Hot air balloon
-
అరకులో ఎయిర్ బెలూన్
-
గాలి బుడగపై ఎలా తేలారు?
1780 కాలంఫ్రెంచ్ దేశస్తుడు జోసెఫ్ మాంట్గోల్ఫియర్, అతని తమ్ముడు ఎతియన్ ఓసారి మంటలోంచి పుట్టిన పోగ పైకిపోతూ దాంతో పాటు చిన్న తేలికైన వస్తువులని మోసుకుపోవడం గమనించారు. అంటే చల్లగాలి కన్నా వేడిగాలి తేలికైనది (తక్కువ సాంద్రత కలది) అన్నమాట. నీట్లో విపోడిచిన కర్ర పైకి తేలినట్టు చల్లగాలిలో వేడిగాలి పైకి కదులుతుంది అన్నమాట.1783లో, జూన్ 5వ నాడు ఆ అన్నదమ్ములు ఫ్రాన్స్ లో తమ స్వగ్రామం అయిన ఆనోనేల, బట్టతో చేసిన ఓ సంచిని వేడిగాలితో నింపారు. వేడిగాలి పైకి లేస్తూ దాంతో పాటు సంచినీ మోసుకుపోయింది. అలా ఆ వేడిగాలి నిండిన సంచి 10 నిముషాలలో 2.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. త్వరలోనే వేడిగాలి చల్లారి ఆ గాలిబుడగ నేలకి దిగి వచ్చింది. నవంబర్‌లో ఆ అన్నదమ్ములు తమ వేడిగాలి బుడగని పారిస్‌లో ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలో 3 లక్షల జనం గాల్లోకి లేచిన గాలిబుడగని ప్రత్యక్షంగా చూశారు. ఈసారి గాలి బుడగ 9.6 కిలోమీటర్లు గాలిలో ప్రయాణించింది.ఆ కాలంలోనే హైడ్రోజన్ అనే అతి తేలికైన వాయువు కనుక్కోబడింది. ఇది వేడిగాలి కన్నా కూడా చాలా తేలికైనది. అప్పటికి తెలిసిన వాయువులు అన్నిట్లోకి అది అతితక్కువ సాంద్రత కలది. ఫ్రెంచ్ శాస్త్రవేత్త జోక్ చార్లెస్ గాలిబుడగలని వేడిగాలితో కాక హైడ్రోజన్‌తో నింపాలని సూచించాడు. ఆ సూచన అమలు అయ్యింది. హైడ్రోజన్ నిండిన గాలిబుడగలు మనుషులని మోస్తూ గాల్లో ప్రయాణించాయి. పందొమ్మిదవ శతాబ్దపు ఆరంభంలో ఎంతోమంది అలాంటి బుడగలలో ప్రయాణించారు. మొట్టమొదటిసారిగా మనుషులు కొన్ని కిలోమీటర్ల ఎత్తువరకు గాల్లోకి పోగలిగారు. అయితే ఈ గాలిబుడగలు కేవలం గాలిలో కొట్టుకుపోగలవు అంతే. అలా కాకుండా దాని బుట్టలోప్రోపెల్లర్ని నడిపించగలిగే ఓ యంత్రాన్ని అమరిస్తే? ఓడ ప్రోపెల్లర్ దానిని ఎటు కావాలంటే అటు ఎలా తీసుకుపోతుందో అదే విధంగా ఈప్రోపెల్లర్ గాలిబుడగని కావలసిన దిశలో తీసుకుపోతుంది. అలాప్రోపెల్లర్ చేత ప్రేరేపింపబడే గాలిబుడగని డిరిజిబిల్ (dirgible) అంటారు. అంటే ఒక ప్రత్యేక దిశ (direction)లో ప్రేరేపింప శక్యమైనది అని అర్ధం. మొట్టమొదటి డిరిజిబిల్ని ఫెర్డినాండ్ ద జెప్పెలిన్ అనే జర్మన్ దేశస్థుడు నిర్మించాడు. అతడు గాలిబుడగని ఓ బారైన, పోగచుట్ట ఆకారం గల తేలిక లోహమైన అల్యూమినియంతో నిర్మించిన ఓ పై తొడుగులో అమర్చాడు. అటువంటి పోడవైన ఆకృతి గాలినీ సులభంగా ఛేదించగలడు. 1900 జులై 2 నాడు మొట్ట మొదటి డిరిజిబిల్ గాల్లోకి లేచింది. మనుషులకి వాళ్లు కావలసిన దిశలో ప్రయాణించే అవకాశం ఏర్పడింది.అప్పట్నుండి 40 ఏళ్ళుగా ఈ డిరిజిబిల్స్ ఇంకా ఇంకా పెద్దవవుతూ, మెరుగవుతూ వచ్చాయి. కాని వాటిలో నింపే హైడ్రోజన్ చాలా ప్రమాదకరమైనది. హైడ్రోజన్ మండే వాయువు. నిప్పు అంటుకుంటే పేలుతుంది. దానికి బదులుగా మరో వాయువు హీలియమ్ వాడొచ్చు. అది హైడ్రోజన్ అంత తేలికైనది కాదు గానీ ఎప్పుడూ నిప్పు అంటుకోదు. అయినా ఈ డిరిజిబిల్స్ అంత వేగంగా కదలగలిగేవి కావు. పైగా తుఫానుల్లో చిక్కుకుంటే ధ్వంసం అయిపోయేవి. అయినప్పటికీ రైట్ బ్రదర్స్ వచ్చి విమానాలపై ప్రయోగాలు చేసే వరకు గాలి బుడగలు మానవుడికి ఎగరాలనే అభిలాషను తీర్చాయి. నేటికీ పర్యాటక స్థలాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. టర్కీలో ఎయిర్ బెలూన్స్ ప్రత్యేక ఆకర్షణ. -
గాల్లో ఉండగానే హాట్ ఎయిర్ బెలూన్‌లో ఎగిసిపడ్డ మంటలు..ప్రయాణికులు..
హాట్ ఎయిర్ బెలూన్లలో పయనిస్తూ ఆకాశపు వీధిని చూడటం అనేది ఒక త్రిల్. సాహస క్రీడలంటే ఇష్టపడే వారు ఈ బెలుస్లలో పయనించడానికి ఎంతో ఇష్టపడతారు. అచ్చం అలానే కొందరు పర్యాటకులు ఒక హాట్ ఎయిర్ బెలూన్‌లో పయనిస్తుండగా విషాదం చోటు చేసుకుంది. ఏమోందో ఏమో! ఒక్కసారి మంటలు చుట్టుముట్టాయి. దీంతో బెలూన్ గోండోలాలో ఉన్న ప్రయాణికులు భయంతో దూకేయగా..మరికొందరూ ఆ మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒక చిన్నారి ముఖానికి తీవ్ర గాయాలు కాగా, దూకేయడంతో తొడ ఎముక ఫ్రాక్చర్ అయ్యింది. భాదితులను 39 ఏళ్ల మహిళ, 50 ఏళ్ల వృద్ధురాలిగా గుర్తించారు. ఇంకా ఇతర ప్రయాణకులెవరైనా ఆ బెలున్ గోండోలాలో ఉన్నారనే తెలియాల్సి ఉంది. మెక్సికో నగరానికి ఈశాన్యంగా ఉన్న టియోటిహుకాన్ అనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రం వద్ద ఈ హాట్ హెయిర్ బెలూన్లను టూరిస్టుల కోసం ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Mexico 🇲🇽 ! Breaking news!🚨🚨 Saturday, April 01, 2023, in the morning hours. a hot air balloon catches fire and collapses in Teotihuacan, 2 people are reportedly dead. The events occurred this morning in the vicinity of the Pyramid of the Sun and the area was cordoned off. pic.twitter.com/DlzJdv2oHH — Lenar (@Lerpc75) April 1, 2023 (చదవండి: అమెరికాలో టోర్నడో బీభత్సం) -
ఇంటిపై కూలిన ఎయిర్ బెలూన్; 11 మంది సీరియస్
వెల్లింగ్టన్: ఆకాశంలో ఎగురుతున్న ఓ హాట్ ఎయిర్ బెలూన్ ఆకస్మాత్తుగా ఇంటిపై కుప్పకూలిపోవడంతో 11 మంది తీవ్రంగా గాయపడిన దుర్ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్‌లోని టూరిస్ట్ ప్రాంతంగా పేరు పొందిన క్వీన్స్టౌన్లోని మోర్వెన్ ఫెర్రీ రోడ్డులో ఉన్న ఒక ఇంటిపై హాట్ ఎయిర్ బెలూన్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్య్కూ టీమ్‌తో ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ దుర్ఘటనపై న్యూజిలాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సోషల్ మీడియాలో అరకు ఎంపీ వ్యంగ్యాస్త్రం
తొలిరోజు ఏర్పాటుచేసిన బెలూన్లు.. 16 గాలిలోకి ఎగిరిన బెలూన్లు.. 13 రైడ్‌కి వెళ్లిన పర్యాటకులు.. 30మంది చూసేందుకు వచ్చిన వీక్షకులు.. 50 నుంచి 60మంది ప్రదర్శన సాగిన సమయం.. అరగంటలోపే బందోబస్తులో ఉన్న పోలీసులు.. 1000 మంది మొత్తం ఫెస్టివల్ ఖర్చు.. సుమారు రూ.5 కోట్లు ..ఈ లెక్క చూస్తేనే అరకు లోయలో బెలూన్ ఫెస్టివల్ ఏస్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. అర్ధగంట సంబరానికి ఐదు కోట్లు ఖర్చు చేసిన పాలకుల నిర్వాకం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ కోసం పాకులాడిన పాలకులు.. వాతావరణ సూచనలను సైతం పట్టించుకోకపోవడంతో ఆహ్లాదకరంగా సాగాల్సిన అరకులో తలపెట్టిన బెలూన్ ఉత్సవాలు కాస్త ఉసూరుమనిపించాయి. మంగళవారం తొలిరోజే మొక్కుబడిగా సాగిన ఉత్సవంలో అరగంట సేపే.. అదీ 13 బెలూన్లే ఎగిరాయి. ఆ తర్వాత రెండు రోజులూ ఈదు రు గాలులు, చిరుజల్లులతో మొత్తం కార్యక్రమాలు రద్దయ్యాయి. ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అరకులోయ వంటి ప్రదేశాల్లో రైడింగ్ సురక్షితం కాదని మొదటిరోజే భావించిన బెలూనిస్టులు ఆ తర్వాత రైడింగ్‌కు ఏమాత్రం ప్రయత్నించలేదు. అల్పపీడనం ఉందని చెప్పినా.. బెలూన్ ఫెస్టివల్ జరిగే మూడురోజుల పాటు ప్రతికూల వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉపరితలం నుంచి ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తాల్లో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఉత్సవాల ప్రారంభానికి ఐదురోజుల ముందే ప్రకటించారు. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని, ఫలితంగా గగనతలంలోనే గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ముందుగానే స్పష్టం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్లు సముద్రమట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తు వరకు పయనిస్తాయని నిర్వాహకులు చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉధృతంగా ఉండే గాలుల ప్రభావంతో అవి అదుపు తప్పే ప్రమాదం ఉంటుందని నిపుణులు ముందుగానే అభిప్రాయపడ్డారు. ఈశాన్య గాలులు బలంగా వీస్తుండడం వల్ల హాట్ ఎయిర్ బెలూన్లు కొండ, కోనల నడుమ ఎత్తులో విహరించడం అంత శ్రేయస్కరం కాదని, వీటిని నియంత్రించడం కూడా కష్టమని ముందుగానే పేర్కొన్నారు. పైగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో భద్రతాపరంగా కూడా సమస్యలు ఎదురవుతాయన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. కానీ ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోకుండా అట్టహాసంగా ఏర్పాట్లు చేసేశారు. విదేశాల నుంచి వచ్చిన బెలూనిస్టుల కోసం కొత్తబల్లుగూడ వద్ద 42 టెంట్లతో పాటు కాన్ఫరెన్స్, డైనింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేశామని పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీరాములు నాయుడు చెప్పినప్పటికీ రెవెన్యూ శాఖ వాటాతో కలిపి రూ.5కోట్లు దాటిందని అంచనా. మంత్రి అఖిల ప్రియతోనే సరి... ఇక ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని చెబుతూ వచ్చిన జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తొలిరోజు డుమ్మా కొట్టారు. రెండో రోజు బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు వస్తారని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడింది. ఇక మూడో రోజు గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేస్తారని సమాచారం ఇచ్చినప్పటికీ వర్షం కారణంగా రద్దయిందని మళ్లీ ప్రకటించారు. ఇక గురువారం సాయంత్రం ముగింపు కార్యక్రమాలకు గంటాను వెళ్లమని సీఎం చెప్పినప్పటికీ వాతావరణం అనుకూలించక ఆయన పర్యటనా రద్దయింది. సాయంత్రానికి పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ మాత్రం వచ్చారు. మొత్తంగా ప్రభుత్వ పెద్దలు, కనీసం జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకుండానే మూడురోజుల పండుగను తూతూ మంత్రంగా గురువారం రాత్రి ముగించేశారు. ఆదిలోనే హంసపాదు.. ప్రతికూల వాతావరణం పెద్దగా లేని తొలిరోజు మంగళవారమే బెలూన్ ఫెస్టివల్ అట్టర్ ఫ్లాఫ్ అయింది. ముందుగా ఎవరికీ అవగాహన కల్పించకపోవడం, సోషల్ మీడియాలో తప్ప పెద్దగా ప్రచారం చేయకపోవడంతో తొలిరోజే తూతూ మంత్రంలా సాగింది. 13 దేశాల నుంచి వచ్చిన బెలూనిస్టులు 16 హాట్ ఎయిర్ బెలూన్లను ఏర్పాటు చేసినప్పటికీ 13 బెలూన్లు మాత్రమే గాలిలోకి లేచాయి. మిగిలిన మూడు సాంకేతిక కారణాలతో ఓపెన్ కాలేదు. 13 బెలూన్లలో ఒక్కో బెలూన్‌లో ఇద్దరు, ముగ్గురు చొప్పున మొత్తం 30 మందిని మాత్రమే రైడ్‌కి తీసుకువెళ్లారు. కనీసం సందర్శకులు కూడా లేక ఆ ప్రాంతం వెలవెలబోయింది. 50నుంచి 60మంది సందర్శకులు మాత్రమే విచ్చేశారు. చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు కూడా పెద్దగా రాలేదు. కానీ పోలీసులు మాత్రం అడుగడుగునా కనిపించారు. ఏజెన్సీలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ బందోబస్తుకు బెటాలియన్ పోలీసులతో సహా వెయ్యిమందికిపైగా బందోబస్తుకు కేటాయించారు. థ్యాంక్స్ టూ ఏపీ గవర్నమెంట్ సోషల్ మీడియాలో అరకు ఎంపీ వ్యంగ్యాస్త్రం అరకు ఏజెన్సీ ప్రమోషన్ పేరిట జరిగిన ఈ బెలూన్ ఫెస్టివల్‌కు కనీసం అరకు ప్రాంత ప్రజాప్రతినిధులకైనా సమాచారం ఇవ్వలేదు. మంత్రులు, ముఖ్యమంత్రి రాక కోసం తీవ్రంగా పరితపించిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస మాత్రంగా కూడా ఆహ్వానించలేదు. దీనిపై అరకు ఎంపీ కొత్తపల్లి గీత బాహటంగానే సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మా ప్రాంతంలో జరుగుతున్న బెలూన్ల పండుగకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఆహ్వానమూ లేదూ.. కనీసం సమాచారమూ లేదు.. థ్యాంక్స్ టూ ఏపీ గవర్నమెంట్ . అని ఆమె పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గాలిదే భారం సాక్షి, విశాఖపట్నం: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న అరకు బెలూన్ ఫెస్టివల్‌కు ప్రకృతి బ్రేకులు వేసింది. ఈ నెల 14న తొలిరోజు అరకొర, అపశ్రుతుల మధ్య బెలూన్ల పండగ గంట సేపటికే పరిమితమైంది. మర్నాడు బుధవారం వర్షం కారణంగా నిర్వాహకులు బెలూన్లు ఎగురవేసే సాహసం చేయలేకపోయారు. దీంతో ముగింపు రోజైన గురువారమైనా బెలూన్లతో సందడి చేయాలనుకున్న బెలూనిస్టులకు వరుణుడు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇలా రూ.కోట్ల రూపాయలు వెచ్చించి మూడు రోజులు అట్టహాసంగా నిర్వహించాలనుకున్న అరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ సందడి లేకుండానే ముగిసింది. పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ గురువారం సాయంత్రం అరకులోయ వెళ్లారు. వాతావరణం అనుకూలిస్తే శుక్రవారం ఉదయమైనా బెలూన్లను ఎగురవేయించాలని నిర్వాహకులను కోరారు. గాలులు, వర్షం లేనిపక్షంలో బెలూన్లు గాలిలోకి పంపడానికి అంగీకరించినట్టు పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీరాములునాయుడు ‘సాక్షి’కి చెప్పారు. దీంతో శుక్రవారం వరుణుడు కరుణ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. -
అరకులో నిలిచిన బెలూన్ ఫెస్టివల్
సాక్షి, విశాఖపట్నం: అరకులోయలో నిర్వహిస్తున్న బెలూన్ ఫెస్టివల్ బుధవారం నిలిచిపోయింది. వర్షం, అల్పపీడనం కారణంగా నిర్వాహకులు రెండోరోజు బెలూన్లను పైకి పంపలేదు. 13 దేశాల నుంచి 16 బెలూన్లు ఈ ఫెస్టివల్ కోసం వచ్చాయి. అయితే సాయంత్రం వాతావరణం అనుకూలిస్తే బెలూన్ ఫెస్టివల్ నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఈ ఉత్సవం రేపటితో ముగియనుంది. కాగా బెలూన్ రెయిడ్స్ కోసం తొలుత మూడు, నాలుగు ప్రాంతాలను పరిశీలించారు. చివరకు అరకు సమీపంలోని సుంకరమెట్టను ఎంపిక చేశారు. అక్కడ నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపగూడ వరకు బెలూన్ రెయిడ్ చేసేందుకు నిర్ణయించారు. సముద్రమట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తు వరకు బెలూనిస్టులు విహరిస్తారు. కానీ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వల్ల గాలుల ఉధృతి అధికంగా ఉండడంతో అంత ఎత్తులో ఎగిరేందుకు ఎంతవరకు వాతావరణం సహకరించలేదు. దీంతో ఎంతో ఆశగా బెలూన్ ఫెస్టివల్ తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు నిరాశగా వెనుతిరిగారు. -
బెలూన్ పండుగ..బుడగేనా!
అంతర్జాతీయ ఫెస్టివల్..దక్షిణ భారతంలోనే మొదటిసారి నిర్వహణ.. మూడు రోజులపాటు ఆకాశంలో విహరించనున్న సాహసికులు.. ఇలా ఎంతో హడావుడి చేశారు.. తీరా ప్రారంభోత్సవానికి మాత్రం ప్రముఖులంతా డుమ్మా కొడుతున్నారు.. మరోవైపు.. వాతావరణం బెలూన్ సంబరాలను బుడగలా మార్చేస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏజెన్సీలోని అరకులో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటిం చడంతో కోట్ల ఖర్చుతో అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ముహూర్త సమయానికి తీవ్ర అల్పపీడనం ఏర్పడటం.. ఈదురు గాలులు.. చిరుజల్లులకు తోడు అదే సమయంలో విశాఖలో అగ్రిహ్యాకథాన్‌కు ఉప రాష్ట్రపతి వస్తున్నారన్న కారణంతో ప్రముఖులు హాజరుకావడంలేదు.. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బెలూన్లు విహరించే ఎత్తును 5వేల అడుగుల నుంచి 40 అడుగులకు కుదించేశారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అంతా.. ఇంతా.. అని చివరికి బెలూన్ పండగ పూర్తి కాకముందే గాలి తీసేశారు మన ప్రభుత్వ పెద్దలు. అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు అరకు ముస్తాబైనా... ప్రారంభోత్సవం చేసేందుకు పెద్దలు ఎవ్వరూ ముందుకు రావడం లేదు.మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్లో 13 దేశాల నుంచి బెలూనిస్టులు వస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా పండుగ చేస్తున్నామని చెప్పిన పాలకులు ఇప్పటికే రూ.ఐదు కోట్ల పైన ఖర్చు చేశారని అంచనా. తీరా ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఎవ్వరూ సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు బుధవారం నుంచి విశాఖ నగరంలో ప్రారంభం కానున్న అగ్రి హాకథాన్ సదస్సు ఏర్పాట్లలో ఉన్న దృష్ట్యా రావడం సాధ్యం కాదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న బెలూన్ ఫెస్టివల్‌కు మంగళవారం ఓ రెండు, మూడు గంటలు కేటాయించడం వారిద్దరికీ పెద్ద పనికాదు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు వస్తున్న దృష్ట్యా ఆహ్వానించేందుకు వారిద్దరూ నగరంలోనే ఉండిపోతున్నారని చెబుతున్నారు. అయితే అరకులో జరిగే బెలూన్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం ఉదయం 7 గంటలకే కావడంతో రోడ్డు మార్గంలో ఉదయం అక్కడకు వెళ్లినా తిరిగి మధ్యాహ్నం 12 గంటల్లోపే మంత్రులు విశాఖ చేరుకోవచ్చు. కానీ మన మంత్రులు అసలు ఆ దిశగా కూడా ఆలోచించకుండా కార్యక్రమానికి ఎగవేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు కూడా ఉప రాష్ట్రపతికి స్వాగత ఏర్పాట్లలో నిమగ్నం కావడంతో అక్కడకు రావడం లేదు. ఇక కృష్ణా జిల్లా విజయవాడలో ఫెర్రీ ఘాట్ వద్ద రెండురోజుల కిందట జరిగిన బోటు ప్రమాద ఘటన నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ అరకు పర్యటనను వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఘటన దరిమిలా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు కూడా అరకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఏజెన్సీ స్థాయి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.రవితో అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్‌ను ప్రారంభించేందుకు పర్యాటక అధికారులు ఏర్పాట్లు చేశారు. అరకులో ఫెస్టివల్‌కు ఏర్పాట్లు సాక్షి, విశాఖపట్నం: అందాల అరకులో మరో పండగకు వేదికయింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే తొలిసారిగా నిర్వహించే అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌కు ఆతిథ్యమిస్తోంది. మంగళవారం నుం చి మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్లో 13 దేశాల నుంచి బెలూనిస్టులు 16 హాట్ ఎయిర్ బెలూన్లతో పాల్గొననున్నారు. పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా పర్యాటకశాఖ నేతృత్వంలో ఈ–ఫ్యాక్టర్ సంస్థ ఈ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇందులో పాల్గొనే బెలూన్ పైలట్లు కొంతమంది హెలికాప్టర్‌లోనూ, మరికొందరు రోడ్డు మార్గంలోనూ సోమవారం సాయంత్రానికి అరకులోయకు చేరుకున్నారు. వీరికి అరకు సమీపంలోని దళపతిగూడ వద్ద 42 టెంట్లతో పాటు అక్కడే కాన్ఫరెన్స్, డైనింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు రెయిడ్స్ ఉంటాయి. బెలూన్ రెయిడ్స్ కోసం తొలుత మూడు, నాలుగు ప్రాం తాలను పరిశీలించారు. చివరకు అరకు సమీపంలోని సుంకరమెట్టను ఎంపిక చేశారు. అక్కడ నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపగూడ వరకు బెలూన్ రెయిడ్ చేయనున్నారు. సముద్రమట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తు వరకు బెలూనిస్టులు విహరిస్తారు. కానీ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వల్ల గాలుల ఉధృతి అధికంగా ఉండడంతో అంత ఎత్తులో ఎగిరేందుకు ఎంతవరకు వాతావరణం సహకరిస్తుందోనన్న ఆందోళన నిర్వాహకుల్లో నెలకొంది. మరోవైపు ఈ బెలూన్ రెయిడ్స్‌లో పాల్గొన దలచిన వారు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్న సూచనతో ఇప్పటిదాకా దాదాపు 6500 మంది వరకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. లాటరీ విధానంలో రోజుకు 300 మందిని ఉచితంగా బెలూన్లలో విహరించేందుకు అనుమతిస్తారు. -
హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదం: 16 మంది మృతి
-
హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదం: 16 మంది మృతి
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 16 మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. దక్షిణ ఆస్టిన్లోని లఖార్ట్ సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పర్యాటకులంతా మృతి చెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం.. 7.40 ప్రాంతంలో బెలూన్‌లో మంటలు చెలరేగడతో బెలూన్ నేలపై కుప్పుకూలినట్టు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్( ఎఫ్ఏఏ) పేర్కొంది. ఈ ఘటనకు గల కారణాలపై ఎఫ్ఏఏ అధికారులు విచారణ చేపట్టారు. చివరకు జాతీయ రవాణా భద్రత సంస్థ కూడా ఈ ఘటనపై విచారించేందుకు రంగంలోకి దిగింది. బెలూన్ ప్రమాదంలో మృతిచెందినవారి పట్ల టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతిని తెలియజేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. -
లోకం చుట్టిన వీరుడు!
కేవలం 11 అంటే 11 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టొచ్చాడు ఓ 65 ఏళ్ల రష్యా వ్యక్తి. అతని పేరు ఫెడర్ కాంకోవ్. చిన్నప్పటి నుంచి సాహసాలంటే చెవికోసుకునే ఫెడర్ వృత్తి పరంగా ఒక మతబోధకుడు. రష్యాలోని ఓ చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్న ఆయన సాహసం అనే ప్రవృత్తిని మాత్రం వదులుకోలేదు. ఏమాత్రం సమయం చిక్కినా హాట్ ఎయిర్ బెలూన్‌లో ఆకాశంలోకి వెళ్లి సరదాగా విహరించేవాడు. ఒక్కసారైనా ప్రపంచాన్ని చుట్టివచ్చే అవకాశం ఇవ్వు అని దేవుడిని తరచూ ప్రార్థించేవాడు. కాని ఒకానొక రోజు ఆయనకు ఆ అవకాశం వచ్చింది. ఇక వదిలిపెడతాడా చెప్పండి. దాదాపు రెండు టన్నుల బరువు, 56 మీటర్ల పొడవు, హీలియంతో నడిచే భారీ హాట్ ఎయిర్ బెలూన్‌లో పెర్త్ నుంచి జూలై 12న బయలుదేరిన ఫెడర్ ప్రపంచాన్ని చుట్టేసి సరిగ్గా 11 రోజుల 6 గంటలకు తిరిగి బయలుదేరిన చోటికి చేరుకున్నాడు. 23 వేల అడుగుల ఎత్తులో విపత్కర వాతావారణాన్ని ఎదుర్కొంటూ గాలులకు తట్టుకుంటూ నిద్రలేమితో ఒంటరిగా ప్రయాణించిన ఫెడర్ అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన సాహసిగా రికార్డు సృష్టించాడు. గతంలో అమెరికాకు చెందిన ఓ వ్యాపార వేత్త ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్‌లోనే 13 రోజుల 8 గంటల్లో ప్రపంచాన్ని చుట్టొచ్చాడు. -
బెలూన్ ఎక్కారు.. జైల్లో పడ్డారు!!
రాజస్థాన్ అందాలను చూద్దామని వెళ్లిన ఇద్దరు విదేశీ మహిళా పర్యాటకులు జైలుపాలయ్యారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో వెళ్దామనుకున్న సాహసం వారిని జైలుపాలు చేసింది. అయితే.. వాళ్లు అరెస్టు కాకుండానే జైలుకు వెళ్లడం ఇక్కడ విశేషం. వెస్టిండీస్‌కు చెందిన ఇద్దరు మహిళలు అజ్మీర్‌లోని పుష్కర్ ప్రాంతం నుంచి హాట్ ఎయిర్ బెలూన్ వేసుకుని నగర సందర్శనకు వెళ్లారు. అయితే.. గాలి బాగా వేగంగా వీయడంతో దాని ఆపరేటర్ బెలూన్ మీద నియంత్రణ కోల్పోయారు. నేరుగా వెళ్లి అజ్మీర్ జైలు ప్రాంగణంలో బెలూన్ దిగింది. ఆ సమయానికి ఖైదీలంతా బ్యారక్‌లలో ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఇలా బెలూన్ దిగడంతో జైలు అధికారులంతా ఒక్కసారిగా తత్తరపడ్డారు. అందులో ఉన్న ఇద్దరు మహిళలను సుమారు గంటపాటు ప్రశ్నించిన తర్వాత అప్పుడు బయటకు పంపారు. దాంతో వాళ్లు బతుకు జీవుడా అనుకుంటూ జైపూర్ వెళ్లిపోయారు. నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించాడంటూ బెలూన్ ఆపరేటర్‌పై కేసు నమోదు చేసి, అతడి లైసెన్సు రద్దు చేశారు. -
మేఘాలలో తేలిపొమ్మన్నది
పక్షుల లాగా గాలిలో ఎగురుతూ.. అందీ అందకుండా ఉండే మేఘాలను అందిపుచ్చుకున్న అనుభూతి పొందుతూ... ఊయల లేకుండానే వినీలాకాశంలో ఉయ్యాల జంపాల అంటూ ఊగిపోతే..! ఆ మజాయే వేరు కదా! టర్కీ లోని కప్పడోసియా ప్రాంతంలో ‘హాట్ ఎయిర్ బెలూన్’ విహారం ఆ సరదా తీరుస్తుంది. చారిత్రక పర్యాటక ప్రదేశంగా పేరుపొందిన కప్పడోసియాలో ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు సూర్యోదయం వేళ డజన్ల కొద్దీ బెలూన్లు గాలిలోకి లేస్తాయి. వాటిలో పర్యాటకులు కేరింతలు కొడుతూ విహరిస్తూ ఉంటారు. సుమారు 200 ఏళ్ల క్రితం అనేక ప్రయోగాల ఫలితంగా ఇలా బెలూన్ సాయంతో గాలిలో విహారం సాధ్యమైంది. ఫ్రాన్స్ దేశస్థులైన జోసెఫ్, ఎటెన్నే మాంట్గోలిఫైర్ అనే అన్నదమ్ములిద్దరూ ఈ హాట్ ఎయిర్ బెలూన్‌కు ఆద్యులు. బాల్యం నుంచీ రెక్కలు కట్టుకొని గాలిలో ఎగరడానికి ఈ అన్నదమ్ములిద్దరూ నిత్యం ఉత్సాహం చూపేవారట. పెరిగి పెద్దయ్యాక పేపర్ తయారీ వ్యాపారం మొదలుపెట్టినా, గాలిలో విహరించాలనే ఆసక్తి వారి మస్తిష్కం నుంచి పోలేదు. రకరకాల ప్రయోగాలు చేసి, మంటలకు కాలిపోని పేపర్‌ను తయారుచేసి గాల్లోకి ఎగరవేసేవారట. ఎన్నో ప్రయోగాల తర్వాత ఈ పేపర్‌తోనే బెలూన్ను తయారుచేసి, నిండా గ్యాస్, హీలియం వాయువు నింపి, యంత్రం సాయంతో వేడిని పెంచుతూ, గాలిలో ఎగిరేలా చేశారు. ఈ అన్నదమ్ముల కృషి ఫలితంగా 1783 జూన్ 5న తొలిసారి ఫ్రాన్స్‌లో వేడిగాలితో నిండిన బెలూన్ గాలిలోకి ఎగిరింది. ఆ సమయంలో పంది, బాతులను బెలూన్‌తో పాటు పంపించారట. ఆ తర్వాత ఏడాది సెంటర్ ప్యారిస్‌లో మనిషి డ్రైవ్ చేస్తుండగా బెలూన్ గాలిలోకి ఎగిరింది. 1999లో 19 రోజుల 21 గంటల పాటు గగనవీధుల్లో హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగరవేసి రికార్డ్ సృష్టించారు. అన్ని దేశాల్లో హాట్ ఎయిర్ బెలూన్ పరిచయమైనప్పటికీ కప్పడోసియా విశాల మైదానాలు వీటికి ప్రధాన వేదికలయ్యాయి. 50 ఏళ్లుగా హాట్ ఎయిర్ బెలూన్ల పట్ల జనాల్లో మరీ ఆసక్తి పెరగడంతో ప్రముఖ కంపెనీలు ఈ బెల్లూన్ల తయారీని చేపడుతున్నాయి. ఈ వేసవిలో టర్కీ యాత్రకు వెళితే గాలిలో విహరించాలనుకునే పర్యాటకులు అక్కడ సందర్శన ప్రాంతాలతోపాటు తప్పక వెళ్లాల్సిన ప్రాంతం కప్పడోసియా. -
రికార్డులపై నడిచెళ్లాడు..
అమెరికాలోని నెవడా ఎడారి.. భూమికి 4 వేల అడుగుల ఎత్తులో ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా.. 40 అడుగుల దూరంలో ఉన్న రెండు హాట్ ఎయిల్ బెలూన్ల మధ్య తాడుపై నడవడం.. గ్రేట్ కదూ.. ఈ దూరాన్ని 20 సెకన్ల కన్నా తక్కువ సమయంలో పూర్తి చేయడం ద్వారా ఆండీ లూయిస్ అనే ఈ సాహసి ప్రపంచ రికార్డును సృష్టించారు. తర్వాత అక్కడి నుంచి ప్యారాచూట్ సాయంతో కిందకి దూకారు. గత రికార్డు 3 వేల అడుగులట. ప్రస్తుతం దాని కన్నా వెయ్యి అడుగుల ఎత్తులో లూయిస్ నడవడం విశేషం.