గుంటూరులో..? | namita act to guntur takies -2 | Sakshi
Sakshi News home page

గుంటూరులో..?

Published Wed, Dec 28 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM

గుంటూరులో..?

గుంటూరులో..?

‘సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే..’ అంటూ ‘సింహా’ చిత్రంలో తన గ్లామర్‌తో కుర్రకారు మతులు పోగొట్టారు బొద్దుగుమ్మ నమిత. ఆ చిత్రం విడుదలై ఆరేళ్లు దాటినా ఆమె మరో తెలుగు చిత్రంలో నటించలేదు. ఆ మాటకొస్తే తమిళంలో కూడా చేయడంలేదు. సహజంగానే బొద్దుగా ఉండే నమిత మరింత బరువు పెరగడంతో అవకాశాలు తగ్గాయనొచ్చు. ఆ విషయం గహ్రించారేమో స్లిమ్‌ అయ్యారు. తమిళంలో ఆల్రెడీ ఓ సినిమా అంగీకరించారు. తాజాగా ‘గుంటూర్‌ టాకీస్‌ 2’తో తెలుగు చిత్ర పరిశ్రమలో రీ–ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త వినిపిస్తోంది.

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్‌ ఎం. నిర్మించిన ‘గుంటూర్‌ టాకీస్‌’ ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. ఆ చిత్ర నిర్మాత రాజ్‌కుమార్‌ దర్శకునిగా మారి, ‘గుంటూర్‌ టాకీస్‌ 2’ తెరకెక్కించ నున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ తీయాలను కుంటున్నారట. ఇందులో  డాన్‌ పాత్రకు బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ సన్నీ లీయోన్‌ను తీసుకున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఓ ముఖ్య పాత్రలో నమిత కనిపించనున్నారని టాక్‌. దర్శక–నిర్మాత ఆమెను సంప్రదించారట. ఇక, నమిత గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే ఆలస్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement