25 ఏళ్ల నాటి ఫోటో షేర్‌ చేసిన స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా..? | Star Heroine Share Her 25 Years Back Photo | Sakshi
Sakshi News home page

25 ఏళ్ల నాటి ఫోటో షేర్‌ చేసిన స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా..?

Oct 1 2024 7:36 AM | Updated on Oct 1 2024 8:54 AM

Star Heroine Share Her 25 Years Back Photo

కళామతల్లిని నమ్మినవారిని ఎన్నటికీ చేయి విడువదు. ఇందుకు ఉదాహరణ నటి త్రిష. సుమారు 25 ఏళ్లుగా ఈ బ్యూటీ చెక్కు చెదరని అందాలతో కథానాయకిగా రాణిస్తున్నారు. మధ్యలో చిన్న ఆటుపోటులకు గురైనా త్రిష సినిమా కెరీర్‌ అధికంగా ఉన్నత స్థాయిలోనే కొనసాగుతోంది. తొలుత తమిళంలో నాయకిగా రాణించినా, ఆ తరువాత ఆమె క్రేజ్‌ తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల వరకూ చేరింది. అలా ఈ ఐదు భాషల్లోనూ ప్రముఖ స్టార్స్‌తో జత కట్టి అగ్రకథానాయకిగా వెలిగి పోతున్నారు. 

ఇదీ చదవండి: అర్థరాత్రి ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్‌

నిజం చెప్పాలంటే పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో దర్శకుడు మణిరత్నం త్రిషకు మంచి రీఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి. ఈ నాలుగు పదుల పరువాల భామ ఇప్పుడు నటుడు అజిత్‌ సరసన విడాముయర్చి, గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రాలతో పాటు కమలహాసన్‌తో కలిసి థగ్‌లైఫ్‌ చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా ఒక చిత్రం, మలయాళంలో మోహన్‌లాల్, టోవినో థామస్‌తో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. 

త్రిష మొదట్లో అందాల పోటీల్లో పాల్గొని మిస్‌ చెన్నై కిరీటాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆమె ఆ కిరీటాన్ని 1999లో గెలుచుకున్నారు. అది జరిగి 25 ఏళ్ల గడిచిన సందర్భంగా ఆ మధురమైన స్మృతులను తలచుకుంటూ తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఆ ఫొటోలను పోస్ట్‌ చేశారు. అందులో తన జీవితాన్ని మార్చిన రోజు అది అని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement