
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. రోబో సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సౌత్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ సీన్‌లోనే రేడియేషన్ కారణంగా అక్షయ్ కుమార్ పాత్ర చనిపోతుందట. తరువాత ఈవీల్ పరంగా మారిన అక్షయ్ రేడియేషన్‌కు కారణమైన సెల్‌ఫోన్‌లను మాయం చేయటం ఆ పవర్‌ను ఎదుర్కొనేందుకు చిట్టి (ద రోబో) రంగంలోకి దిగటమే మిగతా కథ అన్న ప్రచారం జరుగుతోంది.
రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆస్కార్ సాధించిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలందిస్తున్నారు. పలు అంతర్జాతీయ చిత్రాలకు పనిచేసిన రసూల్ పోకుట్టి లాంటి టాప్ టెక్నిషియన్స్ ఈసినిమా కోసం పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment