
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 13 నుంచి 23వ తేదీ వరకు సీఎం విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తన పాస్‌పోర్టును ఏసీబీ కోర్టుకు అప్పగించిన విషయం తెలిసిందే.
బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని, ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టును రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ఇందుకు ఆరు నెలల పాటు తన పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టును రేవంత్ రెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. జులై 6వ తేదీలోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment