ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా తన ప్రి క్వార్టర్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా జూలు విదిల్చింది. గ్రూప్-సిలో భాగంగా శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో అర్జెంటీనా ఘన విజయం సాధించింది.
తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. అయితే రెండో అర్థభాగంలో మాత్రం అర్జెంటీనా మెక్సికోపై అటాకింగ్ గేమ్ ఆడి ఫలితాలను సాధించింది. ముందు ఆట 64వ నిమిషంలో లియోనల్ మెస్సీ జట్టుకు తొలి గోల్ అందించగా.. ఆ తర్వాత ఆట 87వ నిమిషంలో ఎంజో ఫెర్నాండేజ్ రెండో గోల్ కొట్టాడు.
ఇక మెస్సీకి ఈ ప్రపంచకప్‌లో ఇది రెండో గోల్ కావడం విశేషం. సౌదీ అరేబియాతో మ్యాచ్‌లోనూ మెస్సీ ఫెనాల్టీని గోల్‌గా మలిచిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి మెక్సికోపై విజయంతో అర్జెంటీనా ప్రిక్వార్టర్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
Cometh the ⌛ Cometh the 🐐 💯
— JioCinema (@JioCinema) November 27, 2022
▶ Relive Messi's heroics against #ElTri that kept @Argentina in the #FIFAWorldCup 🙌
Keep watching the #WorldsGreatestShow, only on #JioCinema & @Sports18 📲📺#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/KQHjSrSDTY
Comments
Please login to add a commentAdd a comment