జైపూర్(రాజస్థాన్): టీవీ, ఫోన్, వాలీబాల్ కోర్టు వెంటనే ఏర్పాటు చేయాలంటూ అజ్మీర్ జైలు ఖైదీలు నిరశన దీక్షకు పూనుకున్నారు. అత్యంత భద్రతా ఏర్పాట్లున్న రాజస్థాన్ అజ్మీర్ జైలులో దాదాపు 70 మంది కరడుగట్టిన నేరస్తులున్నారు. టీవీ, ఫోన్, వాలీబాల్ కోర్టు డిమాండ్లతో ఏడుగురు ఖైదీలు నాలుగు రోజులుగా దీక్ష సాగిస్తున్నారు.
ఖైదీలు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో జైలు అధికారులు సోమవారం ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మరో 44 మంది ఖైదీలు సోమవారం నిరవధిక దీక్షకు పూనుకున్నారు. దీనిపై జైళ్ల శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అజిత్ సింగ్ మాట్లాడుతూ ఖైదీలకు టీవీ, ఫోన్ సౌకర్యం కల్పించే విషయం పరిశీలిస్తామని, వాలీబాల్ కోర్టు ఏర్పాటు డిమాండ్ మాత్రం తీర్చలేమన్నారు. వాలీబాల్ ఆట కారణంగా ఖైదీల మధ్య గొడవలు జరిగే అవకాశాలున్నందున తిరస్కరించినట్లు వివరించారు.
మాకు టీవీ, ఫోన్ కావాలి..
Published Mon, Mar 6 2017 4:25 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
Advertisement