ధనుష్‌ను బీట్‌ చేసిన మహేష్‌ | Mahesh Babu Becomes 9 Million Followers In Twitter | Sakshi
Sakshi News home page

ధనుష్‌ను బీట్‌ చేసిన మహేష్‌

Published Fri, Mar 6 2020 8:08 PM | Last Updated on Fri, Mar 6 2020 8:20 PM

Mahesh Babu Becomes 9 Million Followers In Twitter - Sakshi

తెలుగు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఉన్న క్రేజ్‌ గురించి అందరికి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. సోషల్‌ మీడియాలో కూడా ఆయనను అనుసరించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తాజాగా మహేష్‌ ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ్య 9 మిలియన్లు దాటింది. దీంతో సౌత్‌ ఇండియాలో 9 మిలియన్ల ట్విటర్‌ ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి నటుడిగా మహేష్‌ నిలిచారు.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మహేష్‌.. తన కొత్త ప్రాజెక్టులతో పాటు, ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటారు. అలాగే ఇతర నటులకు విషెస్‌ చెప్పడంతోపాటు.. సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. సినిమాల విషయానికి వస్తే.. సరిలేరు నీకెవ్వరు తర్వాత తను చేయబోయే సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు చిరంజీవి–కొరటాల శివ కాంబినేషన్‌లో చేస్తున్న సినిమాలో మహేశ్‌ ఓ కీలక పాత్ర చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, సౌత్‌ ఇండియా నటుల్లో మహేష్‌ తర్వాత ధనుష్‌కు ట్విటర్‌లో 8.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత సౌత్‌లో సమంతకు 7.8, శృతిహాసన్‌కు 7.5, మోహన్‌లాల్‌కు 5.9, నాగార్జునకు 5.9, రానాకు 5.8, శివకార్తికేయన్‌కు 5.8, రజనీకాంత్‌కు 5.7 మిలియన్ల ఫాలోవర్లు  ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement