Actress Namitha Husband Reaction On Her Marriage With Sarath Babu Rumours - Sakshi
Sakshi News home page

Namitha: మైండ్‌ డిస్ట్రబ్‌ అవుతుంది, అది చాలా తప్పు.. నమిత భర్త ఎమోషనల్‌

Published Wed, Jan 26 2022 3:49 PM | Last Updated on Wed, Jan 26 2022 4:35 PM

Actress Namitha Husband Reaction On Namitha Marriage With Sarath Babu Rumours - Sakshi

Namitha Husband Reaction On Namitha Marriage With Sarath Babu Rumours: హీరోయిన్‌ నమితకు తెలుగు, తమిళంలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. 'సొంతం' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ తర్వాత వెంకటేష్ సరసన జెమినీ, రవితేజకు జోడీగా ఒక రాజు..ఒక రాణి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

గ్లామరస్‌ హీరోయిన్‌గా పాపులర్‌ అయిన నమిత 2017లో వ్యాపారవేత్త, నిర్మాత వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది.

అయితే నమితపై గతంలో అనేక రూమార్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. వీరేంద్రతో పెళ్లి ఫిక్సయిన తర్వాత కూడా సీనియర్‌ నటుడు శరత్‌బాబుతో నమిత పెళ్లంటూ అప్పట్లో సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నమిత భర్త వీరేంద్ర స్పందించారు.

ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సరిగ్గా మా పెళ్లి సమయంలోనే సీనియర్‌ నటుడు శరత్‌బాబుతో నమిత పెళ్లంటూ వార్తలు వచ్చాయి. నా లైఫ్‌లోనే నేను విన్న వరస్ట్‌ కామెంట్స్‌ ఇవి. అసలు అలాంటి రూమర్స్‌ ఎందుకు వచ్చాయో కూడా తెలియదు. ఆయన చాలా పెద్దాయన. అలాంటి వ్యక్తితో ఎఫైర్‌ క్రియేట్‌ చేయడం చాలా తప్పు. అలాంటి రూమర్స్‌ని పట్టించుకోవాల్సిన పనిలేదు' అంటూ పుకార్లకి చెక్‌ పెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement