పరస్పర ప్రయోజనాలతోనే ముందుకు: ప్రేమ్‌జీ | Succeed to improve the world, Premji asks Wipro staffers | Sakshi
Sakshi News home page

పరస్పర ప్రయోజనాలతోనే ముందుకు: ప్రేమ్‌జీ

Published Tue, Jan 3 2017 1:47 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

పరస్పర ప్రయోజనాలతోనే ముందుకు: ప్రేమ్‌జీ

పరస్పర ప్రయోజనాలతోనే ముందుకు: ప్రేమ్‌జీ

న్యూఢిల్లీ: ‘‘వివాదాలపై దృష్టి సారించడానికి బదులు ఉమ్మడి ప్రయోజనాలను గుర్తించాలి. ఈ ప్రపంచంలో వాస్తవం ఏంటంటే ప్రజల మధ్య ఎప్పుడూ అనంగీకారం, విభేదాలు ఉంటుంటాయి. కానీ, ముందుకు వెళ్లాలంటే పరస్పర ప్రయోజనాల మేరకు కలసి సాగడమే అందుకు పరిష్కారం’’ అని విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ కంపెనీ ఉద్యోగులకు నూతన సంవత్సరం సందర్భంగా రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజకీయ రంగంలో గతేడాది చోటుచేసుకున్న పరిణామాలను ప్రేమ్‌జీ ఉటంకిస్తూ... ఉత్తమ ప్రపంచ ఆవిష్కరణ దిశగా 2016 అడ్డంకులు, ప్రశ్నలను రేకెత్తించిందన్నారు. ఈ అంశాలను విడిచపెట్టడం కంటే పరిష్కరించే ప్రయత్నాలను మొదలుపెడితే... ప్రగతిని సాధిస్తామన్న నమ్మకం తనకుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement