ఓటీటీకి వచ్చేస్తోన్న సైకాలాజికల్ థ్రిల్లర్.. రెండున్నరేళ్ల తర్వాత తెలుగులో! | Tovino Thomas Super Hir Movie Ott Streaming After Two Years In Telugu | Sakshi
Sakshi News home page

Ott Movie: రెండున్నరేళ్ల తర్వాత ఓటీటీకి సైకాలాజికల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Published Thu, Nov 28 2024 8:02 AM | Last Updated on Thu, Nov 28 2024 8:02 AM

Tovino Thomas Super Hir Movie Ott Streaming After Two Years In Telugu

2018 సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ క్రేజ్ దక్కించుకున్న మలయాళ నటుడు టొవినో థామస్‌. తాజాగా ఆయన నటించిన సైకాలాజికల్ థ్రిల్లర్‌ మూవీ నారదన్. 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి ఫర్వాలేదనిపించింది. అయితే ఇప్పటికే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అమెజాన్ ప్రైమ్‌లో కేవలం మలయాళంలోనే అందుబాటులో ఉంది.

తాజాగా ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాకు ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. అన్నా బెన్ ‍హీరోయిన్‌గా నటించింది. ఓ జర్నలిస్ట్‌ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement