భారతీయ సినిమా అతిరథమహారథుల సమక్షంలో ప్రతిష్టాత్మక చిత్రం 2.ఓ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చెన్నైలోని సత్యం థియేటర్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్, దర్శకుడు శంకర్లతో పాటు చిత్ర నటీనటులు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో పూర్తి స్థాయి 3డీ లో తెరకెక్కిన ఈ సినిమాను నవంబర్ 29న 2డీ, 3డీ వర్షన్‌లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. శంకర్ దర్శకుడు కాదు గొప్ప శాస్త్రవేత్త. శంకర్ పడిన కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుందదన్నారు.
అక్షయ్ ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్రశ్నించిన విశాల్‌కు సమాధానమిస్తూ నేను ప్రతి రోజు ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాను. నా జీవితంలో సూర్యోదయం చూడకుండా ఉండని రోజు లేదు. నా దేహమే నాకు దేవాలయం. అందుకే సరైన వ్యాయామం డైట్ అనుసరిస్తాన’న్నారు. వీడియో మేసేజ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రాజమౌళికి థ్యాంక్స్ చెప్పిన శంకర్, ఆయన తన ఫేవరెట్ డైరెక్టర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment