నా ఫోన్ ఆమె ఎత్తుకెళ్లింది.. ఆ పోస్ట్ ఎవరూ నమ్మొద్దు: నమిత | Namita Thapar says househelp posted hateful story from her phone | Sakshi
Sakshi News home page

పనిమనిషి ఇంతపని చేసిందా.. నటిని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు

Published Sun, Jan 15 2023 9:42 PM | Last Updated on Sun, Jan 15 2023 9:42 PM

Namita Thapar says househelp posted hateful story from her phone - Sakshi

బాలీవుడ్ నటినమితా థాపర్ తన ఫోన్ చోరీకి గురైనట్లు వెల్లడించింది. నా ఫోన్ చోరీ చేయడమే కాకుండా ద్వేషపూరిత కథనాన్ని పోస్ట్ చేశారని తెలిపింది. తన ఇంట్లో పనిమనిషి మొబైల్ దొంగిలించి ఇలా చేసిందని వాపోయింది. సోషల్ మీడియాలో నాపై కావాలనే ఇలా చేసిందని పేర్కొంది నటి. 

నమితా తాపర్ షార్క్ ట్యాంక్ అనే రియాల్టీ షోతో ఫేమస్ అయ్యారు. నమితా థాపర్ ఫోన్ దొంగిలించిన పని మనిషి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ద్వేషపూరిత పోస్ట్ చేసింది. దీంతో అప్రమత్తమైన నమితా ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. తన ఫోన్ ఇప్పుడు రికవరీ చేయబడిందని.. ఆందోళనతో ఫోన్ చేసిన స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేసింది.

అయితే ఆమె వివరణతో కొంతమంది సోషల్ మీడియా ఫాలోవర్లు ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. ఇది నిజంగా ఆమె కొడుకు ద్వారా పోస్ట్ చేశారా..లేక నమితా థాపర్ కావాలనే పనిమనిషిని నిందిస్తున్నారా అని ఆశ్చర్యపోయారు. షార్క్ ట్యాంక్ ఇండియా అనేది ఒక రియాలిటీ షోలో నమితా థాపర్‌తో పాటు.. ప్యానెల్‌లో అనుపమ్ మిట్టల్, వినీతా సింగ్, అమన్ గుప్తా, పీయూష్ బన్సాల్, మరో కొత్త నటుడు అమిత్ జైన్ కూడా ఉన్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2 సోనీ టీవీ, సోనీలైవ్‌లో ప్రసారమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement