
హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదం: 16 మంది మృతి
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 16 మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. దక్షిణ ఆస్టిన్‌లోని లఖార్ట్ సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పర్యాటకులంతా మృతి చెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
స్థానిక కాలమానం ప్రకారం.. 7.40 ప్రాంతంలో బెలూన్‌లో మంటలు చెలరేగడతో బెలూన్ నేలపై కుప్పుకూలినట్టు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్( ఎఫ్‌ఏఏ) పేర్కొంది. ఈ ఘటనకు గల కారణాలపై ఎఫ్‌ఏఏ అధికారులు విచారణ చేపట్టారు. చివరకు జాతీయ రవాణా భద్రత సంస్థ కూడా ఈ ఘటనపై విచారించేందుకు రంగంలోకి దిగింది.
బెలూన్ ప్రమాదంలో మృతిచెందినవారి పట్ల టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతిని తెలియజేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.