రజనీతో కలిసి చేయడం అద్భుతం! | Great to get in action with superstar Rajinikanth, says Akshay kumar | Sakshi

రజనీతో కలిసి చేయడం అద్భుతం!

Feb 1 2016 11:17 AM | Updated on Sep 3 2017 4:46 PM

రజనీతో కలిసి చేయడం అద్భుతం!

రజనీతో కలిసి చేయడం అద్భుతం!

దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి రోబో సినిమా సీక్వెల్‌లో కలిసి నటించడం అద్భుతంగా అనిపిస్తోందని బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అంటున్నాడు.

దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి రోబో సినిమా సీక్వెల్‌లో కలిసి నటించడం అద్భుతంగా అనిపిస్తోందని బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అంటున్నాడు. సీక్వెల్‌లో కూడా రజనీకాంత్ సైంటిస్టుగాను, ఆయన తయారుచేసే రోబో 'చిట్టి'గాను నటిస్తుండగా, విలన్ పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్నారు. ఇప్పటికే తన సినీజీవితంలో అనేక ఫైట్లు చేశానని, ఇప్పుడు రజనీకాంత్ లాంటి సూపర్ హీరోతో పంచ్‌లు తినడం చాలా గొప్పగా అనిపిస్తోందని అక్షయ్ చెప్పాడు. నెగెటివ్ పాత్ర పోషించాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానన్నాడు. అయితే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధం కావడం లేదు. దానికి ఎలాంటి ట్రైనింగు తీసుకోవట్లేదని అక్షయ్ చెప్పాడు.

నన్నెవరూ చూడలేదు
తాను ఇంతకుముందు రజనీకాంత్‌ను కలిసిన సందర్భాన్ని అక్షయ్ గుర్తుచేసుకున్నాడు. తాను ఆయన వద్దకు వెళ్లేసరికి 15 మంది ఆయన కోసం వేచి చూస్తున్నారని, అందరూ ఆయనవైపే చూస్తున్నారని అన్నాడు. ఆయన టీ తాగుతూ.. ప్యాంటుమీద దుమ్ము ఉంటే దులుపుకొన్నారని, అందరూ ఒక్కసారిగా ఊపిరి భారంగా పీల్చుకున్నారని చెప్పాడు. తాను కూడా తన ప్యాంటు మీద దుమ్ము ఉంటే దులుపుకొన్నానని, కానీ అయితే అక్కడ ఎవరూ తనవైపు చూడలేదని తెలిపాడు. రోబో మొదటి భాగంలో ఐశ్వర్యారాయ్ నటించగా.. సీక్వెల్‌లో మాత్రం అమీ జాక్సన్ నటిస్తోంది. అలాగే డేనీ స్థానంలో అక్షయ్ వస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement