Actress Trisha Marriage Rumours With Tamil Director Goes Viral - Sakshi
Sakshi News home page

Trisha : కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న త్రిష పెళ్లి టాపిక్‌

Published Fri, Jul 23 2021 7:33 PM | Last Updated on Sat, Jul 24 2021 11:32 AM

Is Heroine Trisha Getting Married To Kollywood Director - Sakshi

Trisha Marraige Rumours: చెన్నై బ్యూటీ త్రిష పెళ్లి టాపిక్‌ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ తమిళ దర్శకుడిని త్రిష త్వరలోనే పెళ్లాడబోతుందంటూ ఓ వార్త కోలీవుడ్‌ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతుంది. ఓ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించిందని, ఈ నేపథ్యంలో త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఆ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం తెలియరాలేదు. గత కొన్నిరోజులుగా త్రిష పెళ్లి వార్తలపై జోరుగా ప్రచారం జరుగుతున్నా ఆమె ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

నిజానికి త్రిష పెళ్లికి సంబంధించి ఇప్పటికే ఎన్నో రూమర్స్‌ పుట్టుకొచ్చాయి. కొద్ది రోజుల క్రితమే త్రిషకు ఓ బిజినెస్‌ మ్యాన్‌తో పెళ్లి నిశ్చయమైందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే అది కేవలం పుకారు అని తేలింది. గతంలో వరుణ్‌ మణియన్‌ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిన త్రిష.. అతడితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట నిశ్చితార్థం తర్వాత వచ్చిన కొన్ని మనస్పర్థల కారణంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు.

ఇక అప్పటి నుంచి సినిమాలపై దృష్టి పెట్టిన ఆమె ఈ మధ్యకాలంలో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. 40కి దగ్గర్లో ఉన్నా ఇప్పటికీ వన్నె తరగని అందంతో హీరోయిన్‌గా వరుస చిత్రాలు చేస్తూ సత్తా చాటుతుంది ఈ చెన్నై చిన్నది. ప్రస్తుతం త్రిష  ‘పొన్నాయ్ సెల్వన్’, ‘సతురంగ వెట్టాయ్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement