Actress Namitha Blessed With Twin Babies Shares Video With Husband Goes Viral - Sakshi
Sakshi News home page

Actress Namitha: కవలలకు జన్మనిచ్చిన నమిత.. వీడియో విడుదల చేసిన నటి

Aug 20 2022 8:41 AM | Updated on Aug 20 2022 6:01 PM

Actress Namitha Blessed With Twin Babies Shares Video With Husband - Sakshi

హీరోయిన్‌ నమిత గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకుంది. ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నమిత తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంది. 'నాకు ట్విన్ బాయ్స్ పుట్టారు.  కృష్ణాష్టమి రోజున(శుక్రవారం)ఈ గుడ్‌న్యూస్‌ను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము.

హాస్పిటల్‌ సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నన్ను గైడ్‌ చేసినందుకు, నా పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను' అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. కాగా సొంతం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నమిత వెంకటేశ్‌తో నటించిన జెమిని సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ దక్కించుకుంది.

2017లో ప్రియుడు  వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. ఇక నమితకు ట్విన్స్‌ పుట్టారని తెలిసి పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement