సాక్షి, విశాఖపట్నం: అరకులోయలో నిర్వహిస్తున్న బెలూన్ ఫెస్టివల్ బుధవారం నిలిచిపోయింది. వర్షం, అల్పపీడనం కారణంగా నిర్వాహకులు రెండోరోజు బెలూన్లను పైకి పంపలేదు. 13 దేశాల నుంచి 16 బెలూన్లు ఈ ఫెస్టివల్ కోసం వచ్చాయి. అయితే సాయంత్రం వాతావరణం అనుకూలిస్తే బెలూన్ ఫెస్టివల్ నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఈ ఉత్సవం రేపటితో ముగియనుంది. కాగా బెలూన్ రెయిడ్స్ కోసం తొలుత మూడు, నాలుగు ప్రాంతాలను పరిశీలించారు. చివరకు అరకు సమీపంలోని సుంకరమెట్టను ఎంపిక చేశారు.
అక్కడ నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపగూడ వరకు బెలూన్ రెయిడ్ చేసేందుకు నిర్ణయించారు. సముద్రమట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తు వరకు బెలూనిస్టులు విహరిస్తారు. కానీ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వల్ల గాలుల ఉధృతి అధికంగా ఉండడంతో అంత ఎత్తులో ఎగిరేందుకు ఎంతవరకు వాతావరణం సహకరించలేదు. దీంతో ఎంతో ఆశగా బెలూన్ ఫెస్టివల్ తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు నిరాశగా వెనుతిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment