అరకు రోడ్‌లో థ్రిల్... ఫుల్ | Araku Road Lo is thriller movie | Sakshi
Sakshi News home page

అరకు రోడ్‌లో థ్రిల్... ఫుల్

Published Sun, Oct 16 2016 11:39 PM | Last Updated on Mon, Aug 20 2018 3:54 PM

అరకు రోడ్‌లో థ్రిల్... ఫుల్ - Sakshi

అరకు రోడ్‌లో థ్రిల్... ఫుల్

రామ్ శంకర్, నికిషా పటేల్ జంటగా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘అరకు రోడ్‌లో’. వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డీటీఎస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. అరకు రోడ్‌లో ఏం జరిగిందన్నది ఆసక్తికరం. ఈ చిత్రంలోని సన్నివేశాలు ఉత్కంఠకు గురి చేస్తాయి.

ప్రేక్షకులకు అవసరమైన అంశాలతో పాటు వాణిజ్య విలువలు న్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా హీరో ప్రభాస్ రిలీజ్ చేసిన పాటకు సూపర్ క్రేజ్ వచ్చింది. మా చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, పృధ్వీ, కృష్ణభగవాన్, రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రాహుల్ రాజ్, వాసుదేవ్, కెమెరా: జగదీశ్ చీకటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement