
వెల్లింగ్టన్: ఆకాశంలో ఎగురుతున్న ఓ హాట్ ఎయిర్ బెలూన్ ఆకస్మాత్తుగా ఇంటిపై కుప్పకూలిపోవడంతో 11 మంది తీవ్రంగా గాయపడిన దుర్ఘటన న్యూజిలాండ్లో చోటుచేసుకుంది. వివరాలు.. న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్‌లోని టూరిస్ట్ ప్రాంతంగా పేరు పొందిన క్వీన్స్‌టౌన్‌లోని మోర్వెన్ ఫెర్రీ రోడ్డులో ఉన్న ఒక ఇంటిపై హాట్ ఎయిర్ బెలూన్ కుప్పకూలిపోయింది.
ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్య్కూ టీమ్‌తో ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ దుర్ఘటనపై న్యూజిలాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment