ఆట, పాట, హాస్యం, పోరాటం అంటూ జనరంజక అంశాలతో నారదన్ రెడీ అవుతున్నాడు. పని కోసం, తన మామ, ఆయన కూతురిని చూడడానికి కోవై నుంచి చెన్నైకి వస్తున్న హీరో హీరోయిన్‌ను వెంటాడుతున్న రౌడీలతో పోరాడి చిక్కుల్లో పడుతాడు. ఆ తరువాత అతని జీవితం ఎలాంఇ మలుపులు తిరిగిందన్న పలు ఆసక్తికరమైన సన్నివేశాలు సమాహారంతో తెరకెక్కుతున్న చిత్రం నారదన్. నకుల్, నికిషా పటేల్, శ్రుతిరామకృష్ణ, హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రేమ్‌జి, రాధారవి, ఎం ఎస్ భాస్కర్, మయిల్‌స్వామి, వైయాపురి, ఫవర్ స్టార్ శ్రీనివాసన్, పాండు, కుంకి అశ్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఎం.సెల్వకుమార్, సజిత, ఎ.నంబియార్ కలిసి నిర్మిస్తున్నారు.
నాగ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ చిత్ర ప్రారంభంలో వచ్చే హీరో పరిచయ పాటకు నకుల్‌పై చిత్రీకరించినట్టు తెలిపారు. అదే విధంగా సలీమ్ చిత్రంలో మస్కార్ పాటకు ఆడిన అస్మిత్, ముంబయి మోడల్స్ నటించిన పాటను బ్రహ్మాండమైన సెట్ వేసి చిత్రీకరించినట్లు చెప్పారు. నకుల్ రౌడీలతో పోరాడే సన్నివేశాలకు ఇటీవల బిన్ని మిల్లులో పదిరోజుల పాటు చిత్రీకరించినట్లు తెలిపారు. అలాగే నకుల్, శ్రుతితో ఆడిపాడిన డ్యూయెట్ పాట జనరంజకంగా వచ్చినట్లు చెప్పారు.
నారదన్ రెడీ అవుతున్నాడు
Published Sat, Apr 11 2015 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM
Advertisement
Advertisement