Premji
-
ప్రిన్స్ రివ్యూ: జాతిరత్నాలు డైరెక్టర్ నవ్వించాడా?
టైటిల్: ప్రిన్స్ తారాగణం: శివకార్తికేయన్, మరియా, సత్యరాజ్, ప్రేమ్‌జీ తదితరులు దర్శకుడు: అనుదీప్ కేవి సంగీతం: తమన్ సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస నిర్మాతలు: సునీల్ నారంగ్, సురేశ్ బాబు, పుష్కర్ రామ్ మోహన్ రావు విడుదల తేదీ: అక్టోబర్ 21, 2022 ఒక సినిమా విజయం సాధించిందంటే ఆ డైరెక్టర్ బాధ్యత రెట్టింపు అవుతుంది. తర్వాతి సినిమా అంతకు మించి విజయాన్ని సాధించేలా తీయాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా నెక్స్ట్ ఎలాంటి మూవీ తీస్తారోనని ఉత్సుకతతో ఎదురుచూస్తుంటారు. అలాంటి పరిస్థితే ఎదురైంది దర్శకుడు కేవీ అనుదీప్‌కి. గతేడాది జాతిరత్నాలు మూవీతో ఊహించనంత సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్న అనుదీప్ ఈసారి ప్రిన్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. మరి అనుదీప్ మరోసారి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడా? ప్రిన్స్ మూవీ ఎలా ఉంది? ఓసారి చూసేద్దాం.. కథ: ఓ స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వారసుడు ఆనంద్(శివకార్తికేయన్). ఇతడో స్కూలు టీచర్. హీరో తండ్రి విశ్వనాథ్(సత్యరాజ్) కులమతాలకు వ్యతిరేకి, అందరూ కలిసి ఉండాలనుకునే వ్యక్తి. ఇక హీరో తన స్కూల్లోనే మరో టీచర్(బ్రిటీష్ అమ్మాయి) అయిన జెస్సిక (మరియా ర్యాబోషప్కా)తో లవ్‌లో పడతాడు. ఇంగ్లండ్‌కు చెందిన జెస్సిక తండ్రికి ఇండియన్స్ అంటేనే గిట్టదు. దీంతో వారి ప్రేమకు అతడు రెడ్ సిగ్నల్ ఇస్తాడు. రానురానూ ఇద్దరి మధ్య లవ్‌స్టోరీ కాస్తా రెండు దేశాల మధ్య వార్‌లా మారుతుంది. మరి ఆనంద్ ప్రేమ సక్సెస్ అయిందా? అతడిని ఊరి నుంచి ఎందుకు గెంటేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ: ప్రిన్స్ సినిమాలో మూడు కోణాలు ఉన్నాయి. కామెడీ, లవ్ స్టోరీ, మానవత్వం అనే అంశాలను టచ్ చేశాడు డైరెక్టర్. అనుదీప్ అంటేనే కామెడీ కాబట్టి ఎక్కువగా కామెడీనే నమ్ముకున్నాడు. కానీ అక్కడక్కడా కామెడీ పండించే సీన్లను సాగదీయడం కొంత చిర్రెత్తిస్తుంది. ముఖ్యంగా బాటిల్ గార్డ్ ఎపిసోడ్ చూసిన జనాలకు అరె ఏంట్రా ఇది అనిపిస్తుంది. లవ్ సీన్స్ కొన్నిచోట్ల అమాయకత్వం ఉట్టిపడుతూ బాగుంటాయి. అనుదీప్ టేకింగ్, శివకార్తికేయన్ నటన రెండూ కరెక్ట్‌గా సరిపోయాయి. కానీ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు మాత్రం రొటీన్ ఫార్మాట్లోనే వెళ్లినట్లు అనిపించక మానదు. ఫస్టాఫ్ అక్కడక్కడ బాగుంటుంది. కానీ సెకండాఫ్ మాత్రం తన ట్రేడ్ మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు అనుదీప్. డైలాగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్‌లో హీరో దేశభక్తి కంటే హ్యుమానిటీనే గొప్పదని చెప్పే స్పీచ్ బాగుంటుంది. అనుదీప్ ఎంచుకున్న కాన్సెప్ట్ సీరియస్‌గా కనిపించినా దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ పద్ధతిలోనే డీల్ చేశాడు. ఏం చేసినా ఏం రాసినా అంతా నవ్వించడం కోసమే అన్నట్లు ఉంటుందీ చిత్రం. మరీ జాతిరత్నాలు రేంజ్లో కాకపోయినా కామెడీ ఇష్టపడేవారికి ప్రిన్స్ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే? శివ కార్తికేయన్ అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సత్యరాజ్ పాత్ర సినిమాకే హైలెట్. ప్రేమ్ జీ పంచులతో ఎంటర్టైన్ చేశాడు. హీరోయిన్ మరియా లుక్, నటన ఫ్రెష్‌గా ఉంది. అనుదీప్ కామెడీ చేస్తూనే మనుషులంతా ఒక్కటేనని సింపుల్‌గా చెప్పాడు. ప్రధాన పాత్రల మాటలు ఫన్ క్రియేట్ చేస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయి. తమన్ అందించిన సంగీతం కొంతవరకు ఆకట్టుకుంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్లు సాగదీయకుండా కట్ చేస్తే బాగుండేది. ఓవరాల్‌గా ప్రిన్స్.. నో లాజిక్.. ఓన్లీ కామెడీ మ్యాజిక్! చదవండి: సర్దార్ మూవీ రివ్యూ సౌత్ సినిమాలు చేయాలనుంది -
ఫ్లిప్‌కార్ట్, స్నాప్ ’డీల్’ కు ప్రేమ్‌జీ బ్రేక్!
♦ చిన్న ఇన్వెస్టర్లకు చెల్లింపులపై ♦ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ అభ్యంతరాలు ♦ డీల్ స్వరూపంపై స్పష్టత ♦ ఇవ్వాలంటూ స్నాప్‌డీల్ బోర్డుకు లేఖ ముంబై: దేశీ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ విలీనానికి అవరోధాలు కొనసాగుతున్నాయి. స్నాప్‌డీల్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు తలో రకంగా పరిహారం లభించేలా ఉన్న డీల్ స్వరూపంపై తాజాగా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థ అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో మొత్తం విలీన ఒప్పందానికే విఘాతం కలగడమో లేదా స్నాప్‌డీల్ వేల్యుయేషన్‌ను మరింతగా తగ్గించడమో జరిగే పరిస్థితి నెలకొంది. విలీన ప్రతిపాదన ప్రకారం స్నాప్‌డీల్‌లో పెట్టుబడులు పెట్టిన ప్రారంభ దశ ఇన్వెస్టర్లు కలారి క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్కి ప్రత్యేకంగా 60 మిలియన్ డాలర్లు లభించనున్నాయి. అలాగే స్నాప్‌డీల్ వ్యవస్థాపకులు కునాల్ బెహల్, రోహిత్ బన్సల్‌కి 30 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. ఉద్యోగులకు 30 మిలియన్ డాలర్ల మేర ప్రత్యేక చెల్లింపుల రూపంలో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ నెలాఖర్లోగా లేదా జూలై ప్రారంభంలో మదింపు ప్రక్రియ పూర్తి కాగలదని అంచనా. డీల్ సాకారమైతే దేశీ ఈ–కామర్స్ రంగంలో ఇదే అత్యంత భారీ ఒప్పందం కాగలదు. అయితే, స్నాప్‌డీల్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్(ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ సంస్థ).. ఉద్యోగుల ప్యాకేజీకి ఓకే చెప్పినప్పటికీ.. ప్రారంభదశ ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకులకు ఇవ్వనున్న ప్రత్యేక ప్యాకేజీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్నాప్‌డీల్ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. షేర్‌హోల్డర్లందరికీ సమాన ప్రయోజనాలు కల్పించాలని, డీల్ నిబంధనలపై మరింత స్పష్టతనివ్వాలని ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో స్నాప్‌డీల్‌కు అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ క్రెడిట్ సూసీ రంగంలోకి దిగింది. డీల్ సాకారమయ్యేలా.. మైనారిటీ ఇన్వెస్టర్లలో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నిస్తోంది. వేల్యుయేషన్‌కు మరింతగా కోత పడే అవకాశాలు.. పోటీ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా కార్యకలాపాలు విస్తరించేందుకు నిధులు సమీకరించుకోలేక స్నాప్‌డీల్ కొన్నాళ్లుగా గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ఒకప్పుడు 6.5 బిలియన్ డాలర్ల మేర పలికిన స్నాప్‌డీల్ వేల్యుయేషన్ ప్రస్తుతం బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో అందులో పెట్టుబడులున్న సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్.. దాన్ని ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం చేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. స్నాప్‌డీల్ ఇన్వెస్టర్లంతా ఒప్పుకుంటేనే ఒప్పందంపై ముందుకెడతామంటూ ఫ్లిప్‌కార్ట్ షరతు విధించడంతో .. ఒప్పందంపై సాఫ్ట్‌బ్యాంక్ ఇతర ఇన్వెస్టర్ల మద్దతు కూడా కూడగట్టింది. తాజాగా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ అభ్యంతరాలతో సమస్య మరింత జటిలంగా మారనుంది. దీంతో స్నాప్‌డీల్ వేల్యుయేషన్ మరింత తగ్గొచ్చనేది పరిశ్రమ వర్గాల అంచనా. స్నాప్‌డీల్‌లో రతన్ టాటా, ఇంటెల్ క్యాపిటల్, బెస్సీమర్ వెంచర్ పార్ట్నర్స్, బ్లాక్‌రాక్, టెమాసెక్‌లకు వాటాలున్నాయి. -
58% సంపద 1% సంపన్నుల వద్దే
-
58% సంపద 1% సంపన్నుల వద్దే
ప్రపంచ సగటు కంటే ఎక్కువ • దేశంలో పెరిగిపోతున్న అసమానత్వం • 70% మంది సంపదకు సమాన మొత్తం 57 మంది సొంతం • 84 మంది కుబేరుల సంపద 248 బిలియన్ డాలర్లు • తొలి మూడు స్థానాల్లో ముకేశ్ అంబానీ, దిలీప్ సంఘ్వి, ప్రేమ్‌జీ • ఆక్స్‌ఫామ్ నివేదికలో వెల్లడి దావోస్ (స్విట్జర్లాండ్): సంపద అసమానత్వం దేశంలో పెచ్చుమీరిపోతోంది. రోజులో రెండు పూటలా కడుపునిండా తినలేని పేదరికంతో దేశంలో సుమారు 30 శాతం మంది ఒకవైపు అల్లాడుతుంటే... మరోవైపు దేశ సంపదలో 58 శాతం కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే తిష్టవేసింది. ఈ అసమానత్వంలో ప్రపంచ సగటు రేటు 50 శాతాన్ని మన దేశం దాటేసింది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సందర్భంగా సంపన్నులు, ప్రముఖులు సమావేశం అవుతున్న తరుణంలో... ఈ వాస్తవాలను ఆక్స్‌ఫామ్ అనే హక్కుల గ్రూపు ‘యాన్ ఎకానమీ ఫర్ 99 పర్సెంట్’ పేరుతో సోమవారం విడుదల చేసింది. ఇక సమగ్రాభివృద్ధి సూచీలోనూ అభివృద్ధి చెందుతున్న 79 దేశాలను తీసుకుని చూస్తే వాటిలో భారత్‌ది 60వ స్థానం. అంటే కింది నుంచి 19 స్థానాలపైన. ఇందులో మరింత నివ్వెరపరిచే వాస్తవం ఏమిటంటే పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనాల కంటే కూడా మనం కింద ఉండడం. చివరికి ప్రతిభతో పోటీ పడే విషయంలోనూ మన దేశం మెరుగైన స్థానంలో లేదు. 3 స్థానాలు దిగజారి సూచీలో భారత్ 92వ స్థానంలో ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. సంపద అసమానత్వం ⇔ దేశంలో మొత్తం సంపద 3.1 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో కింది నుంచి 70 శాతం మంది జనాభా సంపద 216 బిలియన్ డాలర్లు. ఆశ్చర్యంగా దేశంలో 57 మంది బిలియనీర్ల సంపద కూడా ఇంచుమించుగా 216 బిలియన్ డాలర్లే. ⇔ దేశంలోని 84 మంది బిలియనీర్ల సమష్టి సంపద 248 బిలియన్ డాలర్లు. వీరిలో తొలి మూడు స్థానాల్లో ఉన్నవారు... 1.ముకేశ్ అంబానీ (19.3 బిలియన్ డాలర్లు) 2. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్‌సంఘ్వి (16.7బిలియన్ డాలర్లు) 3. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ (15 బిలియన్ డాలర్లు). ప్రపంచవ్యాప్తంగా... ⇔ ఈ ప్రపంచ పేదల్లో 50 శాతం మంది దగ్గరున్న సంపదకు సమాన స్థాయిలో 8 మంది బిలియనీర్లు కలిగి ఉన్నారు. ప్రపంచ మొత్తం సంపద 255.7 ట్రిలియన్ డాలర్లు. ఇందులో 6.5 ట్రిలియన్ డాలర్లు బిలియనీర్ల సంపదే. 1. బిల్‌గేట్స్ (75 బిలియన్ డాలర్లు) 2. అమన్సియో ఒర్టెగా (67 బిలియన్ డాలర్లు) 3. వారెన్ బఫెట్ (60.8 బిలియన్ డాలర్లు). ⇔ 2015 నుంచి సంపన్నులు ఒక్క శాతం మంది మిగతా ప్రపంచ జనాభాకు మించిన సంపదను కలిగి ఉండడం జీర్ణించుకోలేని వాస్తవం. వచ్చే 20 ఏళ్లలో 500 మంది 2.1 ట్రిలియన్ డాలర్ల సంపదను తమ వారసులకు అప్పగించనున్నారని... ఇది 130 కోట్ల జనాభా కలిగిన భారత జీడీపీ కంటే పెద్ద మొత్తం అని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. ఈ దృష్ట్యా వారసత్వ పన్నును విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ⇔ ప్రతీ ఒక్కరికీ ప్రయోజనం కలిగించే మానవత్వంతో కూడిన ఆర్థిక రంగాన్ని నిర్మించాల్సిన సమయమిదే. అంతేకానీ ఏ కొద్ది మంది కోసమో కాదు అని నివేదికలో ఆక్స్‌ఫామ్ పేర్కొంది. ⇔ భారత్, చైనా, ఇండోనేషియా, లావోస్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ధనికులైన 10 శాతం మంది ప్రజలు తమ ఆదాయ వాటాను గత రెండు దశాబ్దాల్లో 15 శాతం పెంచుకున్నారు. అదే సమయంలో అత్యంత పేదలైన 10 శాతం మంది ప్రజలు 15 శాతం సంపదను కోల్పోయారు. వెట్టి చాకిరీ.. కార్పొరేట్ల లాభార్జన దేశంలో బాలకార్మికులు, బలవంతపు వెట్టిచాకిరీ జరుగుతున్న తీరునూ ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రస్తావించింది. ప్రపంచంలో పెద్దవైన వస్త్ర కంపెనీలకు భారత్‌లోని కాటన్ స్పిన్నింగ్ మిల్లులు సరుకులను అందిస్తున్నాయి. ఇవి బాలికలతో బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయి. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని నివేదిక తెలిపింది. అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ గణాంకాల ప్రకారం దేశంలో 58 లోల మంది బాలకార్మికులు ఉన్నారని నివేదిక పేర్కొంది. సమగ్రాభివృద్ధిలో మన నంబర్ 60 పొరుగు దేశాల కంటే వెనుకంజ సమగ్రాభివృద్ధి సూచీలో మన దేశం చెప్పుకోతగ్గ స్థితిలో లేదు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న 79 ఆర్థిక వ్యవస్థల్లో... పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్ల కంటే దిగువన 60వ స్థానంలో భారత్ ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ‘సమగ్ర వృద్ధి, అభివృద్ధి నివేదిక – 2017’ను విడుదల చేసింది. చాలా దేశాలు అసమానత్వాన్ని తగ్గించుకునేందుకు వీలుగా ఆర్థిక వృద్ధికి వచ్చిన అవకాశాలను జార విడుచుకుంటున్నాయని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. దశాబ్దాలుగా విధాన కర్తలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా, ప్రమాణాలను తిరిగి సర్దుబాటు చేసుకోవాల్సి ఉందని సూచించింది. సమగ్రాభివృద్ధి సూచీలో లిత్వేనియా ప్రథమ స్థానంలో ఉంది. అజర్బైజాన్, హంగరీ, పోలండ్, రొమేనియా, ఉరుగ్వే, లాత్వియా, పనామా, కోస్టారికా, చిలే వరుసగా పది స్థానాలను ఆక్రమించాయి. చైనా (15), నేపాల్ (27), బంగ్లాదేశ్ (36), పాకిస్తాన్ (52) మనకంటే మెరుగైన స్థానాల్లో నిలిచాయి. భారత్‌లో పురుషులకే వేతనాలు ఎక్కువ.. భారత్‌లో మాత్రం వేతనాల విషయంలో లింగ వివక్ష ఎక్కువే ఉందని ఆక్స్‌ఫామ్ అధ్యయనం పేర్కొంది. ఒకేరకమైన ఉద్యోగాల్లో పురుషులు మహిళల కంటే 30% కంటే అదనంగా వేతనాలు అందుకుంటున్నారని తెలిపింది. 60% మంది మహిళలు తక్కువ వేతనాలు అందుకుంటున్నవారే. కేవలం 15% మంది మహిళలు మాత్రం అధిక వేతనాలు తీసుకోగలుగుతున్నారు. అధిక వేతనాల స్థాయిలో మహిళల ప్రాతినిథ్యం అంతగా లేకపోవడమే కాకుండా అనుభవానికి తగ్గట్టు వేతనాలు ఇచ్చే విషయాల్లో లింగ తారతమ్యత ఉన్నట్టు ఈ వాస్తవాలు తెలియజేస్తున్నాయని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. దేశంలో అత్యున్నత సమాచార కంపెనీ సీఈవో అందుకుంటున్న వేతనం అదే కంపెనీలో సాధారణ ఉద్యోగి వేతనం కంటే 416 రెట్లు ఎక్కువ. సర్కారు ఇవి చేస్తే పేదరికం ఉండదు.. పేదరికానికి చరమగీతం పలకడానికి ఆక్స్‌ఫామ్ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ‘‘సంపదపై ఎక్కువగా దృష్టి పెట్టడం ఆపాలి. వారసత్వ పన్నుతోపాటు, మొత్తం పన్ను వసూళ్లలో తక్కువ వాటా ఉన్న సంపద పన్నును సైతం పెంచాలి. పన్ను మినహాయింపులను ఎత్తివేయాలి. కార్పొరేట్ పన్నును తగ్గించడాన్ని మానుకోవాలి. షేర్ హోల్డర్ల ప్రయోజనాల కోసం పనిచేసేవి కాకుండా తమ ఉద్యోగులు, సమాజ హితం కోసం పనిచేసే కంపెనీలను ప్రోత్సహించాలి. కార్పొరేట్లు, సంపన్నులైన వ్యక్తులు పన్ను ఎగవేతలను అరికట్టాలి. ఆరోగ్యం, విద్యపై పెట్టుబడుల కోసం తగిన నిధులు రాబట్టుకోవాలి. ఆరోగ్యంపై జీడీపీలో కేటాయింపులను 1% నుంచి 3%కి పెంచాలి. విద్యపై కేటాయింపులను 3 నుంచి 6% చేయాలి’’ అని సూచించింది. ఆటోమేషన్తో ఉద్యోగాలకు ఎసరు.. దేశంలో ఆటోమేషన్ కారణంగా పావుశాతం కంటే ఎక్కువ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనున్నాయని... ప్రపంచ వ్యాప్తంగానూ ఆటోమేషన్ చాలా కంపెనీలను ప్రభావితం చేస్తుందని హెచ్ఆర్ కన్సల్టెన్సీ మ్యాన్‌పవర్‌గ్రూపు దావోస్‌లో విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించింది. కొత్త టెక్నాలజీల వల్ల కంపెనీలకు, ఉద్యోగులకు ప్రత్యేక నైపుణ్యాల అవసరం ఏర్పడిందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 43 దేశాల్లో 18వేల కంపెనీలపై సర్వే చేయగా... 90% కంటే ఎక్కువే డిజిటైజేషన్‌వల్ల వచ్చే రెండేళ్లలో తమ కంపెనీలపై ప్రభావం పడతాయని తెలిపాయి. -
గుబులు రేపుతున్న ఇన్ఫోసిస్, విప్రో లేఖలు
ముంబై: నూతన సంవత్సరం సందర్భంగా తన సంస్థలోని ఉద్యోగులకు రాసిన లేఖలో టాప్ ఐటీ దిగ్గజ కంపెనీ లుఅధిపతులు చేసిన హెచ్చరికలు ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ సేవల సంస్థలైన ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా, విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ వ్యాఖ్యలు భారతీయ ఐటీ రంగ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రతిబింబించాయి. నోట్ల రద్దు, అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ను మించి సమస్యలు ఐటి రంగాన్ని పీడిస్తున్నాయన్న సంకేతాలు అందించారు. ఐటీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ మరియు ఆర్థిక సంఘర్షణల నేపథ్యంలో తీవ్ర ముప్పు ఎదుర్కోనున్నట్టు ఇద్దరు నేతలు ఉద్యోగులను హెచ్చరించడం గమనార్హం. ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా శరవేగంగా మారుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇన్ఫోసిస్ మంచి స్థానాన్ని ఆక్రమిస్తుందని చెబుతూనే, భవిష్యత్ ఐటీ రంగం ముళ్ల బాటలో నడవాల్సి వుంటుందని, ఎన్నో అడ్డంకులు, అవాంతరాలను అధిగమించాల్సి వుంటుందని విశాల్ హెచ్చరించారు. ఇన్ఫోసిస్ విలువను మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నామని, ఈ మార్గంలో ఉద్యోగుల శ్రమ, మరింత కృషి అవసరమని అన్నారు. బ్రెగ్జిట్, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, నోట్ల రద్దు, డిజిటౌజేషన్ , సైబర్ సెక్యూరిటీ సమస్యలు, పెద్ద దేశాలను పట్టి పీడిస్తున్న వలసలు, ఉగ్రవాదం తదితర ఎన్నో సమస్యలు ఐటీ రంగంపై ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు. ముందడుగు పడకుంటే పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాం. ఆటోమేషన్, టెక్నాలజీ విభాగాల్లో మరింతగా అభివృద్ధి చెందాల్సి వుంది. క్లయింట్లకు మరింత సమర్థవంతమైన సేవలను అందించాల్సి వుందపి విశాల్ చెప్పారు. విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ మరోవైపు 2016 లో ఎదునైన అడ్డంకులను, సవాళ్లను విస్మరించలేమంటూ విప్రో ఛైర్మన్ అజిం ప్రేమ్ జీ పేర్కొన్నారు. కానీ, వివాదాలపై దృష్టిపెట్టకుండా కామన్ గ్రౌండ్ పై దృష్టిపెట్టాలంటూ నాలుగు సూత్రాలను ప్రేమ్ జీ ఉద్యోగులకు సూచించారు. తోటి మానవులను గౌరవించాలని ప్రకృతి పట్ల కూడా అదే గౌరవం కలిగి ఉండాలన్నారు. అపుడు కామన్ గ్రౌండ్ ను గుర్తించడం సాధ్యమవుతుంది.సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు ప్రకృతి అన్నీమానవులతో పెనవేసుకున్న బంధాన్ని, అనుసంధానం గుర్తించాలన్నారు. మన సమస్యలు, వాటి పరిష్కారాలు ఈ సంబంధాలను బలోపేతం చేసుకోవడంలోనే ఉందన్నారు. ప్రత్యీ ఉద్యోగి విలువలకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలన్నారు. ఈ సందర్భంగా రాజస్తాన్ సందర్శన, అక్కడి ప్రజల కష్టాలను, వారి పోరాటాలను తన లేఖలో విప్రో ఛైర్మన్ ఉదహరించారు. . -
పరస్పర ప్రయోజనాలతోనే ముందుకు: ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ: ‘‘వివాదాలపై దృష్టి సారించడానికి బదులు ఉమ్మడి ప్రయోజనాలను గుర్తించాలి. ఈ ప్రపంచంలో వాస్తవం ఏంటంటే ప్రజల మధ్య ఎప్పుడూ అనంగీకారం, విభేదాలు ఉంటుంటాయి. కానీ, ముందుకు వెళ్లాలంటే పరస్పర ప్రయోజనాల మేరకు కలసి సాగడమే అందుకు పరిష్కారం’’ అని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ కంపెనీ ఉద్యోగులకు నూతన సంవత్సరం సందర్భంగా రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజకీయ రంగంలో గతేడాది చోటుచేసుకున్న పరిణామాలను ప్రేమ్‌జీ ఉటంకిస్తూ... ఉత్తమ ప్రపంచ ఆవిష్కరణ దిశగా 2016 అడ్డంకులు, ప్రశ్నలను రేకెత్తించిందన్నారు. ఈ అంశాలను విడిచపెట్టడం కంటే పరిష్కరించే ప్రయత్నాలను మొదలుపెడితే... ప్రగతిని సాధిస్తామన్న నమ్మకం తనకుందన్నారు. -
పెద్దనాన్నలా ట్యూన్లు కట్టలేను కావాలంటే...
ఇసైజ్ఞానిలా ట్యూన్లు కట్టలేను కావాలంటే ఆయనలా డ్రస్ ధరించగలను అని చెప్పానని నటుడు, సంగీతదర్శకుడు ప్రేమ్‌జీ పేర్కొన్నారు. ట్రిపుల్ వి.రాకార్డ్స పతాకంపై ఇంతకు ముందు ఎన్నమో నడక్కుదు వంటి విజ యవంతమైన చిత్రాన్ని అందించిన వీవీ.వినోద్‌కుమార్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం అచ్చమిండ్రి. విజయ్‌వసంత్,సృష్టిడాంగే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని, రాధారవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రేమ్‌జీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీతదర్శకుడు ప్రేమ్‌జీ మాట్లాడుతూ విజయ్‌వసంత్ హీరోగా వినోద్‌కుమార్ చిత్రం నిర్మించనున్నారని చెప్పగానే దానికి తానే సంగీతదర్శకుడినని అన్నానన్నారు.అందుకు వారూ అంగీకరించారని తెలిపారు.అంతే కాదు ఇకపై వారు రూపొందించే చిత్రాలు తానే సంగీతదర్శకుడినని, ఇది మాటలతో కుదుర్చుకున్న ఒప్పందం అని చెప్పారు. ఇకపోతే తాను తన పెద్దనాన్న(ఇళయరాజా) పాటల ట్యూన్సను కాపీ కొడుతున్నానని చాలా మంది అంటున్నారన్నారు. నిజమే తాను తన పెద్దనాన్న ట్యూన్సనే మార్చి రూపొందిస్తున్నానని ఒప్పుకుంటున్నానన్నారు. ఇసైజ్ఞాని సంగీతాన్ని అందరూ కాపీ కొడుతున్నారని, అలాంటిది తమ సొత్తు అరుున ఆయన సంగీతాన్ని తాను కాపీ కొట్టకూడదా?అంటూ ప్రశ్నించారు. తన దర్శక నిర్మాతలు ఇళయరాజా ట్యూన్సలా హారుుగా ఉండే పాటలను రూపొందించమని అడుగుతున్నారని, ఆయనలా సంగీతాన్ని అందించడం తన వల్లకాదు. కావలంటే ఆయనలా డ్రస్ ధరించగలనని చెప్పేవాడినని అన్నారు. అన్నట్టుగానే ఒక రోజు పెద్దనాన్నలా జుబ్బా, పంచె కట్టి, మెడలో రుద్రాక్షమాల ధరించి, హార్మోనియం చేతపట్టి ఫొటోలకు ఫోజులిచ్చానని తెలిపారు. వాటిని పోస్టర్‌గా ముద్రించి వాడవాడలా అంటించారని తెలిపారు.అలా పెద్దనాన్న ఇంటి గోడలకు అంటించడంతో అవి చూసిన ఆయన తనను పిలిచి ఏరా తనలా ఫోజులిచ్చి ఎగతాళి చేస్తున్నావా? అని అడిగారన్నారు. అందుకు తాను అదికాదు పెద్దనాన్నా మీ ట్యూన్సలా తనను కట్టమన్నారని, అలా తన వల్లకాదు కావాలంటే మీలా దుస్తులు ధరించి ఫొటో ఫోజులివ్వగలనని చెప్పానని తెలిపారు. వసంత్‌కుమార్, సంగీతదర్శకుడు యువన్రాజా, వెంకట్‌ప్రభు, చిత్ర హీరో విజయ్‌వసంత్, సృష్టిడాంగే, చిత్రనిర్మాత వినోద్‌కుమార్, దర్శకుడు రాజపాండే, ఆర్కే.సెల్వమణి, పొన్వన్నన్, రోహిణి పాల్గొన్నారు. -
టెక్ కుబేరుల జాబితాల్లో ఇద్దరు భారతీయులు
ఫోర్బ్స్ ప్రకటించిన 100 మంది టెక్ కుబేరుల జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్లు ఫోర్బ్స్ జాబితాలో టాప్-20లో నిలిచారు. 16 బిలియన్ డాలర్ల ఆస్తితో ప్రేమ్‌జీ 13వ ర్యాంకును దక్కించుకోగా.. 11.6 బిలియన్ డాలర్ల ఆస్తితో శివ్ నాడార్ 17వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. "100 రిచెస్ట్ టెక్నాలజీ బిలినీయర్ల ఇన్ ది వరల్డ్ 2016" జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో 78 బిలియన్ డాలర్ల ఆస్తితో మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తొలి స్థానంలో ఉన్నారు. ఇండో -అమెరికన్ టెక్నాలజీ సింఫొనీ టెక్నాలజీ గ్రూప్ సీఈవో రొమేశ్ వాధ్వాని, ఐటీ కన్సల్టింగ్, ఔట్సోర్సింగ్ కంపెనీ సింటెల్ వ్యవస్థాపకులు భరత్ దేశాయ్, ఆయన భార్య నీర్జా సేతీలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. భారత మూడో అతిపెద్ద ఔట్సోర్సర్గా ఉన్న ప్రేమ్‌జీ కంపెనీ విప్రో, గత ఏళ్లుగా నమోదుచేస్తూ వస్తున్న వృద్ధితో ఆయన కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. నాడార్కు హెచ్‌సీఎల్ టాలెంట్ కేర్‌తో పాటు, గ్రాడ్యుయేట్లకు శిక్షణను ఇచ్చే స్కిల్స్ డెవలప్మెంట్ సంస్థ ఉందని పేర్కొంది. ఆయన తాజా వెంచర్ 500 మిలియన్ డాలర్ల ఫండ్‌ను పలు స్టార్టప్‌ల్లో, అమెరికా హెల్త్ కేర్ టెక్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు ఫోర్బ్స్ తెలిపింది. గూగుల్ అల్ఫాబెట్ ఛైర్మన్ ఎరిక్ ష్మిత్, ఉబర్ సీఈఓ ట్రావిస్ కలనిక్లు జాబితాలో టాప్ 20లో ఉన్నారు. సంపన్న టెక్ దిగ్గజాల జాబితాలో అత్యధికంగా దాదాపు సగం మంది అమెరికాకు చెందిన వారు ఉన్నారు. తొలి పది మందిలో ఎనిమిది మంది అమెరికా వారే. తర్వాత స్థానాల్లో చైనాకు చెందిన వారు 19 మంది ఉన్నారు. -
ప్రపంచ కుబేరుల్లో మనోళ్లు ముగ్గురు..!
♦ ముకేశ్, ప్రేమ్‌జీ, దిలీప్ సంఘ్వీలకు చోటు ♦ 50 మందితో వెల్త్ ఎక్స్ జాబితా విడుదల న్యూఢిల్లీ: ప్రపంచ సంపన్నుల జాబితాలో ముగ్గురు భారతీయులు స్థానం పొందారు. వారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ, సన్‌ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ ఉన్నారు. వెల్త్ఎక్స్ టాప్-50 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ముకేశ్ అంబానీ 24.8 బిలియన్ డాలర్ల సంపదతో 27వ స్థానంలో నిలిచారు. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ 16.5 బిలియన్ డాలర్ల సంపదతో 43వ స్థానంలో, సన్ ఫార్మా అధిపతి దిలీప్ సంఘ్వీ 16.4 బిలియన్ డాలర్ల సంపదతో 44వ స్థానంలో ఉన్నారు. టాప్-50 ధనవంతుల మొత్తం సంపద 1.45 ట్రిలియన్ డాలర్లు. ఇది ఆస్ట్రేలియా జీడీపీతో సమానం. వెల్త్ఎక్స్ సంపన్నుల జాబితాలో 29 మంది అమెరికన్లు, నలుగురు ైచె నీయులు, ముగ్గురు భారతీయులు ఉన్నారు. అలాగే ఈ సంపన్నుల్లో టెక్నాలజీ రంగానికి చెందిన వారే అధికంగా (12 మంది) ఉండటం గమనార్హం. టాప్-50 బిలియనీర్లలో అత్యంత పిన్న వయస్కుడు ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ (31 ఏళ్లు). ఈయన 42.8 బిలియన్ డాలర్ల సంపదతో 8వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో నలుగురు మహిళలు స్థానం పొందారు. -
హైజీనిక్ రీసెర్చ్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ పెట్టుబడులు
ముంబై: సూపర్ వాస్మోల్ 33 తదితర కేశ సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ హైజీనిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (హెచ్ఆర్ఐ)లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థ రూ. 216 కోట్లు పెట్టుబడులు పెట్టింది. అయితే ఎంత మేర వాటాలు కొనుగోలు చేసినదీ వెల్లడి కాలేదు. ఐటీ దిగ్గజం విప్రో గ్రూప్ చైర్మన్ అజీం ప్రేమ్‌జీకి చెందిన ఇన్వెస్ట్మెంట్ విభాగమే ప్రేమ్‌జీ ఇన్వెస్ట్. సూపర్ వాస్మోల్, స్ట్రీక్స్ వంటి ఉత్పత్తులను విక్రయించే హైజీనిక్ వార్షిక టర్నోవరు సుమారు రూ. 350 కోట్లుగా ఉంది. రూ. 1,000 కోట్ల కంపెనీగా ఎదిగే దిశగా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ పెట్టుబడులు తమకు ఊతమివ్వగలవని హైజీనిక్ సీఈవో మనీష్ ఛాబ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీల ఆటోమేషన్‌కి, ఐటీ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసుకోవడంతో పాటు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మరింతగా వెచ్చించేందుకు ఈ నిధులు ఉపయోగపడగలవని తెలిపారు. అటు సంతూర్, చంద్రిక వంటి బ్రాండ్లతో ఎఫ్ఎంసీజీ రంగంలోనూ విప్రో గ్రూప్ కార్యకలాపాలు ఉన్న నేపథ్యంలో తాజాగా హెచ్ఆర్ఐలో వాటాల కొనుగోలు ప్రాధాన్యం సంతరించుకుంది. -
మెప్పించని విప్రో..!
క్యూ4 నికర లాభం రూ. 2,286 కోట్లు; 2.1% వృద్ధి ⇒ ఆదాయ వృద్ధి 3.9 శాతం; రూ. 12,171 కోట్లు ⇒ షేరుకి రూ.7 తుది డివిడెండ్... ⇒ బోర్డులోకి ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ... బెంగళూరు: భారత్‌లో మూడో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ విప్రో.. మిశ్రమమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. అయితే, విప్రో ప్రేమ్‌జీ పెద్ద కుమారుడు రిషద్ ప్రేమ్‌జీని బోర్డులోకి తీసుకురావడం ఈసారి ఫలితాల ప్రకటనలో కీలకంగా నిలిచింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 2.1 శాతం వృద్ధితో రూ.2,286 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.2,239 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.11,704 కోట్ల నుంచి రూ.12,171 కోట్లకు పెరిగింది. 3.9 శాతం వృద్ధి చెందింది. ఇక ప్రధానమైన ఐటీ సేవల ఆదాయం క్యూ3లో 6 శాతం వృద్ధి చెంది రూ.11,240 కోట్లకు చేరింది. డాలర్ల రూపంలో చూస్తే 1.77 బిలియన్ డాలర్లు(3.2% వృద్ధి)గా నమోదైంది. మార్కెట్ వర్గాలు సగటున క్యూ3లో ఐటీ సేవల ఆదాయం రూ.11,399 కోట్లు(డాలర్లలో 1.79 కోట్లు) ఉండొచ్చని అంచనా వేయగా.. దీనికంటే తక్కువగానే కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) తొలి త్రైమాసికం(క్యూ1, ఏప్రిల్-జూన్)కు ఆదాయ అంచనా(గెడైన్స్) తగ్గింది. 1.76-1.79 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే... డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే(క్యూ2) కంపెనీ లాభం సీక్వెన్షియల్‌గా 3.7 శాతం పెరిగింది. క్యూ2లో లాభం రూ.2,203 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం రూ.12,085 కోట్ల నుంచి నామమాత్రంగా 0.7 శాతం పెరిగింది. సీక్వెన్షియల్‌గా ఐటీ సేవల ఆదాయం డాలర్ల రూపంలో 1.2 శాతం, రూపాయి ప్రాతిపదికన 0.9 శాతం క్షీణించడం గమనార్హం. ‘డిజిటల్, ఓపెన్‌సోర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాలు భవిష్యత్తు వ్యాపారాభివృద్ధిలో కీలక పాత్ర పోషించునున్నాయి. కొన్ని విభాగాల్లో ఇబ్బందులు నెలకొన్నప్పటికీ.. మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అని విప్రో సీఈఓ టీకే కురియన్ వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల(బీఎఫ్ఎస్ఐ) రంగం నుంచి వ్యాపారంలో కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. తయారీ, హెల్త్‌కేర్, రిటైల్‌లో పటిష్టమైన వృద్ధి కనబడుతోందన్నారు. పూర్తి ఏడాదికి ఇలా... 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 11.03 శాతం ఎగబాకి రూ.8,706 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది లాభం రూ.7,840 కోట్లుగా ఉంది. ఇక ఆదాయం 8.14 శాతం వృద్ధితో రూ. 43,754 కోట్ల నుంచి రూ.47,318 కోట్లకు ఎగసింది. కాగా, ఐటీ సేవల ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధి చెంది రూ.44,020 కోట్లుగా నమోదైంది. డాలర్ల రూపంలో చూస్తే ఈ మొత్తం 7.08 బిలియన్ డాలర్లు(7 శాతం వృద్ధి). ఇతర ముఖ్యాంశాలు... ⇒ మార్చి చివరినాటికి ఐటీ సేవల విభాగంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,58,217కు చేరింది. ⇒ క్యూ4లో కొత్తగా 65 మంది క్లయింట్లను కంపెనీ దక్కించుకుంది. ⇒ రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుపై కంపెనీ రూ.7 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ⇒ కంపెనీ షేరు మంగళవారం బీఎస్ఈలో 0.67% నష్టంతో రూ.579 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలొచ్చాయి. వారసుడొచ్చాడు... విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తన వారసత్వ పగ్గాలను అప్పగించేందుకు తొలి అడుగు పడింది. చాన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆయన పెద్ద కుమారుడు 38 ఏళ్ల రిషద్ ప్రేమ్‌జీని విప్రో డెరైక్టర్ల బోర్డులోకి తీసుకొచ్చారు. హోల్‌టైమ్ డెరైక్టర్‌గా ఆయనను నియమిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నియామకం ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. కంపెనీ వ్యూహాల్లో, విలీనాలు-కొనుగోలు డీల్స్ విషయంలో ఆయన కీలకమైన పాత్రను పోషిస్తూవస్తున్నారని కూడా వెల్లడించింది. కాగా, రిషద్ ఇప్పటికే విప్రో ఎంటర్ప్రైజెస్(ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా ఇంజనీరింగ్ సంస్థ), విప్రో-జీఈ జాయింట్ వెంచర్ సంస్థ, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌లో బోర్డు సభ్యుడిగా కొనసాగుతుండటం గమనార్హం. హార్వర్డ్‌లో విద్యాభ్యాసం చేసిన రిషద్... 2007 జూన్‌లో తొలిసారిగా బిజినెస్ మేనేజర్ స్థాయిలో కంపెనీలోకి ప్రవేశించారు. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో ప్రత్యేక ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. మూడేళ్ల తర్వాత కంపెనీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా, తాజా నియామకంతో ఇక టాప్ పోస్టుకు మార్గం సుగమమైనట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, చిన్న కొడుకు తారిక్ ప్రేమ్‌జీ విప్రో ఫౌండేషన్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం విప్రోలో ప్రేమ్‌జీకి నేరుగా 3.78 శాతం వాటా ఉండగా.. ఆయనకు చెందిన ఇతర సంస్థల ద్వారా దాదాపు 70 శాతం వాటా ఉంది. మార్చి చివరినాటికి విప్రోలో రిషద్ వాటా 0.03 శాతం. 1945 డిసెంబర్లో అజీమ్ ప్రేజ్జీ(69 ఏళ్లు) విప్రోను నెలకొల్పారు. ప్రస్తుతం 17.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో 48వ స్థానంలో ఉన్నారు. కాగా, వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగానే రిషద్‌కు బోర్డులో చోటు దక్కిందని సీఈఓ టీకే కురియన్ వ్యాఖ్యానించారు. -
నారదన్ రెడీ అవుతున్నాడు
ఆట, పాట, హాస్యం, పోరాటం అంటూ జనరంజక అంశాలతో నారదన్ రెడీ అవుతున్నాడు. పని కోసం, తన మామ, ఆయన కూతురిని చూడడానికి కోవై నుంచి చెన్నైకి వస్తున్న హీరో హీరోయిన్ను వెంటాడుతున్న రౌడీలతో పోరాడి చిక్కుల్లో పడుతాడు. ఆ తరువాత అతని జీవితం ఎలాంఇ మలుపులు తిరిగిందన్న పలు ఆసక్తికరమైన సన్నివేశాలు సమాహారంతో తెరకెక్కుతున్న చిత్రం నారదన్. నకుల్, నికిషా పటేల్, శ్రుతిరామకృష్ణ, హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రేమ్‌జి, రాధారవి, ఎం ఎస్ భాస్కర్, మయిల్‌స్వామి, వైయాపురి, ఫవర్ స్టార్ శ్రీనివాసన్, పాండు, కుంకి అశ్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఎం.సెల్వకుమార్, సజిత, ఎ.నంబియార్ కలిసి నిర్మిస్తున్నారు. నాగ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ చిత్ర ప్రారంభంలో వచ్చే హీరో పరిచయ పాటకు నకుల్పై చిత్రీకరించినట్టు తెలిపారు. అదే విధంగా సలీమ్ చిత్రంలో మస్కార్ పాటకు ఆడిన అస్మిత్, ముంబయి మోడల్స్ నటించిన పాటను బ్రహ్మాండమైన సెట్ వేసి చిత్రీకరించినట్లు చెప్పారు. నకుల్ రౌడీలతో పోరాడే సన్నివేశాలకు ఇటీవల బిన్ని మిల్లులో పదిరోజుల పాటు చిత్రీకరించినట్లు తెలిపారు. అలాగే నకుల్, శ్రుతితో ఆడిపాడిన డ్యూయెట్ పాట జనరంజకంగా వచ్చినట్లు చెప్పారు.