Namita
-
గ్లామర్‌కు గుడ్‌బై
ఇంతకుముందు తన అందచందాలతో అలరించి యువతకు డ్రీమ్‌గర్ల్ ముద్ర వేసుకున్న నటి నమిత. ఆమె అభిమానులను మచ్చాస్ ఫ్లయింగ్ కిస్‌లతో ఖుషీ పరిచేవారు. 2004లో ఎంగల్ అన్నా చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయమైన నటి నమిత. విజయ్‌కాంత్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. దీంతో నమితకు వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి అలా ఏయ్, బంపర కన్నాలే, ఆణ, కోవై బ్రదర్స్, బిల్లా వంటి పలు చిత్రాల్లో నటించారు. అజిత్ కథానాయకుడిగా నటించిన బిల్లా చిత్రంలో నమిత స్విమ్మింగ్ దుస్తుల అందాలారబోత యువతను గిలిగింతలు పెట్టించిందనే చెప్పాలి. పలు తెలుగు చిత్రాల్లో నటించిన నమిత 2017లో వీరేందర్ చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. వీరికి కవల పిల్లలు పుట్టారు. కాగా ఈమె నటనకు దూరమైన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. నటిగా ఈమె రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారన్నది గమనార్హం. అలాంటిది ఇటీవల ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్న నమిత మాట్లాడుతూ తన కవలపిల్లలకు రెండేళ్ల వయసు దాటిందన్నారు. దీంతో మళ్లీ నటించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలా ఇప్పటికే ఒక చిత్రంలో ప్రతినాయకి పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇకపై గ్లామరస్ పాత్రలు పోషించనని నమిత చెప్పారు. నమిత మళ్లీ నటిగా రీఎంట్రీ ఇవ్వడం ఆమె అభిమానులకు శుభవార్త అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. -
ఎన్నికల ప్రచారంలో అందాల తార నమిత (ఫోటోలు)
బొమ్మనహళ్లి: కన్నడ ఎన్నికల ప్రచారంలో అందాల తారల సందడి ఆలస్యంగానైనా ఆరంభమైంది. బహుభాష నటి నమిత ఆదివారం నగరంలోని చిక్కపేటలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసింది. నమితను చూడడానికి జనం పెద్దసంఖ్యలో వచ్చారు. వాహనంపై నిలబడి చేయి ఊపుతూ స్థానిక బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. -
నా ఫోన్ ఆమె ఎత్తుకెళ్లింది.. ఆ పోస్ట్ ఎవరూ నమ్మొద్దు: నమిత
బాలీవుడ్ నటినమితా థాపర్ తన ఫోన్ చోరీకి గురైనట్లు వెల్లడించింది. నా ఫోన్ చోరీ చేయడమే కాకుండా ద్వేషపూరిత కథనాన్ని పోస్ట్ చేశారని తెలిపింది. తన ఇంట్లో పనిమనిషి మొబైల్ దొంగిలించి ఇలా చేసిందని వాపోయింది. సోషల్ మీడియాలో నాపై కావాలనే ఇలా చేసిందని పేర్కొంది నటి. నమితా తాపర్ షార్క్ ట్యాంక్ అనే రియాల్టీ షోతో ఫేమస్ అయ్యారు. నమితా థాపర్ ఫోన్ దొంగిలించిన పని మనిషి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ద్వేషపూరిత పోస్ట్ చేసింది. దీంతో అప్రమత్తమైన నమితా ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. తన ఫోన్ ఇప్పుడు రికవరీ చేయబడిందని.. ఆందోళనతో ఫోన్ చేసిన స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేసింది. అయితే ఆమె వివరణతో కొంతమంది సోషల్ మీడియా ఫాలోవర్లు ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. ఇది నిజంగా ఆమె కొడుకు ద్వారా పోస్ట్ చేశారా..లేక నమితా థాపర్ కావాలనే పనిమనిషిని నిందిస్తున్నారా అని ఆశ్చర్యపోయారు. షార్క్ ట్యాంక్ ఇండియా అనేది ఒక రియాలిటీ షోలో నమితా థాపర్‌తో పాటు.. ప్యానెల్లో అనుపమ్ మిట్టల్, వినీతా సింగ్, అమన్ గుప్తా, పీయూష్ బన్సాల్, మరో కొత్త నటుడు అమిత్ జైన్ కూడా ఉన్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2 సోనీ టీవీ, సోనీలైవ్‌లో ప్రసారమవుతుంది. This is what hate does to this world, makes people toxic. An educated house help who was removed stole my phone & put a hateful post on me on social media. Price of being a public figure ! Apologies ! — Namita (@namitathapar) January 14, 2023 -
కవల పిల్లలకు జన్మనిచ్చిన హీరోయిన్ నమిత..
హీరోయిన్ నమిత గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంది. ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నమిత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. 'నాకు ట్విన్ బాయ్స్ పుట్టారు. కృష్ణాష్టమి రోజున(శుక్రవారం)ఈ గుడ్‌న్యూస్‌ను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. హాస్పిటల్ సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నన్ను గైడ్ చేసినందుకు, నా పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను' అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా సొంతం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నమిత వెంకటేశ్‌తో నటించిన జెమిని సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. 2017లో ప్రియుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. ఇక నమితకు ట్విన్స్ పుట్టారని తెలిసి పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) -
ఘనంగా నమిత సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్
‘సొంతం’, ‘జెమిని’, 'బిల్లా' ‘సింహా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నమిత. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె త్వరలో తల్లి కాబోతోంది. తన బర్త్‌డే రోజు (మే 10) ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. భర్తతో కలిసి బేబీ బంప్‌తో దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తాజాగా నమితకు సీమంతం జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో కుటుంబ సభ్యులు ఆమెకు సీమంతం వేడుక నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో నమిత వివాహం జరగ్గా 41 ఏళ్ల వయసులో ఆమె తల్లి కాబోతుండటం గమనార్హం. చదవండి: హోటల్లో పని చేశాను, అది తెలిసి చిరంజీవి బాధపడ్డాడు, అంతేకాదు కమల్ హాసన్ 'విక్రమ్' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? -
HBD Namitha: బొద్దుగుమ్మ కోసం గుడి, ఎక్కడుందంటే?
'సింహం అంటి చిన్నోడే వేటకొచ్చాడే..' అంటూ బాలకృష్ణతో సమానంగా స్టెప్పులేసింది నమిత. ఒక్క బాలయ్యతోనేనా విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజ రవితేజతో సహా పలు హీరోలతోనూ నటించి మెప్పించింది. కానీ తెలుగులో కన్నా కూడా తమిళంలోనే ఆమెకు ఎక్కువ గుర్తింపు లభించింది. అక్కడ నమితను ఎంతలా ఆరాధిస్తారు అంటే ఏకంగా గుడి కట్టి పూజించేస్తున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.. నేడు(మే 10) నమిత పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. నమిత 1980 మే 10న గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో జన్మించింది. 1998లో మిస్ సూరత్ కిరీటాన్ని దక్కించుకున్న ఆమె 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాల్గవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 'సొంతం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. విక్టరీ వెంకటేష్ సరసన 'జెమినీ' మూవీలో నటించి మరింత పాపులర్ అయ్యింది. 'ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి', 'నాయకుడు' వంటి పలు చిత్రాల్లో నటించింది నమిత. కానీ ఆ తర్వాత ఆఫర్లు రాకపోవడంతో సినిమాల్లో కనిపించనేలేదు. అయితే సడన్‌గా బొద్దుగా మారిపోవడం వల్లే సినిమాల్లో కనిపించకుండా పోయిందన్న వార్తలు వినిపించాయి. కొంతకాలం బ్రేక్ తర్వాత నమిత ప్రభాస్ 'బిల్లా' సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇక్కడ సక్సెస్‌కు దూరమైన నమిత తమిళనాట మాత్రం నెంబర్ వన్ హీరోయిన్గా సత్తా చాటింది. దీంతో నమిత కోసం ఆమె అభిమానులు ఏకంగా గుడి కూడా కట్టేశారు. ఇది తమిళనాడులోని తిరునల్వేలిలో ఉంది. ఓసారి తమిళనాడులో నమితను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడో అభిమాని. ఆమెను ఫంక్షన్‌కు తీసుకువెళ్లాల్సిన కారు డ్రైవర్‌ను తానే అని చెప్పడంతో గుడ్డిగా నమ్మేసిన నమిత అతడి కారెక్కింది. కానీ నిజమైన కారు డ్రైవర్ ఈ విషయాన్ని ఫంక్షన్ నిర్వాహకులకు చెప్పడంతో అతడి కారును చేజ్ చేసి పట్టుకున్నారు. తీరా పోలీసులు నిలదీస్తే తాను నమిత అభిమానినంటూ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. 2017లో వీరేంద్ర చౌదరిని లవ్ మ్యారేజ్ చేసుకుని వైవాహిక జీవితానికి ఆరంభం పలికింది నమిత. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవలే కొత్తగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భౌవౌ అనే సినిమా చేస్తోంది. మరోవైపు 2019 నుంచి ఆమె బీజేపీలో కొనసాగుతోంది. చదవండి: ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తున్న నటి నమిత -
ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తున్న నటి నమిత
నటి నమిత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను చిదిమేస్తోంది. థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్‌లు రద్దయ్యాయి. ఇదిలా జరగడం రెండోసారి. సినిమాల విడుదల చాలా వరకు వాయిదా పడుతున్నాయి. అయితే కొందరు నిర్మాతలు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ వైపు దృష్టిసారిస్తున్నారు. అలా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు లాభసాటిగా మారాయి. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు గిరాకీ పెరగడంతో కొత్తగా మరిన్ని పుట్టుకొస్తున్నాయి. తాజాగా నటి నమిత కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఆమె రవివర్మ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో కలిసి ప్రారంభిస్తున్న ఈ ప్లాట్‌ఫామ్ నమిత టాకీస్ అని పేరు నిర్ణయించారు. దీని గురించి నమిత బుధవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన చిన్న నిర్మాతలు, కొత్త దర్శకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఓటీటీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఓటీటీ ద్వారా కొత్త కాన్సెప్ట్‌తో కూడిన చిత్రాలు, సిరీస్‌లను ప్రేక్షకులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ప్యాలెస్‌లో రాఖీ భాయ్ -
అశ్లీల వీడియోల పేరుతో నమితకు బెదిరింపు
సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై నటి నమిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్లీల వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డ అతనికి నమిత గట్టి కౌంటర్ ఇచ్చారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పారు. అంతేకాకుండా తనను బ్లాక్మెయిల్ చేసేందుకే యత్నించిన వ్యక్తి ఫొటోను బహిర్గతం చేశారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ‘సెంటమిజ్ అనే నెటిజన్ సోషల్ మీడియాలో నాకు డైరెక్ట్ మెసేజ్‌లు చేస్తూ.. అసభ్యకరంగా పిలవడం ప్రారంభించాడు. హాయ్ ఐటమ్ అంటూ నీచంగా ప్రవర్తించాడు. దీనిపై నేను ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పాడు. అతని మాటలు నమ్మని నేను గట్టిగా నిలదీశాను. దీంతో అతని వద్ద నా అశ్లీల వీడియోలు ఉన్నాయని, వాటిని ఆన్లైన్లో పెడతానని బెదిరింపులకు దిగాడు. నాకు అందులో నిజమెంతో తెలుసు కాబట్టి.. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పాను. ఇది ఒక నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ప్రవర్తన. అతను స్త్రీలను ఇష్టమొచ్చిన పేర్లతో పిలువవచ్చని భావించేవాడు. కానీ వాటిని నేనుందుకు భరించాలి. నేను కేవలం మీడియాలో, గ్లామర్ ప్రపంచంలో ఉన్నందున్న నా గురించి మొత్తం తెలుసని మీరు అనుకుంటున్నారా?. ఓ వ్యక్తిగా నా గురించి మీకేం తెలుసు?. నా నిశ్శబ్దాన్ని బలహీనత అనుకోకండి. ఒక నిజమైన మనిషికి స్త్రీని ఎలా గౌరవించాలో తెలుసు. ఎవరైనా తన సొంత తల్లిని అవమానపరిస్తే కలిగే బాధ అతనికి తెలుసు. నవరాత్రుల సందర్భంగా 9 రోజులు దుర్గా మాతను పూజించే బదులు సమాజంలో మహిళలను ఎలా గౌరవించాలో నేర్చుకోండి. ఎందుకంటే జీవితంలో ఇది అతి ముఖ్యమైనది’ అని నమిత పేర్కొన్నారు. కాగా, తెలుగు, తమిళంలో హీరోయిన్గా నమిత ఓ వెలుగువెలిగారు. కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరించిన తమిళ బిగ్‌బాస్ తొలి సీజన్-1లో కూడా ఆమె పాల్గొన్నారు. 2017లో ఆమె తన బాయ్‌ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఆమె బీజేపీలో చేరారు. ముఖ్యంగా తమిళనాట నమితకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Hi all, this one cheap minded, free loser has been calling me names in DM. As you can read he is @i_am_thamizh_senthamizh . He started with name calling like 'Hi Item' . Hence , when I confronted him , he said his account got hacked !!! And when I pursued him, he said he has seen my so called 'PORN' and he's going to publish it online now !!! Knowing the facts, I said pls 'Go ahead '.. See this face people ! This is the face of a Loser, a Cheap minded , Filthy person, who thinks he has Right to call any Woman, with any cheap and dirty names,just because he thinks He Can !!!! Why should I listen to this ?! Just because I'm in Media ?! Just because I'm in a Glamour Industry?! You think you know me ?! You think you know who I'm as a person ??! DO NOT MISTAKE MY SILENCE FOR MY WEAKNESS !! A Real Man knows how to Respect a Woman, Any Woman from Any path of Life, for he knows how it feels if someone will Disrespect his own Mother! Instead of Celebrating Navratri where you pray to Godess Durga for 9 days and instead of Celebrating Women's Day, learn to respect women in your General Life. Because that's what matters at the End of the Day!! A post shared by Namitha Vankawala Chowdhary (@namita.official) on Mar 16, 2020 at 9:06pm PDT -
అందుకే అప్పుడు బరువు పెరిగాను : నమిత
నమిత అభిమానులకు శుభవార్త!ఆమె బోలెడంత లాస్ అయ్యారు! కంగారు పడకండి. నమిత లాస్ అయింది డబ్బు కాదు. వెయిట్ లాస్!! బరువు తగ్గి, మెరుపుతీగ అయ్యారు నమిత. తారలు వెయిట్ తగ్గితే.. ఇండస్ట్రీలో వెయిట్ పెరుగుతుంది. ‘సొంతం’తో ఎంట్రీ ఇచ్చి.. ‘సింహా’ తర్వాత కొంచెం ఒళ్లు చేసిన నమిత సన్నబడి, మళ్లీ ఇప్పుడు సౌత్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు.. ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్..! రెండేళ్ల క్రితం పెళ్లప్పుడు బొద్దుగా ఉన్నారు. ఈ మధ్య బరువు తగ్గారు. సినిమాల కోసమా? నమిత: బరువు తగ్గడానికి ముఖ్య కారణం కొన్ని పెద్ద సినిమాలు అంగీకరించడమే. వచ్చే ఏడాది మేలో ఈ సినిమాలు ఆరంభమవుతాయనుకుంటున్నాను. అందుకే టైమ్ తీసుకొని బరువు తగ్గుతున్నాను. ప్రతి రోజూ ఉదయాన్నే ఐదున్నరకే నిద్ర లేస్తున్నాను. రోజు మార్చి రోజు యోగా, జిమ్ చేస్తున్నాను. వారానికి ఆరు రోజులు చేస్తున్నాను. ఒక్క రోజు సెలవు తీసుకుంటున్నాను. బరువు తగ్గడానికి మరో కారణం ఆరోగ్య సమస్యలు. నిజం చెప్పాలంటే నేనెప్పుడూ ఓవర్ వెయిట్‌ని ఎంజాయ్ చేయలేదు. ఉన్నట్లుండి ఎందుకు బరువు పెరిగారు? ఆడవాళ్లకు హార్మోన్స్ సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యల వల్లే నేను విపరీతంగా బరువు పెరిగాను. మన సమస్యలను మనం తెలుసుకోగలగాలి. నేను, నా భర్త (వీర్) నా శరీరంలోని సమస్యకు మూలం ఏంటి? అనే దగ్గర నుంచి వర్కౌట్ చేయడం మొదలుపెట్టాం. సాధారణంగా ఏదైనా సమస్య వస్తే తాత్కాలిక పరిష్కారం కోసం చూస్తాం. కానీ మేం శాశ్వత పరిష్కారం కావాలనుకున్నాం. ఈ ఏడాది జనవరి నుంచి జిమ్, యోగా మొదలుపెట్టాను. కొత్త డైట్‌ని ఫాలో అవుతున్నాను. 2011 నుంచి 2016 వరకూ డిప్రెషన్లో ఉన్నాను. 2017లో నార్మల్ అయ్యాను. డిప్రెషన్లో ఉన్నప్పుడు మద్యానికి బానిస కావొచ్చు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మానసికంగా వేరే స్థితికి వెళ్లొచ్చు. లక్కీగా నేను ఆధ్యాత్మికం వైపు వెళ్లాను. ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అలాంటి సమయంలో వీర్ నా జీవితంలోకి వచ్చాడు. తను నా బ్యాక్‌బోన్‌లా మారిపోయాడు. నాలో చాలా స్ఫూర్తి నింపాడు. వీర్ లైఫ్ స్టయిల్ చాలా నేచురల్‌గా ఉంటుంది. అన్నీ ఆర్గానిక్, హెర్బల్స్ని తీసుకుంటాడు. ఇంగ్లీష్ మెడిసిన్‌ని ఇష్టపడడు. కెమికల్స్ ఎక్కువ ఉండవు. నన్ను కరెక్ట్ దారిలో పెట్టాడు. డాక్టర్స్‌ను సంప్రదించాం. సహజమైన పద్ధతిలో బరువు తగ్గే ప్రయత్నం మొదలుపెట్టా. ఈ బరువు తగ్గే విషయంలో మిగతా స్త్రీలకు ఉపయోగపడే టిప్స్ ఏమైనా? ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. నాకు పీసీఓడి, థైరాయిడ్ సమస్యలున్నాయి. వంశపారంపర్యం కూడా ఉంది. వీటన్నింటికి తోడు డిప్రెషన్‌తో బాధపడ్డాను. ఆ సమయంలో ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం అనే దాని మీద శ్రద్ధే ఉండదు. అలా బరువు పెరిగాను. వీర్ సపోర్ట్‌తో నా ఆరోగ్య సమస్య గురించి తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరూ తమ సమస్యని తెలుపుకోవాలి. బయటకు చెప్పడానికి మొహమాటపడకూడదు. డాక్టర్ దగ్గరికెళ్లడానికి సిగ్గుపడకూడదు. అప్పుడే మన సమస్యను మనం అధిగమించగలుగుతాం. ఎంత బరువు తగ్గారు? మీ డైలీ డైట్ ఏంటి? పది కిలోలు తగ్గాను. ఇంకో 7 కిలోలు తగ్గాలనుకుంటున్నాను. మేం రాగి, జొన్నలు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటున్నాం. వీటి ప్రభావం లాంగ్ రన్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. నేను ఉదయం నిద్ర లేవగానే ములక్కాడ ఆకుల రసం తీసుకుంటాను. ములక్కాడ ఆకుల రసానికి తేనె, నిమ్మరసం కలుపుతాను. 20 నిమిషాల తర్వాత జీలకర్ర వాటర్ తాగుతాను. రాత్రి మొత్తం జీరాను నానబెట్టి ఉదయాన్నే వేడి చేసి, తాగుతాను. మిగిలిన జీరాను నమిలేయాలి. కొంత సేపటి తర్వాత ఒక యాపిల్ తింటాను. జిమ్ లేదా యోగా నుంచి తిరిగొచ్చాక బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. ముస్లీ, డ్రై ఫ్రూట్స్, మిల్క్ లేదా పెరుగు తింటాను. లంచ్‌లో రాగి ఇడ్లీ, రాగి దోశె లేదా రాగి పనియారమ్ తింటాను. బ్రౌన్ రైస్ తీసుకుంటాను. రెండు గంటల తర్వాత ఒక గ్లాస్ కొబ్బరినీళ్లు తాగుతాను. రోజు మొత్తంలో సుమారు 6 నుంచి 7 లీటర్ల నీళ్లు తాగుతాను. రాత్రి డిన్నర్లో వెజిటేబుల్ సూప్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ బాగా ఆకలనిపిస్తే మా కుక్‌ను రాగి పనియారం చేయమంటాను. పూండు చట్నీ (వెల్లుల్లిపాయ చట్నీ), కొబ్బరి చట్నీతో తింటాను. పల్లీల చట్నీ అంటే నాకు బాగా ఇష్టం కానీ డైట్లో వద్దన్నారు. అందుకే పదిరోజులకోసారి పల్లీ చట్నీ తింటాను. ఈ డైట్‌ని ఎవరు చెప్పారు? నా డైట్ మొత్తం నా డైటీషియన్, వీర్ కలíసి ప్లాన్ చేశారు. ప్రస్తుతం మనందరం చాలా కాలుష్యంలో ఉంటున్నాం. దానివల్ల మనకు కావాల్సిన విటమిన్లు సరిగ్గా అందే అవకాశాలు తక్కువ. అందుకే ఒక్కోసారి విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటుంటాను. ఇవన్నీ డాక్టర్ల సూచన మేరకే వాడతాను. ఇదే డైట్‌ను ఎప్పటికీ కొనసాగిస్తారా? కొనసాగించాలనుకుంటున్నాను. అయితే ఒక సంవత్సరానికి మించి ఇదే డైట్‌ని ఫాలో అవ్వలేననిపిస్తోంది. స్వీట్స్ మానేశాను. మధ్యలో కీటో డైట్ కూడా పాటించాను. అది నాకు సరిగ్గా వర్కౌట్ కాలేదు. మా కజిన్ ఒకామెకు బాగా వర్కౌట్ అయింది. నో చాక్లెట్, నో స్వీట్స్ అంటే కష్టమేమో? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నాకు తీపి తినాలనే ధ్యాస పెద్దగా ఉండట్లేదు. లేకపోతే ప్రతి రోజూ డిన్నర్ తర్వాత ఏదో ఒక స్వీట్ తినాల్సిందే. ఇప్పుడు అలా లేదు. మిస్ అయినట్టే లేదు. నేనేనా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. డైట్ మొదలుపెట్టిన మూడునెలల తర్వాత మా ఊరికి వెళ్లాను. మా అమ్మగారు హల్వా తయారు చేశారు. మూడు నెలలకు తిన్న స్వీట్ అది. బరువు తగ్గాక శారీరకంగా చాలా మార్పు వచ్చింది. మరి మానసికంగా? ధ్యానం నన్ను ప్రశాంతంగా మార్చేసింది. నా ఆలోచనల్లో మెచ్యూర్టీ వచ్చింది. మనుషులను, వాళ్ల మనస్తత్వాలను ఇంతకు ముందుకన్నా బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎవరి ముందు ఏం మాట్లాడాలి? ఎవరి ముందు ఏం మాట్లాడకూడదు అని తెలుసుకుంటున్నాను. అవన్నీ మెల్లిమెల్లిగా అర్థం అవుతున్నాయి. ఈ మధ్యనే మా చుట్టాల ఇంటికి వెళ్లాను. అందరూ ‘భలే మెరిసిపోతున్నావు’ అన్నారు. నీలో సంతోషం మాత్రమే కనిపిస్తోంది అన్నారు. నా టెంపర్ పోయింది. రిలాక్డ్స్‌గా ఉంటున్నాను. కాన్ఫిడెంట్‌గా మారాను. ఈ మార్పు మొత్తం వీర్ నా జీవితంలోకి వచ్చిన తర్వాతే. తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు? నా కెరీర్‌ను తెలుగు సినిమాతోనే ప్రారంభించాను. తెలుగు పరిశ్రమకు రుణపడి ఉంటాను. మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నా. ఈ మధ్య స్టార్స్ అందరూ వెబ్ సిరీస్‌లో కూడా కనిపిస్తున్నారు. మీక్కూడా ఇంట్రెస్ట్ ఉందా? కథ బావుంటే ఏదైనా ఓకే. మీకు తెలుసో లేదో నేను కవితలు రాస్తుంటాను. నేను, వీర్ కలసి కొన్ని స్క్రిప్ట్స్ రాశాం. ఆ కథలను సినిమాగా అయినా, వెబ్ సిరీస్‌గా అయినా తీయొచ్చు. ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టాలనుకుంటున్నాం. పర్సనల్ లైఫ్‌లోకి వస్తే పిల్లలెప్పుడు? పెళ్లి సమయంలోనే ఇప్పుడే పిల్లలు వద్దు అనుకున్నాం. మా తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. మా అత్తామామలైతే ‘డైమండ్’ అనొచ్చు. చాలా స్వీట్‌గా ఉంటారు. అర్థం చేసుకుంటారు. పిల్లలెప్పుడు అని కంగారు పెట్టరు. తెలుగింటి కోడులుగా ఉండటం ఎలా ఉంది? వీర్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు తెలుగు సంప్రదాయ ప్రకారం పెళ్లి జరగాలా? మా గుజరాతీ స్టయిల్ వెడ్డింగ్ కావాలా అనేది నన్నే నిర్ణయించుకోమన్నాడు. చిన్నప్పటినుంచి గుజరాతీ పెళ్లిళ్లు చాలా చూశా. అవి బావుంటాయి. తెలుగు సంప్రదాయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని తెలుగు స్టయిల్లో చేసుకున్నాం. వీర్ వాళ్ల అమ్మానాన్నలకు కూడా మా అబ్బాయికి పెళ్ళి అయింది అనే ఫీలింగ్ ఉండాలి కదా. నేను ఎప్పుడూ వినని, తెలియని సంప్రదాయాలను చూశాను. మీ ఫ్యాన్స్‌కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తెలుగు ఫ్యాన్స్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బ్యాంగ్‌తో తిరిగొస్తాను. నాలుగైదు డిఫరెంట్ గెటప్స్‌లో నన్ను చూడబోతున్నారు. ఇకపై విభిన్నమైన రోల్స్ చేయనున్నాను. ‘నమిత ఈజ్ బ్యాక్’ అనేలా మంచి క్యారెక్టర్లు సెలక్ట్ చేసుకుంటాను. అవునూ... మీ భర్తను ‘స్వామీ’ అని పిలుస్తారట? ఇంతకుముందు వీర్ అని పిలిచేదాన్ని. ఆ మధ్యలో వీర్ అయ్యప్ప మాల వేసుకున్నాడు. అప్పుడు స్వామీ అని పిలుస్తాం కదా. అలా పిలవడం నాకు బాగా అనిపించింది. అందుకే ఎప్పటికీ ‘స్వామీ’ అని పిలవాలని డిసైడ్ అయిపోయాను. మీ భర్త సపోర్ట్ వల్లే మీరు బరువు తగ్గగలిగారా? అవును. అయితే ప్రాబ్లమ్ ఎక్కడ అంటే.. సన్నగా అవ్వాలనే ఆసక్తి భార్యకు కూడా ఉండాలి. భర్త డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా భార్య రాననడం నేను చాలా సందర్భాల్లో చూశాను. లావుగా ఉండడంవల్ల ఎక్కువ వయసున్నట్లు కనిపిస్తారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లని భర్తలు కూడా ఉంటారు. అప్పుడు వాళ్ల నాన్నలను అడగాలి. వినకపోతే రెండుమూడుసార్లు అడగాలి. లేకపోతే వాళ్లంతట వాళ్లే డాక్టర్ని సంప్రదించాలి. ఇంట్రెస్ట్ వాళ్లకే ఉండాలి. నా వల్ల కాదు, నాకు అక్కర్లేదు అనుకుంటే ఎవరు ఎంత సపోర్ట్ చేసినా ఉపయోగం ఉండదు. తన మార్పు మిగతావాళ్లకు ప్రేర ణ కలిగించాలి. నమితట్రాన్స్ఫర్మేషన్ వెనక ఉన్న కారణాలు రెండు. ఒకటి సినిమా. రెండోది వేరేవాళ్లు తనపై చూపించిన ఆసక్తి. ‘ఇంత బరువు పెరిగారు ఏంటి?’ అని అడిగేవాళ్లు. స్త్రీలు బరువు పెరిగితే వంద సమస్యలు ఉంటాయి. కానీ బయటకు చెప్పలేరు. ఎవరికైనా చెప్పినా పెళ్లయ్యాక పెరుగుతారులే అని కొట్టిపారేస్తారు. తగ్గడానికి ప్రయత్నించరు. వాళ్లకు స్ఫూర్తిగా నమిత ఉండాలన్నది నా ఉద్దేశం.తను సడన్‌గా ఎందుకు లావు అవుతోంది? ఎందుకు తగ్గుతోంది అనే ఆలోచనలో పడ్డాను. మనం తినేదాంట్లో సగం కూడా తినడం లేదు.. మరి ఎలా లావు అవుతోంది? అనుకున్నా. తను ఆరేళ్లు డిప్రెషన్లో ఉంది. దాంతో సిస్టమ్ దెబ్బతింది. డాక్టర్లను సంప్రదించి ఈ కోర్స్ మొదలుపెట్టాం. అందరూ లావు తగ్గటం పెద్ద టాస్క్ అనుకోకూడదు. అనుకుంటే తగ్గుతారు. –వీర్, నమిత భర్త – డి.జి.భవాని -
పొట్టు చిత్రానికి యూఏ సర్టిఫికెట్
తమిళసినిమా: పొట్టు చిత్రం యూఏ సర్టిఫికెట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. భరత్ హీరోగా నటించిన తాజా చిత్రం పొట్టు. ఇందులో నటి నమిత, ఇనియ, సృష్టిడాంగే ముగ్గురు హీరోయిన్లుగా నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో తంబిమామయ్య, భరణి, నాన్‌కడవుల్ రాజేంద్రన్, ఊర్వశి, నికేశ్రామ్, షియాజీ షిండే, ఆర్యన్, స్వామినాథన్, పావా లక్ష్మణన్ నటించారు. ఇంతకు ముందు మైనా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాలోమ్ స్టూడియోస్ సంస్థ అధినేతలు జాన్‌మ్యాక్స్, జాన్స్ కలిసి నిర్మించిన చిత్రం పొట్టు. వడివుడైయాన్ కథ, కథనం, దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్‌ను ముగించుకుంది. హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. పొట్టు చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. -
పార్వతీనాయర్‌కు లక్కీచాన్స్!
తమిళసినిమా: నటి పార్వతీనాయర్ కోలీవుడ్‌లో లక్కీచాన్స్ కొట్టింది. దుబాయ్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మడు మోడలింగ్ రంగం నుంచి నటిగా సినీరంగప్రవేశం చేసింది. మలయాళం, కన్నడ, తమిళ్ అంటూ పలు భాషల్లో నటించినా కథానాయకిగా చెప్పుకోదగ్గ అవకాశాలేమీ ఇప్పటి వరకూ అందుకోలేకపోయిందనే చెప్పాలి. అయితే కమలహాసన్ నటించిన ఉత్తమవిలన్, జయంరవితో నిమిర్న్దునిల్, అజిత్ చిత్రం ఎన్నై అరిందాల్ వంటి పలు తమిళ చిత్రాల్లో మెరిసింది. ఇటీవల కొడిట్ట ఇడంగళ్ నిరప్పుగా చిత్రంలో కథానాయకిగా నటించింది. ఆ చిత్రం అంతగా పేరు తెచ్చి పెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఉదయనిధిస్టాలిన్‌తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ చిన్న గ్యాప్ తరువాత తమిళంలో దర్శకత్వం వహించనున్న చిత్రం ఇది. మలయాళంలో గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించిన మహేషింటే ప్రతీకారం చిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.ఇందులో నమిత మరో నాయకిగా నటించనున్నారు. ప్రమోద్, సముద్రఖని, ఎంఎస్.భాస్కర్ ముఖ్య పాత్రలను పోషించనున్న ఈ చిత్రాన్ని మూన్‌షాట్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై సంతోష్ నిర్మించనున్నారు. మలయాళ చిత్రానికి తమిళంలో చిన్నచిన్న మార్పులు, చేర్పులు చేసి వినోదాన్ని మరింత పెంచి రూపొందించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. పార్వతీనాయర్ ఈ చిత్రంతో పాటు తెలుగులోనూ ఒక చిత్రం చేస్తోందట. మొత్తం మీద దక్షిణాది చిత్ర పరిశ్రమను చుట్టేస్తోందన్న మాట ఈ మలయాళీ బ్యూటీ. -
నమితకు కోర్టు అండ
నటి నమితకు కోర్టు అండగా నిలిచింది. గళ్చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన నమిత. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన ఈ గుజరాతీ బ్యూటీకి ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయితే రాజకీయాల్లో రాణించాలని ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టారు. స్థానిక నుంగంబాక్కంలోని వీరభద్రన్ వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్న నమితకు ఇంటి యజమాని కరుప్పయ్య నాగేంద్రన్ కు అద్దె విషయంలో సమస్యలు తలెత్తినట్లు తెలిసింది. దీంతో నమిత ఇంటి యజమాని చర్యలు తనను బాధిస్తున్నాయని నుంగంబాక్కం పోలీస్‌స్టేన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఇంటి యజమాని తనను ఇల్లు ఖాళీ చేయించడానికి పలు విధాలుగా ఒత్తిడి తీసుకొస్తున్నారని, రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తనకు ప్రశాంతంగా జీవించే హక్కు ఉందని అందువల్ల తనపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా ఇంటి యజమానిని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ ను బుధవారం విచారించిన న్యాయమూర్తి నటి నమితపై ఎలాంటి ఒత్తిళ్లు చేయరాదని ఇంటి యజమానిని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
గుంటూరులో..?
‘సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే..’ అంటూ ‘సింహా’ చిత్రంలో తన గ్లామర్‌తో కుర్రకారు మతులు పోగొట్టారు బొద్దుగుమ్మ నమిత. ఆ చిత్రం విడుదలై ఆరేళ్లు దాటినా ఆమె మరో తెలుగు చిత్రంలో నటించలేదు. ఆ మాటకొస్తే తమిళంలో కూడా చేయడంలేదు. సహజంగానే బొద్దుగా ఉండే నమిత మరింత బరువు పెరగడంతో అవకాశాలు తగ్గాయనొచ్చు. ఆ విషయం గహ్రించారేమో స్లిమ్ అయ్యారు. తమిళంలో ఆల్రెడీ ఓ సినిమా అంగీకరించారు. తాజాగా ‘గుంటూర్ టాకీస్ 2’తో తెలుగు చిత్ర పరిశ్రమలో రీ–ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త వినిపిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఎం. నిర్మించిన ‘గుంటూర్ టాకీస్’ ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. ఆ చిత్ర నిర్మాత రాజ్‌కుమార్ దర్శకునిగా మారి, ‘గుంటూర్ టాకీస్ 2’ తెరకెక్కించ నున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ తీయాలను కుంటున్నారట. ఇందులో డాన్ పాత్రకు బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లీయోన్ను తీసుకున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఓ ముఖ్య పాత్రలో నమిత కనిపించనున్నారని టాక్. దర్శక–నిర్మాత ఆమెను సంప్రదించారట. ఇక, నమిత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. -
ఆ ‘టచ్’ పిల్లలకు చెప్పాలి!
‘‘పిల్లలకు పెద్ద పెద్ద విషయాలు చెప్పకూడదు అనేది ఒకప్పటి మాట. సమాజంలో చెడు పెరిగిపోయింది కాబట్టి, కొన్నైనా పెద్ద విషయాలు చెప్పాలి’’ అంటున్నారు నమిత. చెన్నైలో ఓ వేడుకలో పాల్గొన్న ఈ బ్యూటీ పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల్ని ప్రస్తావిస్తూ, ‘‘ఎదుగుతున్న ఆడపిల్లలకు తల్లితండ్రులు కొన్ని సలహాలూ, సూచనలూ ఇవ్వాలి. అవతలి వ్యక్తి ‘టచ్’ చేస్తే, ఆ టచ్ వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకోగలిగేలా వాళ్లకు అవగాహన కలిగించాలి. దురుద్దేశంతో ‘టచ్’ చేస్తే ఎలా ఎదుర్కో వాలో చెప్పాలి. పిల్లల దగ్గర ఇలాంటి విషయాలు ఎలా మాట్లా డాలని మొహమాటపడకూదు. ఎంత ఓపెన్‌గా మాట్లాడితే వాళ్ల జీవితం అంత బాగుంటుంది’’ అన్నారు. -
అత్యాచారాలపై మాట్లాడడం లేదు
బాలలపై అత్యాచారాల గురించి వేదికలపై ఎవరూ మాట్లాడడంలేదు, తాను మాత్రం వాటి గురించి గొంతెత్తుతానని నటి నమిత వ్యాఖ్యానించారు. అమ్మా అప్పా సినీ క్రియేషన్స పతాకంపై పళనీవేల్ కథ, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న చిత్రం ఛాయ. నటి సోనియా అగర్వాల్ పోలీస్ అధికారిణిగా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి పార్తిబన్ ఛాయాగ్రహణం, ఏసీ.జాన్ పీటర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ.స్టూడియోలో జరిగింది. నటుడు శ్రీకాంత్ అతిథిగా పాల్గొని చిత్ర ఆడియో ను ఆవిష్కరించారు. మరో అతిథిగా పాల్గొన్న నమిత మాట్లాడుతూ సమాజానికి ఏదైనా మంచి సందేశం ఇవ్వాలంటే రెండే మార్గాలన్నారు. ఒకటి సినిమా, రెండు రాజకీయాలు.అందుకే తాను రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నానన్నారు. సమాజంలో పిల్లలపై అత్యాచారాలు అధికం అవుతున్నాయన్నారు. వాటి గురించి ఏ వేదికపైనా ఎవరూ మాట్లాడడం లేదని, తాను అలాంటి చర్యలను ఖండిస్తూ గొంతెత్తుతానని అన్నారు. ఇక ఈ ఛాయ చిత్రం విషయానికి వస్తే ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు చక్కని సందేశం ఇచ్చే కథా చిత్రం అని విన్నానన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను మాత్రం అందిస్తే చాలదన్నారు. వారితో సన్నిహితంగా మెలుగుతూ సమాజం గురించి తెలియజేయాలన్నారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, అదే విధంగా తన సోదరుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని వారి బాధ్యతలు తానే చూసుకుంటానని నమిత తెలిపారు. -
అత్యాచార బాధితులకు అండగా రకుల్‌ప్రీత్‌సింగ్
రాబందుల్లాంటి వారి రాక్షసత్వానికి బలైన ఆడపడుచులను ఆదుకోవడానికి తనవంతుగా ముందుకొస్తున్నారు నటి రకుల్ ప్రీత్‌సింగ్. సినీ తారల్లో చాలా మంది సామాజిక సేవకు ఉపక్రమిస్తున్న విషయం తెలిసిందే. నటి హన్సిక అనాథ బాలలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 34 మంది పిల్లల్ని దత్తత తీసుకుని వారి కోసం ఆశ్రమాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. ఇక నటి త్రిష శునకాల సంరక్షణకు నడుం బిగించారు. నటి సమంత స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పి పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నటి నమిత తన సొంత ఖర్చులతో స్త్రీలకు మరుగుదొడ్లు కట్టించారు. ఇదే కోవలో తాజాగా నటి రకుల్ ప్రీత్‌సింగ్ తన వంతు సామాజిక సేవ చేయడానికి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్‌లో పెద్దగా రాణించకపోరుునా, టాలీవుడ్లో క్రేజీ నాయకిగా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ అత్యాచారాలకు గురైన అభాగ్యపు అమ్మారుులకు తగిన సాయం అందించడానికి నడుం బిగించారు. వారి కోసం నిధిని సేకరించడానికి తను బహిరంగ వేదికపై వివిధ భంగిమల్లో కసరత్తులను చేయనున్నారు. ఈ నెల 20వ తేదీన జరగనున్న రకుల్ ప్రీత్ వ్యాయామాల కార్యక్రమానికి హైదరాబాద్‌లోని క్రీడామైదానం వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో రకుల్‌ప్రీత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారని సమాచారం. సహృదయంతో రకుల్ తలపెడుతున్న ఈ నిధి సేకరణ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం. -
ఆయనతో నటించడం మంచి అనుభవం
సూపర్‌స్టార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని అందాలభామ నమిత పేర్కొన్నారు. ఇంతకు ముందు తనదైన అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించినఈ అమ్మడు మధ్యలో సినిమాలకు దూరమయ్యారు. అయితే మళ్లీ నటించాలన్న కోరికతో బొద్దుగా ఉన్న నమిత సుమారు 20 కిలోల బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యారుఅలా కొత్త అందాలతో రెడీ అయిన నమితకు మలయాళంలో అక్కడి సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో నటించే అవకాశం వచ్చింది. అలా ఆయనతో నటించిన పులిమురుగన్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి మంచి ప్రేక్షకాదరణను అందుకుంటోంది. ఈ సందర్భంగా నమిత ఆ చిత్రంలో నటించిన అనుభవాలను పంచుకున్నారు. ప్ర: మలయాళ చిత్రంలో నటించిన అనుభవం గురించి? జ: నటిగా రీఎంట్రీకి రెడీ అయినప్పుడు మలయాళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. పులిమురుగన్ చిత్ర దర్శకుడు కథ వినిపించారు. అది అడ్వెచర్ కథ. అయితే ఆ కథను చెప్పినట్లుగా తెరకెక్కించగలరా? అన్న సందేహం కలిగింది. ఆ చిత్ర హీరో మోహన్‌లాల్. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో నటించే అవకాశం రావడం సాధారణ విషయం కాదు. అందుకే పులిమురుగన్ చిత్రంలో నటించడానికి అంగీకరించాను.అందులో నా పాత్ర పేరు జూలి. ధనవంతుల కుటుంబానికి చెందిన యువతి. అలాంటి అమ్మాయి పులిమురుగన్ గుణగణాలు మెచ్చి ఆయన్ని ప్రేమిస్తుంది. చిత్రం అంతా హీరోతో ఉంటూ ఆయనకు సహకరించే పాత్ర. మోహన్‌లాల్‌తో నటించడం చాలా మంచి అనుభవం. ప్ర: మలయాళంలో లోబడ్జెట్ చిత్రాలు రూపొందుతాయంటారు.పులిమురుగన్ చిత్రం అలాంటిదేనా? జ: నిజమే మలయాళంలో లోబడ్జెట్ చిత్రాలే రూపొందుతాయనే అపోహ ఉంది.అయితే ఈ పులిమురుగన్ 25 కోట్ల వ్యయంతో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం. ఇందులో మోహన్‌లాల్ నటన అద్భుతం అనే చెప్పాలి. ప్ర: ఇతర చిత్రాల వివరాలు? జ: తమిళంలో భరత్‌కు జంటగా నటిస్తున్న పొట్టు చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి జానీ అనే ఆయన చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఆ చిత్ర షూటింగ్ ప్రారంభం కోసం వేచి చూస్తున్నాను. మరి కొన్ని చిత్రాల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.తమిళం,తెలుగు, మలయాళం భాషల్లో మరో రౌండ్ కొట్టాలని కోరుకుంటున్నాను. ప్ర: సినిమాలు,రాజకీయాల్లో పయనించడం గురించి? జ: రెండు వేర్వేరు వృత్తులు. ప్రజలకు ఏమైనా చేయాలని భావించాను. అందుకు తన వంతు సాయం చేస్తున్నాను. సినిమాకు,రాజకీయాలకు సంబంధం లేదు. ప్ర: ముఖ్యమంత్రి జయలలిత గురించి? జ: ముఖ్యమంత్రి జయలలిత ఇంతకు ముందే ఎన్నో కష్టాలను అధిగమించారు. కోట్లాదిమంది అమ్మ ఆరోగ్యంగా తిరిగి రావాలని పూజలు చేస్తున్నారు. కాబట్టి అమ్మ త్వరలోనే క్షేమంగా తిరిగొస్తారు. -
లంక తమిళులకు ద్విపౌరసత్వం కోసం పోరాడతా!: జయ
తిరుచురాపల్లి: శ్రీలంకలో ఉన్న తమిళులకు ఆ దేశంలో ప్రత్యేక భూభాగం కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత తెలిపారు. తిరుచురాపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జయ మాట్లాడుతూ.. లంక తమిళులకు భారత పౌరసత్వం కూడా వచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. లంక తమిళ శరణార్థులకు ఇక్కడ ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. శ్రీలంకలోని తమిళులపై జరుగుతున్న అన్యాయాలపై అంతర్జాతీయ విచారణ జరగాలని తను మొదట్నుంచీ పట్టుబడుతున్నానని జయ తెలిపారు. శ్రీలంకలో తమిళుల దుస్థితికి డీఎంకే, కాంగ్రెస్‌లే కారణమని జయ విమర్శించారు. అన్నాడీఎంకేలో చేరిన నమిత సినీనటి నమిత శనివారం జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే కండువా కప్పుకున్నారు. ముందుగా జయతో దోస్తీకి లేఖ రాసిన నమిత.. ఆ తర్వాత తిరుచ్చిలో జరిగిన సభలో జయపార్టీలో అధికారికంగా చేరారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు నమిత అంగీకరించారు. -
నేను రాజకీయాల్లోకి రాకూడదా?
కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే గుజరాతీ భామ నమిత. అభిమానులను మచ్చాన్స్(బావలు) అంటూ ముద్దుగా పిలుస్తూ కవ్వించే ఆమె ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ సందడి చేస్తుంది. ఈ సుందరి కొంతకాలంగా తమిళసినిమాలకు దూరం కావడంతో అభిమానులు కలత చెందారు. అందుకు కారణం ఆమె స్థూలకాయమే. చాలా ఒత్తిడికి గురైన నమిత ఇప్పుడు మళ్లీ చిక్కి చక్కగా తయారైంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. సినీ, వ్యక్తిగత విషయాల గురించి నమితతో ‘సాక్షి’ భేటీ.. - తమిళ సినిమా ప్ర : రీఎంట్రీ మలయాళంలో అయినట్లున్నారే? జ : నేనెక్కడికి వెళ్లినా, ఏ సినిమాతో రీఎంట్రీ అయినా తమిళనాడు బావల మనసుల్లో పదిలంగా ఉండిపోతాను. శరీరం లావెక్కడంతో నటించడానికి ఎవరూ పిలవలేదు. కొంచెం పరిచయం ఉన్నవాళ్లు కూడా ఎక్కడ అవకాశాలు అడుగుతానో అని తప్పించుకుతిరుగుతున్నారు. అప్పుడే ఇక విషయం అర్థమైంది. నేను చాలా చాలా బరువెక్కాను. నాలో ఉన్న ఈ లోపాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుందిగా అని ఆలోచించాను. ఎక్సర్సైజ్ ద్వారా 94 కిలోల బరువున్న నేను 76కు తగ్గాను. స్లిమ్‌గా తయారవడంతో మలయాళంలో పులిమురుగన్ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ప్ర : భోజనం ఫుల్‌గా లాగించేవాళ్లా? జ : అవును. తమిళంలో నేను నటించిన చివరి చిత్రం ఇళంజన్. అది విడుదలై సుమారు ఐదున్నరేళ్లు అవుతోంది. ఈ మధ్యలో అవకాశాలు లేకుండా ఖాళీగా కూర్చోలేదు. తెలుగు, కన్నడ భాషలలో నటిస్తూనే ఉన్నాను. నాకు నచ్చిన తమిళంలో సక్సెస్ కాలేకపోయాననే చింత వెంటాడుతూనే ఉండేది. అలా ఒత్తిడికి లోనై ఆహార నియమాలను పక్కన పెట్టి బిరియాని, పిజ్జా, ఐస్‌క్రీమ్, అన్నం అంటూ ఏదిపడితే అది లాగించేశాను. ఆ తర్వాత చూసుకుంటే బరువు సరాసరిగా పెరిగిపోయింది. చాలా భయపడిపోయాను. అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రయత్నంతోనే ఇదిగో ఇలా స్లిమ్‌గా తయారయ్యాను. ప్ర : నిర్మాతగా మారనున్నారట? జ : ఇది నిజంగా జోకే. ఎవరు ప్రచారం చేస్తున్నారు ఇలాంటి వదంతులను. నాకు చిత్ర నిర్మాణ ఆలోచనే లేదు. సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎలా చెయ్యాలో తెలియదు. నాకు తెలిసిందల్లా నటన ఒక్కటే. అది సరిగా చేస్తే చాలని భావిస్తాను. ప్ర : బాక్సింగ్ నేర్చుకున్నారట? జ : ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. అలాంటి సమయాల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటాను. అలా స్టంట్ క్లాస్‌కు వెళ్లి బాక్సింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాతే నాకు తెలియకుండానే నాలో ధైర్యం పెరిగింది. అంతేకాదు యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలనే కోరిక పెరిగింది. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ప్ర : తమిళనాడు నచ్చిందా? జ : చాలా బాగా నచ్చేసింది. అందుకేగా గుజరాత్ నుంచి వచ్చేసి చెన్నైలో సెటిల్ అయిపోయాను. ఇకపై ఇదే నా పుట్టినిల్లు. ఇప్పుడు గుజరాత్లో ఏయే పండుగలు చేసుకుంటున్నారన్నది కూడా మరచిపోయాను. తమిళనాడులో జరుపుకునే పండుగలన్నీ నాకు తెలుసు. నాకు బాగా నచ్చిన పండుగ పొంగల్. ఈ పొంగల్‌ను ఏదైనా పల్లెటూరుకెళ్లి జరుపుకోవాలనుకుంటున్నాను. ప్ర : రాజకీయరంగ ప్రవేశం ఆలోచనలో ఉన్నారట? జ: ఏం నేను రాజకీయాల్లోకి రాకూడదా? భారత దేశంలో ఇప్పుడున్న రెండు పెద్ద రాజకీయ పార్టీల వారు నన్ను తమ పార్టీలో చేరమని రాయబారం పంపుతున్నారు. వారికి నేనింకా ఏమీ చెప్పలేదు. ఏదో ఒక రోజు కచ్చితంగా నేను రాజకీయ రంగ ప్రవేశం చేస్తా. ఏ పార్టీలో చేరతానన్నది మీకు అప్పుడే తెలుస్తుంది. ప్ర : సరే పెళ్లి సంగతేమిటి? జ : దాంతో ఇప్పుడు అవసరం లేదు. ఇప్పటివరకూ నేనెవరినీ ప్రేమించలేదు. ఇకపై ఏమి జరుగుతుందో తెలియదు. -
మే 10న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సునీత (గాయని), నమిత (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునేవారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 5. వీరికి ఈ సంవత్సరం అన్ని ఆటంకాలూ తొలగిపోయి, వృత్తిపరంగా, కుటుంబపరంగా చాలా ప్రోత్సాహకరంగా, సంతోషంగా ఉంటుంది. మీడియాలో పని చేసేవారికిది మేలిమలుపు తిప్పే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో చదువుకోవాలనుకునేవారికి, విదేశాలలో ఉద్యోగాలకోసం ప్రయత్నం చేసేవారికి ఆశాజనకంగా ఉంటుంది. డాక్యుమెంట్లపై సంతకాలు చేసేటప్పుడు ఆలోచించి చేయడం అవసరం. పోటీ పరీక్షలు రాసేవారికి విజయం తథ్యం. లక్కీనంబర్స్: 1,5,9. లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రీన్. కుజగ్రహ శాంతికై జపం చేయించుకోవడం, పేద అవివాహిత యువతుల వివాహ ఖర్చులలో పాలుపంచుకోవడం, అనాథల చదువుకు సాయం చేయడం వల్ల వీరికి మరిన్ని అనుకూలమైన అవకాశాలుంటాయి. - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్