Ram Shankar
-
ఈ సినిమాతో హిట్ గ్యారంటీ
– పూరి జగన్నాథ్ ‘‘నేనో రకం’ సినిమా చూశా. కథ, కథనాలు చాలా బాగున్నాయి. ఈ చిత్రంతో రామ్ శంకర్‌కు హిట్ గ్యారంటీ అనే నమ్మకం వచ్చింది. మహిత్ మంచి పాటలిచ్చారు. పాటలన్నీ సందర్భానుసారంగా వస్తాయి’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. రామ్ శంకర్, రేష్మిమీనన్ జంటగా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రం నిర్మించారు. మహిత్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రంలోని పాటలను పూరి జగన్నా«థ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, హీరో గోపీచంద్ విడుదల చేసి, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి కథే ప్రధాన బలం. కథ నచ్చడంతోనే శరత్ కుమార్ ఈ సినిమా చేశారు. మహిత్ పాటలు, రీ–రికార్డింగ్ హైలెట్. ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫీల్‌ను ‘నేనో రకం’ కలిగిస్తుంది’’ అన్నారు. ‘‘రామ్ శంకర్ కెరీర్లో ‘నేనో రకం’ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. మార్చి 17న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. రామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. సమకాలీన అంశాల స్ఫూర్తితో పక్కా కమర్షియల్ అంశాలతో దర్శకుడు తీర్చిదిద్దాడు’’ అన్నారు. -
అరకు రోడ్లో థ్రిల్... ఫుల్
రామ్ శంకర్, నికిషా పటేల్ జంటగా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘అరకు రోడ్లో’. వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డీటీఎస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. అరకు రోడ్లో ఏం జరిగిందన్నది ఆసక్తికరం. ఈ చిత్రంలోని సన్నివేశాలు ఉత్కంఠకు గురి చేస్తాయి. ప్రేక్షకులకు అవసరమైన అంశాలతో పాటు వాణిజ్య విలువలు న్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా హీరో ప్రభాస్ రిలీజ్ చేసిన పాటకు సూపర్ క్రేజ్ వచ్చింది. మా చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, పృధ్వీ, కృష్ణభగవాన్, రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రాహుల్ రాజ్, వాసుదేవ్, కెమెరా: జగదీశ్ చీకటి.