర్శకత్వం చేసిన గంగై అమరన్ తన అన్నయ్య గురించి చెప్పిన కబుర్లు... మేం నలుగురు అన్నదమ్ములం. ఇద్దరు అక్కలు. నేను చిన్నవాణ్ణి. పెద్దన్నయ్య పావలర్ వరదరాజన్, రెండో అన్నయ్య ఆర్డీ భాస్కర్, మూడో అన్నయ్య ఇళయరాజా. నేను రాజా అన్నయ్యకన్నా ఐదేళ్లు చిన్న. తమిళనాడు మధురై జిల్లాలోని పణ్ణైపురం మా సొంతఊరు. మా వరదరాజన్ అన్నయ్య కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తి. రాజకీయ సభల్లో ప్రచార గీతాలు ఆలపించేవారు. ఆయన పాటలంటే చాలు జనాలు విపరీతంగా గుమిగూడేవారు. ఆయన ప్రభావంతోనే రాజా అన్నయ్యలో, నాలో సంగీతం పట్ల మక్కువ, మమకారం మొదలయ్యాయి. అప్పట్లో నేను పాటలు రాసేవాణ్ణి. ఆ పాటకు రాజా అన్నయ్య బాణీ కట్టేవారు. వేదికలపై ఆ పాటలు పాడేవాళ్లం. చిన్న వయసులో అందరు అన్నదమ్ములూ ఎలా ఉండేవాళ్లో మేమూ అంతే. కానీ ఆటలు తక్కువ. పాటలతోనే జీవితం సాగింది. ఇక, సినిమాల్లో ప్రయత్నిస్తే బాగుంటుందని భాస్కర్ అన్నయ్య, రాజా అన్నయ్య చెన్నయ్ రెలైక్కారు. నేను మాత్రం మా ఊళ్లోనే ఉండిపోయాను. తర్వాత... నేనూ చెన్నయ్ వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. చెన్నయ్‌లోని మైలాపూర్‌లో ఒక అద్దె ఇల్లు తీసుకున్నారు మా అన్నయ్యలు. హోటల్ ఖర్చులు భరించలేని నేపథ్యంలో వాళ్లకి వండిపెట్టడానికి నేను చెన్నయ్ వెళ్లాను. నాకు తెలిసిన వంటలేవో చేసేవాణ్ణి. దాంతో పాటు పాటలు కూడా రాసుకునేవాణ్ణి. ముగ్గురం అవకాశాల కోసం ఎక్కని మెట్టు లేదు. లాభం లేదని నిరుత్సాహపడుతున్న సమయంలో ఓ చాన్స్ వచ్చేది. దానికి మధ్యలోనే బ్రేక్ పడేది. అలాంటివి బోల్డన్ని జరిగాయి. దాంతో మా మీద ‘అన్‌లక్కీ బ్యాచ్’ అనే ముద్ర వేశారు. పైగా ఎమ్మెస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్‌లాంటి సంగీతదర్శకులు ఏలుతున్న రోజులు కావడంతో కొత్తవాళ్లని తీసుకోవడానికి నిర్మాతలు పెద్దగా ముందుకు వచ్చేవారు కాదు. ఇలా మేం ముగ్గురం మద్రాసులో అవకాశాల కోసం కష్టపడుతున్న విషయం తెలుసుకుని మా అమ్మగారు చిన్నత్తాయమ్మాళ్ కూడా వచ్చేశారు. నా చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. అప్పట్నుంచీ తల్లీతండ్రీ అన్నీ తానై మా అమ్మ మమ్మల్ని పెంచింది. ఆత్మవిశ్వాసమే రాజా అన్నయ్య ఆయుధం అనిపిస్తుంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా పట్టించుకునేవారు కాదు. చివరికి ఆయన స్నేహితుడు ఆర్. సెల్వరాజ్ ద్వారా నిర్మాత పంజు అరుణాచలంతో మాకు పరిచయం ఏర్పడింది. ‘అణ్ణక్కిళి’ అనే చిత్రానికి అవకాశం ఇచ్చారు అరుణాచలంగారు. నేను పాటలు రాసిన తర్వాత రాజా అన్నయ్య బాణీలు సమకూర్చేవారు. ఆ సినిమా విజయం సాధించడంతో మా దశ తిరిగింది. ఆ తర్వాత మా విజయవంతమైన ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. పాటలపై మమకారం ఏర్పడటానికి కారణమైన మా అన్నయ్య వరదరాజన్ మా వైభవాన్ని చూడలేదనే కొరత ఉంది. అలాగే మా భాస్కర్ అన్నయ్యని కూడా ఆ దేవుడు త్వరగానే తీసుకెళ్లిపోవడం ఎప్పటికీ బాధగా ఉంటుంది. సంగీత దర్శకుడైన తర్వాత ఒక పద్ధతి ప్రకారం మ్యూజిక్ నేర్చుకుంటే బాగుంటుంది కదా అని రాజా అన్నయ్య శిక్షణ తీసుకున్నారు. నేనెక్కడా సంగీతం నేర్చుకోలేదు. దానికి కారణం మా అన్నయ్య నేర్చుకుంటే నేనూ నేర్చుకున్నట్లే కదా. పాటలు రాయడంతో పాటు 200 సినిమాలకు నేనూ సంగీతం సమకూర్చాను. అన్నయ్య స్థాయికి కాకపోయినా, ఆ అన్నకు తమ్ముడిగా నేనూ ప్రతిభావంతుణ్ణే అనిపించుకోవడం ఆనందంగా ఉంది. ఒక్కోసారి మనవళ్లు, మనవరాళ్ల పేర్లయినా అన్నయ్యకు తెలుసా? అనిపించేది. సంగీతం తప్ప అన్నయ్యకు మరో ప్రపంచం తెలియదు. అయితే ఇప్పుడు ఫర్వాలేదు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మామూలుగా రాజా అన్నయ్య చాలా తక్కువ మాట్లాడతారు. ఎవరి దగ్గర్నుంచీ ప్రశంసలు ఎదురు చూడరు. నిరాడంబరంగా ఉంటారు. నేనేదైనా గొప్పగా చేసినప్పుడు ప్రశంసించరు. ఆయన మౌనమే ప్రశంసలు కింద లెక్క. తప్పు చేస్తే మాత్రం తిడతారు. అందుకే కనీసం తిట్టడం కోసమైనా మనతో మాట్లాడుతున్నారు కదా ఆనందపడిపోతుంటాను. అలా రాజా అన్నయ్య నాకు అక్షింతలు వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ అక్షింతలే నాకు ఆశీర్వాదాలు. - డి.జి. భవాని