లంక తమిళులకు ద్విపౌరసత్వం కోసం పోరాడతా!: జయ
తిరుచురాపల్లి: శ్రీలంకలో ఉన్న తమిళులకు ఆ దేశంలో ప్రత్యేక భూభాగం కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత తెలిపారు. తిరుచురాపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జయ మాట్లాడుతూ.. లంక తమిళులకు భారత పౌరసత్వం కూడా వచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. లంక తమిళ శరణార్థులకు ఇక్కడ ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. శ్రీలంకలోని తమిళులపై జరుగుతున్న అన్యాయాలపై అంతర్జాతీయ విచారణ జరగాలని తను మొదట్నుంచీ పట్టుబడుతున్నానని జయ తెలిపారు. శ్రీలంకలో తమిళుల దుస్థితికి డీఎంకే, కాంగ్రెస్‌లే కారణమని జయ విమర్శించారు.
అన్నాడీఎంకేలో చేరిన నమిత
సినీనటి నమిత శనివారం జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే కండువా కప్పుకున్నారు. ముందుగా జయతో దోస్తీకి లేఖ రాసిన నమిత.. ఆ తర్వాత తిరుచ్చిలో జరిగిన సభలో జయపార్టీలో అధికారికంగా చేరారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు నమిత అంగీకరించారు.