Highest Paid Actress In South Cinema, Check How Much She Charges - Sakshi
Sakshi News home page

టాప్‌ పెయిడ్‌ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిందెవరో తెలిస్తే..షాక్‌వుతారు 

Jun 17 2023 2:19 PM | Updated on Jun 19 2023 10:54 AM

Highest paid actress in South cinema check who is this - Sakshi

Trisha Krishnan సౌత్ ఇండియన్ సినిమాలో హీరోయిన్ల్‌ హవా కొనసాగుతోంది. ఒకర్ని మించి ఒకరు  పలుభాషల హీరోయిన్లు తమ సత్తా చాటుకుంటున్నారు అందం, అభినయంతో  ‍స్టార్‌ హీరోలకు ధీటుగా  రెమ్యూనరేషన్‌ అందుకుంటున్నారు.  

ఏ-లిస్ట్ హీరోలు సినిమా చేయడానికి చాలా ఎక్కువ ఫీజు తీసుకుంటారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇపుడిక సౌత్‌ టాప్‌ హీరోయిన్లు ఫీజు చాలా మంది బాలీవుడ్ నటుల ఫీజు కంటే ఎక్కువే అనడంలో ఎలాంటి సందేహంలేదు.  తాజాగా ఈ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న  హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష కృష్ణన్.

ఫిన్‌క్యాష్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, మణిరత్నం చిత్రం 'పొన్నియన్ సెల్వన్' తర్వాత త్రిష స్టార్ వాల్యూ ఒక రేంజ్‌లో పెరిగిందట.  త్రిష తన నెక్ట్స్‌ మూవీకి  రూ. 10 కోట్లు వసూలు చేస్తుందని, తద్వారా సౌత్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే  నటిగా అవతరించింది. త్రిష త్వరలో విజయ్ దళపతితో కలిసి 'లియో' చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రాన్నిఅక్టోబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 14 ఏళ్ల విరామం తర్వాత విజయ్, త్రిష జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.  (15 ఏళ్ల స్టార్టప్‌ సీఈవోకి లింక్డ్‌ఇన్‌లో నిషేధమా? ట్వీట్‌ వైరల్‌)

మల్టీ స్టారర్ 'పొన్నియన్ సెల్వన్' రెండు భాగాలుగా విడుదలైంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్న ఈ చిత్రంలో త్రిష ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఈ మూవీల్లోతన  అద్భతమైన నటనతో ఆకట్టుకుంది. అంతకుమంచిన అందంతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది.

 కాగా  టాలీవుడ్‌  టాప్‌ స్టార్ సమంత రూత్ ప్రభు 'సిటాడెల్ ఇండియా'  కనిపించనుంది. అల్లు అర్జున్‌ బ్లాక్‌ బస్టర్‌  మూవీ పుష్ప లోని   ఐటెం సాంగ్ 'ఊ అంటావా' తో సామ్‌ పాపులారీటీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తన ఫీజును పెంచిందని, ‘సిటాడెల్ ఇండియా’ వెబ్ సిరీస్ కోసం 10 కోట్ల రూపాయలను  ఛార్జ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ధృవీకరణ ఏదీ లేదు. (హైదరాబాద్‌లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement