ఇప్పడే మాట్లాడే హక్కు, నాకు లేదు | Akshay Kumar Has No Authority to Talk About Rajinikanth's robot 2 | Sakshi
Sakshi News home page

ఇప్పడే మాట్లాడే హక్కు, నాకు లేదు

Published Sun, Jan 10 2016 12:58 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

ఇప్పడే మాట్లాడే హక్కు, నాకు లేదు

ఇప్పడే మాట్లాడే హక్కు, నాకు లేదు

తొలిసారిగా సౌత్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తను హీరోగా నటించిన యాక్షన్ డ్రామా ఎయిర్ లిఫ్ట్ ప్రమోషన్లో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో వరుసగా దేశభక్తి కనబరిచే సినిమాల్లో నటించటంపై స్పందించాడు. దీంతో పాటు దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రోబో 2 సినిమాలో నటించటంపై మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు.

2014లో హాలీడే, 2015లో బేబి సినిమాలో అలరించిన అక్షయ్ మరోసారి అదే తరహాలో తెరకెక్కిన ఎయిర్ లిఫ్ట్తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రోబో సినిమాలో నటించటం పై కూడా స్పందించాడు. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించటం ఎంతో ఆనందంగా ఉందన్న అక్షయ్, సినిమాకు సంబందించిన విషయాలను వెల్లడించే అధికారం నాకు లేదన్నాడు.

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతున్న రోబో 2లో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, ఐ సినిమాలో హీరోయిన్గా నటించిన ఎమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ సినిమాను 2017 వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement