జోరు.. హుషారు... | Nikesha's back-to-back bilinguals | Sakshi
Sakshi News home page

జోరు.. హుషారు...

Published Wed, Jan 11 2017 11:58 PM | Last Updated on Tue, Aug 21 2018 4:42 PM

జోరు.. హుషారు... - Sakshi

జోరు.. హుషారు...

పులిపిల్ల మంచి జోరు మీదుందండీ! పులిపిల్ల అంటే ఎవరో అనుకునేరు. నికిషా పటేల్‌ . ‘కొమరం పులి’తో ఈ ఎన్నారై భామ హీరోయిన్‌గా పరిచయమై అప్పుడే ఆరేళ్లయింది. ‘కొమరం పులి’ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాలు చేసినా... ఇప్పటికీ నికిషా పటేల్‌ని పులి పిల్లగానే ప్రేక్షకులు గుర్తు పడుతున్నారు. ఇప్పటికీ ఆమెను వెతుక్కుంటూ మంచి ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న ‘గుంటూర్‌ టాకీస్‌–2’ సినిమా అంగీకరించిన ఈ భామ, తాజాగా తెలుగు–తమిళ బైలింగ్వల్‌ సినిమాలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ‘జర్నీ’ ఫేమ్‌ జై హీరోగా నటించనున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

హర్షిమ్‌ మారేకర్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నికిషా పటేల్‌ క్యారెక్టర్‌ ఆసక్తికరంగా ఉంటుందట! ఈ రెండూ కాకుండా మలయాళ హిట్‌ సినిమా ‘100 డిగ్రీ సెల్సియస్‌’ తెలుగు, తమిళ రీమేక్‌లో నికిషా కీలక పాత్రలో నటిస్తున్నారు. మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాయ్‌ లక్ష్మి, అనూ ఇమ్మాన్యుయేల్‌ ఇతర కీలక పాత్రధారులు. ఇంకో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట! ఈ ఏడాది కెరీర్‌ జోరుగా సాగుతుందనే నమ్మకాన్ని నికిషా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement