బెలూన్ ఎక్కారు.. జైల్లో పడ్డారు!! | foreign ladies land in jail after raiding hot air balloon | Sakshi
Sakshi News home page

బెలూన్ ఎక్కారు.. జైల్లో పడ్డారు!!

Published Wed, Nov 5 2014 2:20 PM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

బెలూన్ ఎక్కారు.. జైల్లో పడ్డారు!! - Sakshi

బెలూన్ ఎక్కారు.. జైల్లో పడ్డారు!!

రాజస్థాన్ అందాలను చూద్దామని వెళ్లిన ఇద్దరు విదేశీ మహిళా పర్యాటకులు జైలుపాలయ్యారు. హాట్ ఎయిర్ బెలూన్లో వెళ్దామనుకున్న సాహసం వారిని జైలుపాలు చేసింది. అయితే.. వాళ్లు అరెస్టు కాకుండానే జైలుకు వెళ్లడం ఇక్కడ విశేషం. వెస్టిండీస్కు చెందిన ఇద్దరు మహిళలు అజ్మీర్లోని పుష్కర్ ప్రాంతం నుంచి హాట్ ఎయిర్ బెలూన్ వేసుకుని నగర సందర్శనకు వెళ్లారు. అయితే.. గాలి బాగా వేగంగా వీయడంతో దాని ఆపరేటర్ బెలూన్ మీద నియంత్రణ కోల్పోయారు. నేరుగా వెళ్లి అజ్మీర్ జైలు ప్రాంగణంలో బెలూన్ దిగింది.

ఆ సమయానికి ఖైదీలంతా బ్యారక్లలో ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఇలా బెలూన్ దిగడంతో జైలు అధికారులంతా ఒక్కసారిగా తత్తరపడ్డారు. అందులో ఉన్న ఇద్దరు మహిళలను సుమారు గంటపాటు ప్రశ్నించిన తర్వాత అప్పుడు బయటకు పంపారు. దాంతో వాళ్లు బతుకు జీవుడా అనుకుంటూ జైపూర్ వెళ్లిపోయారు. నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించాడంటూ బెలూన్ ఆపరేటర్పై కేసు నమోదు చేసి, అతడి లైసెన్సు రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement