మరో ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్‌ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Amala Paul Thriller Movie Latest Movie Streaming On This Ott | Sakshi
Sakshi News home page

Amala Paul: మరో ఓటీటీకి అమలాపాల్ థ్రిల్లర్‌ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Tue, Oct 15 2024 4:53 PM | Last Updated on Tue, Oct 15 2024 6:40 PM

Amala Paul Thriller Movie Latest Movie Streaming On This Ott

హీరోయిన్ అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ లెవెల్ క్రాస్‌. జూలైలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలో దర్శనమిచ్చింది.

తాజాగా ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది.  ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఆసిఫ్ అలీ హీరోగా నటించారు. ఈ మూవీకి అర్బాజ్ అయూబ్ దర్శకత్వం వహించారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు లెవెల్ క్రాస్ సినిమా చూసేయండి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement