Mexico Mayor Gets Married To Alligator To Bring Good Fortune - Sakshi
Sakshi News home page

Viral Video: మొసలిని పెళ్లి చేసుక్ను మేయర్‌! ఎందుకో తెలుసా!

Jul 2 2023 2:30 PM | Updated on Jul 2 2023 3:27 PM

Mexico Mayor Gets Married To Alligator To Bring Good Fortune - Sakshi

మొసలిని పెళ్లి చేసుకున్నాడు ఓ మేయర్. తన ఊరికి మంచి జరగాలనే ఉద్దేశ్యంతో ఆ మొసలిని పరిణయమాడేందుకు సిద్ధయ్యాడు. ఆ పెళ్లి కూడా ఏదో తూతూ మంత్రంగా చేయారు. పెద్ద ఊరేగింపుగా ఊరు ఊరంతా ఉత్సాహంగా పాల్గొని మరీ చేస్తారు. ఈ వింత ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఎందుకిలా చేస్తున్నారు. దీని వెనకున్న రీజన్‌ ఏమిటంటే..

మెక్సికోలోని శాన్‌ పెడ్రో హువామెలులా మేయర్‌ విక్టర్‌ హ్యూగో సోసా తన ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో అలిసియా అడ్రియానా అనే మొసలిని పెళ్లి చేసుకున్నాడు. మధ్య అమెరికాలోని మెక్సికోలో అనాదిగా వస్తున్న ఆచారం ఇది. రెండు స్వదేశీ సముహాలు శాంతికి వచ్చిన రోజుకి గుర్తుగా మనిషి మొసలిని పరిణయమాడటం అనేది అక్కడి ఆచారం. ఇలా చేస్తే తమకు మంచి జరుగుతుందని అక్కడి వారి విశ్వాసం. ఇది 230 సంత్సరాల నాటి నుంచి వస్తున్న ఆచారం.

దీన్ని అక్కడి ప్రజలు ఇప్పటికి కొనసాగిస్తూ వస్తుండటం విశేషం. అందులో భాగంగానే మేయర్‌ హ్యూగో సోసా ఈ మొసలిని పెళ్లిచేసుకున్నాడు.. భూమాత సస్యమాలంగా ఉండేలా సకాలంలో మంచిగా వర్షాలు పడతాయనేది చరిత్రకారుల నమ్మకమని, అందుకే తాము ఇలా చేస్తుంటామని మేయర్‌ హ్యూగో సోసా చెబుతున్నాడు. వివాహ వేడుకకు ముందుగా ఈ మొసలిని ఇంటి ఇంటికి ఊరేగింపుగా తిప్పుతారు. ఆ తర్వాత ఆ మొసలిని కూడా అందమైన పెళ్లి కూతురు మాదిరిగా రెడీ చేస్తారు.

అలాగే ఆ మొసలి ఆ తంతులో ఎవరిపైన దాడి చేయకుండా ఉండేలా దాని నోటికి తాళం వేస్తారు. ఆ తంతులో మేయర్‌ ఇరువురం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఆమె బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసి మరీ మొసలిని పరిణయమాడతాడు. ఆ తర్వాత మేయర్‌ ఆ మొసలితో కలిసి నృత్యం చేయడమే గాక చివరిగా దాని ముద్దాడటంతో పెళ్లి తంతు ముగుస్తుంది. స్థానిక జాలర్లు తమ మేయర్‌ ఇలా చేయడం కారణంగా తమ వలకు అధిక సంఖ్యలో చేపలు పడతాయని, తమ జీవితాలు మంచిగా మారతాయని ఆనందంగా చెబుతున్నారు. 

(చదవండి: 600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement