Naradan
-
ఓటీటీకి వచ్చేస్తోన్న సైకాలాజికల్ థ్రిల్లర్.. రెండున్నరేళ్ల తర్వాత తెలుగులో!
2018 సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ క్రేజ్ దక్కించుకున్న మలయాళ నటుడు టొవినో థామస్. తాజాగా ఆయన నటించిన సైకాలాజికల్ థ్రిల్లర్ మూవీ నారదన్. 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి ఫర్వాలేదనిపించింది. అయితే ఇప్పటికే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అమెజాన్ ప్రైమ్‌లో కేవలం మలయాళంలోనే అందుబాటులో ఉంది.తాజాగా ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాకు ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. అన్నా బెన్ హీరోయిన్గా నటించింది. ఓ జర్నలిస్ట్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. Every human is a headline!📰Bulletin by Naradhan Very soon!!🤵🏻♂️ #Naradhan Premieres November 29th on aha!#NaradhanOnAha #aha pic.twitter.com/s3PZIm4Gsz— ahavideoin (@ahavideoIN) November 27, 2024 -
నారదన్ రెడీ అవుతున్నాడు
ఆట, పాట, హాస్యం, పోరాటం అంటూ జనరంజక అంశాలతో నారదన్ రెడీ అవుతున్నాడు. పని కోసం, తన మామ, ఆయన కూతురిని చూడడానికి కోవై నుంచి చెన్నైకి వస్తున్న హీరో హీరోయిన్ను వెంటాడుతున్న రౌడీలతో పోరాడి చిక్కుల్లో పడుతాడు. ఆ తరువాత అతని జీవితం ఎలాంఇ మలుపులు తిరిగిందన్న పలు ఆసక్తికరమైన సన్నివేశాలు సమాహారంతో తెరకెక్కుతున్న చిత్రం నారదన్. నకుల్, నికిషా పటేల్, శ్రుతిరామకృష్ణ, హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రేమ్‌జి, రాధారవి, ఎం ఎస్ భాస్కర్, మయిల్‌స్వామి, వైయాపురి, ఫవర్ స్టార్ శ్రీనివాసన్, పాండు, కుంకి అశ్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఎం.సెల్వకుమార్, సజిత, ఎ.నంబియార్ కలిసి నిర్మిస్తున్నారు. నాగ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ చిత్ర ప్రారంభంలో వచ్చే హీరో పరిచయ పాటకు నకుల్పై చిత్రీకరించినట్టు తెలిపారు. అదే విధంగా సలీమ్ చిత్రంలో మస్కార్ పాటకు ఆడిన అస్మిత్, ముంబయి మోడల్స్ నటించిన పాటను బ్రహ్మాండమైన సెట్ వేసి చిత్రీకరించినట్లు చెప్పారు. నకుల్ రౌడీలతో పోరాడే సన్నివేశాలకు ఇటీవల బిన్ని మిల్లులో పదిరోజుల పాటు చిత్రీకరించినట్లు తెలిపారు. అలాగే నకుల్, శ్రుతితో ఆడిపాడిన డ్యూయెట్ పాట జనరంజకంగా వచ్చినట్లు చెప్పారు. -
జ్ఞాపకశక్తి కోల్పోయిన యువతిగా నికిషా పటేల్
ఉత్తరాది భామ నికిషాపటేల్ జ్ఞాపక శక్తిని కోల్పోయారట. యుక్త వయసులో ఆమెకు మెమొరీలాస్ అవ్వడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? పులి చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ప్రవేశించిన ఈ గ్లామర్ డాల్ ప్రస్తు తం కోలీవుడ్‌పై దృష్టి సారిస్తోంది. తమిళం లో పలు అవకాశాలను చేజిక్కించుకున్న బబ్లీ హీరోయిన్ నారదన్ చిత్రంలో నకులన్తో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రంలో జ్ఞాపక శక్తిని కోల్పోయిన యువతిగా నటిస్తోందట. దీని గురించి ఈ బాలీ వుడ్ భామ తెలుపుతూ నారదన్ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నట్లు చెప్పింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చిత్రమని తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోందని వెల్లడించారు. నకులన్తో నటిస్తున్న అనుభవం గురించి అడగ్గా ఆయన మంచి ఎనర్జిటిక్ నటుడన్నారు. అంతా కుటుంబ సభ్యులుగా కలిసిపోయి నటిస్తున్నట్లు చెప్పారు. నారదన్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రంతోపాటు గౌతమ్ కార్తీక్ సరసన ఎన్నమో ఏదో చిత్రంలోనూ నటిస్తున్నట్లు తెలిపారు. ఇందులోను తనది చాలా బలమైన పాత్ర అని వివరిం చారు. గౌతమ్ కార్తీక్ గర్ల్ ఫ్రెండ్‌గా నటిస్తున్నట్లు తెలి పారు. మరో ద్విభాషా చిత్రం రంభ, ఊర్వశి, మేనకలో కూడా నటిస్తున్నట్లు చెప్పారు. ఇది పూర్తిగా లేడీ ఓరియంటెడ్ కథా చిత్రమని నికిషా పటేల్ వెల్లడించారు.