అరకు అందాలను వీక్షిస్తున్న పర్యాటకులు
పద్మాపురం ఉద్యానవనంలోని హాట్ ఎయిర్ బెలూన్‌కు మంచి ఆదరణ
మెలికలు తిరిగే ఘాట్ రోడ్డు, ఎటుచూసినా ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లు, రంగురంగుల పూల మొక్కలు. మంచు దుప్పట్లో ప్రకృతి అందాలు. ఇలా భూతల స్వర్గాన్ని తలపించే అరకు అందాలను ఆకాశవీధిలోంచి వీక్షించేందుకు పాడేరు ఐటీడీఏ హాట్ ఎయిర్ బెలూన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అరకు పద్మాపురం ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన దీనిపై విహరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
పది నిమిషాలు ఆకాశంలో విహరించేందుకు ఒకొక్కరి నుంచి రూ. 1500 వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు 244 మంది విహరించగా 3.66 లక్షల ఆదాయం వచ్చింది. దీనిని పాడేరు ఐటీడీఏ, ఈగల్ ఫ్లై కంపెనీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇక్కడ రెండు హాట్ ఎయిర్ బెలూన్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది. పారామెటార్లను కూడా కంపెనీ ప్రతినిధులు సిద్ధం చేశారు. ఇందుకుగాను గ్రౌండ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది.
పాడేరు ప్రాంతానికి చెందిన కొంతమంది నిరుద్యోగులు ఢిల్లీలోని గురుగామ్‌లో హాట్ ఎయిర్ బెలూన్, పారా మోటార్ ఫ్లయింగ్‌లో శిక్షణ పొందారు. వీరంతా ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. – అరకులోయ టౌన్
Comments
Please login to add a commentAdd a comment