గాల్లో ఉండగానే హాట్‌​ ఎయిర్‌ బెలూన్‌లో ఎగిసిపడ్డ మంటలు..ప్రయాణికులు.. | Viral Video: Hot Air Balloon Catches Fire Mid Air In Mexico | Sakshi
Sakshi News home page

Viral Video: గాల్లో ఉండగానే హాట్‌​ ఎయిర్‌ బెలూన్‌లో ఎగిసిపడ్డ మంటలు..

Published Sun, Apr 2 2023 8:37 AM | Last Updated on Sun, Apr 2 2023 10:17 AM

Viral Video: Hot Air Balloon Catches Fire Mid Air In Mexico - Sakshi

హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లలో పయనిస్తూ ఆకాశపు వీధిని చూడటం అనేది ఒక త్రిల్‌. సాహస క్రీడలంటే ఇష్టపడే వారు ఈ బెలుస్‌లలో పయనించడానికి ఎంతో ఇష్టపడతారు. అచ్చం అలానే కొందరు పర్యాటకులు ఒక హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో పయనిస్తుండగా విషాదం చోటు చేసుకుంది. ఏమోందో ఏమో! ఒక్కసారి మంటలు చుట్టుముట్టాయి. దీంతో బెలూన్‌ గోండోలాలో ఉన్న ప్రయాణికులు భయంతో దూకేయగా..మరికొందరూ ఆ మంటల్లో చిక్కుకుపోయారు.

ఈ ఘటనలో ఒక చిన్నారి ముఖానికి తీవ్ర గాయాలు కాగా, దూకేయడంతో తొడ ఎముక ఫ్రాక్చర్‌ అయ్యింది. భాదితులను 39 ఏళ్ల మహిళ, 50 ఏళ్ల వృద్ధురాలిగా గుర్తించారు. ఇంకా ఇతర ప్రయాణకులెవరైనా ఆ బెలున్‌ గోండోలాలో ఉన్నారనే తెలియాల్సి ఉంది. మెక్సికో నగరానికి ఈశాన్యంగా ఉన్న టియోటిహుకాన్‌ అనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రం వద్ద ఈ హాట్‌ హెయిర్‌ బెలూన్లను టూరిస్టుల కోసం ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి: అమెరికాలో టోర్నడో బీభత్సం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement