![n arper Anandan with Thriller storyline - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/27/Untitled-11.jpg.webp?itok=Uua7It-Y)
తమిళసినిమా:హర్రర్ కథా చిత్రాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటోంది. దీంతో ఆ తరహా చిత్రాలు వరస కడుతున్నాయి. తాజాగా ఎన్ పేర్ అనందన్ అనే చిత్రం తెరకెక్కుతోంది. కావ్యా ప్రొడక్షన్స్ గోపి కృష్ణప్ప, సవితా సినీ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి శ్రీధర్ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తూ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శిస్తున్న 6 అధ్యాయం చిత్రంలో ఒక అధ్యాయమైన చిత్రం కొల్లుదడీకి దర్శకత్వం వహించారు. ఇందులో కథై తిరైకతై వచనం ఇయక్కం, దాయం చిత్రాల ఫేమ్ సంతోష్ ప్రతాప్ హీరోగా, అతుల్యరవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఇప్పటి వరకూ వచ్చిన థ్రిల్లర్ కథా చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. చిత్రంలో కొన్ని యాథార్ధ సంఘటనలు ఉంటాయన్నారు. ఇందులో తుది ఘట్టంలో 12 నిమిషాలతో కూడిన పాట ఉందన్నారు.
ఈపాట భావోద్వేగంతో సాగుతుందన్నారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రాల తరహాలో నిర్మించడానికి ఒక కొత్త ప్రయత్నం చేశామన్నారు. అయితే తమిళ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను మధురై, తిరువణ్ణామలై, చెన్నై ప్రాంతాల్లో చిత్రీకరించామన్నారు. ఈ చిత్రాన్ని చూసిన కొందరు సినీ ప్రముఖులు ఆ మధ్య వచ్చిన అరువి చిత్రం ఎలాగైతే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందో అలాగే మంచి పేరు తెచ్చుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న చిత్రానికి జేమ్స్ ప్రాంకింగ్ సంగీతం, మనోజ్ ఛాయాగ్రహణను అందిస్తున్నారన్నారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment