
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా అద్భుత విజయం సాధించింది. ఈ విజయం తర్వాత వారి డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు ఘనంగా జరిగాయి. జట్టు మేనేజర్ సమా ఆటగాళ్లంతా ఒకరినొకరు అభినందించుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మెస్సీనే నిలిచాడు. షర్ట్ విప్పి రచ్చ చేసిన మెస్సీ తన సంతోషాన్ని పంచుకున్నాడు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వీడియో వైరల్‌గా మారింది. ఈ సంతోషం వెనుక ఒక కారణం ఉంది.
సౌదీ అరేబియా చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన అర్జెంటీనా ప్రి క్వార్టర్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే మెక్సికోతో మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. అందుకే కీలక మ్యాచ్‌లో మెస్సీ బృందం తమ జూలు విదిల్చింది. జట్టు కెప్టెన్‌గా మెస్సీ అన్నీ తానై జట్టును ముందుండి నడిపించాడు. అయితే ఆటలో 67వ నిమిషం వరకు కూడా ఒక్క గోల్ నమోదు కాలేదు.
ఈ నేపథ్యంలోనే మెస్సీ తనకు మత్రమే సాధ్యమైన గోల్‌తో మెరిసి అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత ఆట 87వ నిమిషంలో ఎంజో ఫెర్నాండేజ్ రెండో గోల్ కొట్టడంతో అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నిర్ణీత సమయంలో సౌదీ అరేబియా గోల్ కొట్టడంలో విఫలం కావడంతో అర్జెంటీనా విజేతగా నిలిచింది.
చదవండి: ఒక్క మ్యాచ్‌కే పక్కనబెట్టారు.. సౌత్ ప్లేయర్ అనేగా వివక్ష
Comments
Please login to add a commentAdd a comment