ప్రేమిస్తూనే ఉంటా | Mahesh Babu reaches the 7 million mark on Twitter | Sakshi
Sakshi News home page

ప్రేమిస్తూనే ఉంటా

Published Mon, Oct 8 2018 5:13 AM | Last Updated on Mon, Oct 8 2018 5:13 AM

Mahesh Babu reaches the 7 million mark on Twitter - Sakshi

మహేశ్‌బాబు

సోషల్‌ మీడియాలో ఫుల్‌ అప్‌డేటెడ్‌గా ఉంటారు మహేశ్‌బాబు. తన ఆలోచనలను పంచుకుంటూ, అభిమానులకు అందుబాటులో ఉంటారాయన. తాజాగా ట్వీటర్‌లో ఓ మైలురాయిని దాటారు మహేశ్‌. దాదాపు 7మిలియన్‌ (70 లక్షల) మంది ట్వీటర్‌లో మహేశ్‌ను ఫాలో అవుతున్నారు. ‘‘మీ అందరి సపోర్ట్‌కి ఎప్పడూ రుణపడి ఉంటాను. మీ అందర్నీ ప్రేమిస్తూనే ఉంటాను’’ అని తన 7 మిలియన్‌ ఫాలోయర్స్‌తో ఆనందాన్ని షేర్‌ చేసుకున్నారాయన. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు మహేశ్‌బాబు. ఈ నెల 18న ఈ చిత్రం అమెరికా షెడ్యూల్‌ స్టార్ట్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement