ajmeer jail
-
మాకు టీవీ, ఫోన్ కావాలి..
జైపూర్(రాజస్థాన్): టీవీ, ఫోన్, వాలీబాల్ కోర్టు వెంటనే ఏర్పాటు చేయాలంటూ అజ్మీర్ జైలు ఖైదీలు నిరశన దీక్షకు పూనుకున్నారు. అత్యంత భద్రతా ఏర్పాట్లున్న రాజస్థాన్ అజ్మీర్ జైలులో దాదాపు 70 మంది కరడుగట్టిన నేరస్తులున్నారు. టీవీ, ఫోన్, వాలీబాల్ కోర్టు డిమాండ్లతో ఏడుగురు ఖైదీలు నాలుగు రోజులుగా దీక్ష సాగిస్తున్నారు. ఖైదీలు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో జైలు అధికారులు సోమవారం ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మరో 44 మంది ఖైదీలు సోమవారం నిరవధిక దీక్షకు పూనుకున్నారు. దీనిపై జైళ్ల శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అజిత్ సింగ్ మాట్లాడుతూ ఖైదీలకు టీవీ, ఫోన్ సౌకర్యం కల్పించే విషయం పరిశీలిస్తామని, వాలీబాల్ కోర్టు ఏర్పాటు డిమాండ్ మాత్రం తీర్చలేమన్నారు. వాలీబాల్ ఆట కారణంగా ఖైదీల మధ్య గొడవలు జరిగే అవకాశాలున్నందున తిరస్కరించినట్లు వివరించారు. -
బెలూన్ ఎక్కారు.. జైల్లో పడ్డారు!!
రాజస్థాన్ అందాలను చూద్దామని వెళ్లిన ఇద్దరు విదేశీ మహిళా పర్యాటకులు జైలుపాలయ్యారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో వెళ్దామనుకున్న సాహసం వారిని జైలుపాలు చేసింది. అయితే.. వాళ్లు అరెస్టు కాకుండానే జైలుకు వెళ్లడం ఇక్కడ విశేషం. వెస్టిండీస్‌కు చెందిన ఇద్దరు మహిళలు అజ్మీర్‌లోని పుష్కర్ ప్రాంతం నుంచి హాట్ ఎయిర్ బెలూన్ వేసుకుని నగర సందర్శనకు వెళ్లారు. అయితే.. గాలి బాగా వేగంగా వీయడంతో దాని ఆపరేటర్ బెలూన్ మీద నియంత్రణ కోల్పోయారు. నేరుగా వెళ్లి అజ్మీర్ జైలు ప్రాంగణంలో బెలూన్ దిగింది. ఆ సమయానికి ఖైదీలంతా బ్యారక్‌లలో ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఇలా బెలూన్ దిగడంతో జైలు అధికారులంతా ఒక్కసారిగా తత్తరపడ్డారు. అందులో ఉన్న ఇద్దరు మహిళలను సుమారు గంటపాటు ప్రశ్నించిన తర్వాత అప్పుడు బయటకు పంపారు. దాంతో వాళ్లు బతుకు జీవుడా అనుకుంటూ జైపూర్ వెళ్లిపోయారు. నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించాడంటూ బెలూన్ ఆపరేటర్‌పై కేసు నమోదు చేసి, అతడి లైసెన్సు రద్దు చేశారు.