'ఆ మొదటి బాలీవుడ్ నటుణ్ని నేనే' | Glad to be the first Bollywood actor to do a Tamil film: Akshay Kumar | Sakshi
Sakshi News home page

'ఆ మొదటి బాలీవుడ్ నటుణ్ని నేనే'

Published Wed, Jan 13 2016 5:21 PM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

'ఆ మొదటి బాలీవుడ్ నటుణ్ని నేనే'

'ఆ మొదటి బాలీవుడ్ నటుణ్ని నేనే'

ముంబై: పాతికేళ్ల కెరీర్‌లో బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు చేశాడు అక్షయ్‌కుమార్‌. 'బేబీ', 'స్పెషల్ 26', 'ఎయిర్‌లిఫ్ట్‌', 'ఓ మై గాడ్‌' వంటి సందేశాత్మక సామాజిక చిత్రాల్లో నటించి అభిమానులను మెప్పించారు ఆయన. తాజాగా తొలిసారి తమిళంలో ఎంట్రీ ఇస్తున్నారు ఈ యాక్షన్‌ స్టార్. రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రోబో 2' సినిమాలో విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తొలిసారి తమిళ సినిమాలో నటిస్తున్న మొదటి బాలీవుడ్‌ నటుణ్ని తానేనని అక్షయ్‌కుమార్‌ చెప్పారు.

'తమిళ సినిమాలో నటిస్తున్న తొలి బాలీవుడ్ నటుణ్ని నేనే కావడం చాలా ఆనందం కలిగిస్తోంది. దక్షిణాది సినిమాల్లో సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లను మాత్రమే తీసుకుంటారు. బాలీవుడ్‌ హీరోలు దక్షిణాది సినిమాల్లో నటించరు. ఈ అపనమ్మకాన్ని నేను బ్రేక్ చేస్తున్నా. ఇప్పటివరకు మరాఠీ, పంజాబీ సినిమాల్లో నటించా. ఇకముందు గుజరాతీ, బిహారీ, బెంగాలీ సినిమాల్లో కూడా నటిస్తా' అని అక్షయ్‌ విలేకరులకు తెలిపారు.

'రోబో -2' కథ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమాలో ఓ సందేశం కూడా ఉందని, అయితే అదేమిటో ఇప్పుడే చెప్పబోనని ఆయన అన్నారు. ద్విభాష చిత్రంగా 'రోబో 2' తమిళం, హిందీలో తెరకెక్కుతున్నదా? అనే విషయాన్ని కూడా ఆయన ధ్రువీకరించలేదు. మరో నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, దాదాపు ఏడాది తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, అప్పుడే అన్ని విషయాలు తెలిసే అవకాశముందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement