పార్వతీనాయర్‌కు లక్కీచాన్స్‌! | Parvathinair had a chance to romance with Udyanidhi Stalin. | Sakshi
Sakshi News home page

పార్వతీనాయర్‌కు లక్కీచాన్స్‌!

Published Thu, Jul 6 2017 2:01 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

పార్వతీనాయర్‌కు లక్కీచాన్స్‌!

పార్వతీనాయర్‌కు లక్కీచాన్స్‌!

తమిళసినిమా: నటి పార్వతీనాయర్‌ కోలీవుడ్‌లో లక్కీచాన్స్‌ కొట్టింది. దుబాయ్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మడు మోడలింగ్‌ రంగం నుంచి నటిగా సినీరంగప్రవేశం చేసింది. మలయాళం, కన్నడ, తమిళ్‌ అంటూ పలు భాషల్లో నటించినా కథానాయకిగా చెప్పుకోదగ్గ అవకాశాలేమీ ఇప్పటి వరకూ అందుకోలేకపోయిందనే చెప్పాలి.

అయితే కమలహాసన్‌ నటించిన ఉత్తమవిలన్, జయంరవితో నిమిర్న్‌దునిల్, అజిత్‌ చిత్రం ఎన్నై అరిందాల్‌ వంటి పలు తమిళ చిత్రాల్లో మెరిసింది. ఇటీవల కొడిట్ట ఇడంగళ్‌ నిరప్పుగా చిత్రంలో కథానాయకిగా నటించింది. ఆ చిత్రం అంతగా పేరు తెచ్చి పెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఉదయనిధిస్టాలిన్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ చిన్న గ్యాప్‌ తరువాత తమిళంలో దర్శకత్వం వహించనున్న చిత్రం ఇది.

మలయాళంలో గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించిన మహేషింటే ప్రతీకారం చిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.ఇందులో నమిత మరో నాయకిగా నటించనున్నారు. ప్రమోద్, సముద్రఖని, ఎంఎస్‌.భాస్కర్‌ ముఖ్య పాత్రలను పోషించనున్న ఈ చిత్రాన్ని మూన్‌షాట్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై సంతోష్‌ నిర్మించనున్నారు. మలయాళ చిత్రానికి తమిళంలో చిన్నచిన్న మార్పులు, చేర్పులు చేసి వినోదాన్ని మరింత పెంచి రూపొందించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. పార్వతీనాయర్‌ ఈ చిత్రంతో పాటు తెలుగులోనూ ఒక చిత్రం చేస్తోందట. మొత్తం మీద దక్షిణాది చిత్ర పరిశ్రమను చుట్టేస్తోందన్న మాట ఈ మలయాళీ బ్యూటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement