South Island
-
కూలిన జపాన్ ఆర్మీ హెలికాప్టర్..10 మంది గల్లంతు
టోక్యో: జపాన్ దక్షిణ దీవుల్లో కుమమోటో నుంచి నిఘా విధుల్లో భాగంగా గురువారం బయలుదేరిన బ్లాక్‌హాక్ రకం హెలికాప్టర్ 10 నిమిషాల అనంతరం రాడార్ నుంచి అదృశ్యమైంది. అది మియాకో, ఇరాబు మధ్య సముద్రజలాల్లో కూలి ఉంటుందని భావిస్తున్నారు. ఆ హెలికాప్టర్‌కు చెందిన లైఫ్‌బోట్‌ను, ఒక తలుపు, తదితర భాగాలను శుక్రవారం సహాయక సిబ్బంది కనుగొన్నారు. హెలికాప్టర్‌లోని డివిజన్ కమాండర్ సహా 10 మంది సిబ్బంది కోసం గాలింపు కొనసాగుతోంది. వీరిలో ఎవరూ ప్రాణాలతో ఉండేందుకు అవకాశం లేదంటూ జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమదా శుక్రవారం మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. వారికోసం గాలింపు కొనసాగిస్తామన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని చెప్పారు. నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమైనట్లు చెప్పారు. చైనా నుంచి ఎదురవుతున్న భద్రతా పరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో రక్షణ సన్నద్ధత కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం గమనార్హం. -
ఇంటిపై కూలిన ఎయిర్ బెలూన్; 11 మంది సీరియస్
వెల్లింగ్టన్: ఆకాశంలో ఎగురుతున్న ఓ హాట్ ఎయిర్ బెలూన్ ఆకస్మాత్తుగా ఇంటిపై కుప్పకూలిపోవడంతో 11 మంది తీవ్రంగా గాయపడిన దుర్ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్‌లోని టూరిస్ట్ ప్రాంతంగా పేరు పొందిన క్వీన్స్టౌన్లోని మోర్వెన్ ఫెర్రీ రోడ్డులో ఉన్న ఒక ఇంటిపై హాట్ ఎయిర్ బెలూన్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్య్కూ టీమ్‌తో ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ దుర్ఘటనపై న్యూజిలాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
న్యూజిలాండ్ లో భారీ భూకంపం
వెల్లింగ్టన్: సెంట్రల్ న్యూజిలాండ్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8 గా నమోదైంది. భూకంప ప్రమాద ప్రభావం వెల్లింగ్టన్ లో ట్రాఫిక్ పై తీవ్ర ప్రభావం చూపింది. రాజధానిలోని కొన్ని భవనాల నుంచి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు అందుబాటులోకి రాలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. సౌత్ ఐలాండ్ లోని సెడన్ ప్రాంతంలో భూ ప్రకంపనల ధాటికి బండరాళ్లు జాతీయ రహదారిపై అడ్డంగా పడినట్టు అధికారులు తెలిపారు. ఐతే వెల్లింగ్టన్ ప్రాంతంలో ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు సమాచారాన్ని అందించారు.