గ్లామర్‌కు గుడ్‌బై | Namitha Said That She Will No Longer Play Glamorous Roles | Sakshi
Sakshi News home page

గ్లామర్‌కు గుడ్‌బై

Published Mon, Aug 12 2024 10:52 AM | Last Updated on Mon, Aug 12 2024 11:36 AM

Namitha says no glamour roles

ఇంతకుముందు తన అందచందాలతో అలరించి యువతకు డ్రీమ్‌గర్ల్‌ ముద్ర వేసుకున్న నటి నమిత. ఆమె అభిమానులను మచ్చాస్‌ ఫ్లయింగ్‌ కిస్‌లతో ఖుషీ పరిచేవారు. 2004లో ఎంగల్‌ అన్నా చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయమైన నటి నమిత. విజయ్‌కాంత్‌ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది. 

దీంతో నమితకు వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి అలా ఏయ్, బంపర కన్నాలే, ఆణ, కోవై బ్రదర్స్, బిల్లా వంటి పలు చిత్రాల్లో నటించారు. అజిత్‌ కథానాయకుడిగా నటించిన బిల్లా చిత్రంలో నమిత స్విమ్మింగ్‌ దుస్తుల అందాలారబోత యువతను గిలిగింతలు పెట్టించిందనే చెప్పాలి. పలు తెలుగు చిత్రాల్లో నటించిన నమిత 2017లో వీరేందర్‌ చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. వీరికి కవల పిల్లలు పుట్టారు. కాగా ఈమె నటనకు దూరమైన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. 

నటిగా ఈమె రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారన్నది గమనార్హం. అలాంటిది ఇటీవల ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్న నమిత మాట్లాడుతూ తన కవలపిల్లలకు రెండేళ్ల వయసు దాటిందన్నారు. దీంతో మళ్లీ నటించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలా ఇప్పటికే ఒక చిత్రంలో ప్రతినాయకి పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇకపై గ్లామరస్‌ పాత్రలు పోషించనని నమిత చెప్పారు. నమిత మళ్లీ నటిగా రీఎంట్రీ ఇవ్వడం ఆమె అభిమానులకు శుభవార్త అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement