త్రిషకు ఇష్టమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా..? | Do You Who Is Actress Trisha Krishnan Favourite Heroine? Comments Goes Viral | Sakshi
Sakshi News home page

త్రిషకు ఇష్టమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా..?

Published Tue, Oct 22 2024 6:40 AM | Last Updated on Tue, Oct 22 2024 9:38 AM

Trisha Krishnan Favourite Heroine

వెండితెర వెలుగులైన సినీ తారలకు దేవుళ్లు అభిమానులే. వారి అభిమానం పొందకపోతే ఎవరూ స్టార్‌ కాలేరు అన్నది వాస్తవం. అలా అసంఖ్యాక అభిమానులు కలిగిన నటీమణుల్లో త్రిష ఒకరు. గత రెండు దశాబ్దాలుగా తన అందం, అభినయాలతో అభిమానులను ఆరిస్తున్న అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి ఈ చైన్నె చిన్నది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ప్రముఖ కథానాయకులు అందరితోనూ జతకట్టిన క్రెడిట్‌ ఈమెది. ఖట్టా మిఠా అనే హిందీ చిత్రంలో నటించి బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైయ్యారు. అలా పాన్‌ ఇండియా హీరోయిన్‌గా ముద్ర వేసుకున్నారు. 

ఇప్పటికీ టాప్‌స్టార్స్‌తో జతకడుతున్న త్రిష చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె అజిత్‌ సరసన విడాముయర్చి, గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా ఒకేసారి ఒకే హీరోతో రెండు చిత్రాల్లో నటించడం అన్నది అరుదైన విషయమే. అదేవిధంగా మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న థగ్‌ లైఫ్‌ చిత్రంలోనూ త్రిష నటిస్తున్నారు. ఇకపోతే తెలుగులో చిరంజీవికి జతగా విశ్వంభర చిత్రంలో నటిస్తున్న ఈమె మలయాళంలో రామ్‌, ఐడెంటిటీ చిత్రాల్లో లభిస్తున్నారు. 

ప్రతిభకు కామా ఉంటుందేమో గాని ఫుల్‌స్టాప్‌ ఉండదు అని నిరూపించిన నటి త్రిష. ఆరంభ దశలో సామి, గిల్లి వంటి చిత్రాలకు ముందు ఆ తర్వాత అన్నట్టుగా వెలిగిన ఈమె ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రానికి ముందు ఆ తర్వాత అన్నట్టుగా వెలిగిపోతున్నారు. అలాంటి త్రిషకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అలాంటిది ఈమె కూడా కొందరికి వీరాభిమానినేనట. ఒక భేటీలో త్రిష పేర్కొంటూ తనకు నటి అనుష్క, నిత్యామీనన్‌, ఇవానా, సాయి పల్లవి అంటే చాలా ఇష్టమని తాను వారికి అభిమానిని అని పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement