Trisha Wants To Act With Superstar Rajinikanth - Sakshi
Sakshi News home page

Trisha : 'ఆయనతో నటించాలనుంది'.. మనసులో కోరిక బయటపెట్టిన త్రిష

Published Mon, Jan 2 2023 8:45 AM | Last Updated on Mon, Jan 2 2023 9:32 AM

Trisha Wants To Act With Superstar Rajinikanth - Sakshi

నటి త్రిష ఇప్పుడు మంచి జోష్‌లో ఉన్నారు. నాలుగు పదుల వయసులోనూ ఈమె తన అందాలతో కనువిందు చేస్తున్నారు. నటిగా ఈమె కెరీర్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రానికి ముందు ఆ తర్వాత అనే విధంగా ఉంది. త్రిషకు దర్శకుడు మణిరత్నం పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించే అవకాశం ఇవ్వకుంటే ఆమె పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఇప్పుడు మాత్రం త్రిషను ఆ చిత్రంలోని కుందవై పాత్రగానే చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం సెకండ్‌ ఇన్నింగ్సే. ఇప్పుడు స్టార్‌ హీరోలతో జతకట్టే అవకాశాలు వస్తున్నాయి. అలా ఒకేసారి నటుడు విజయ్‌ 67వ చిత్రం, అజిత్‌ 62వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో త్రిష లేడీ ఓరియంటెడ్‌ పాత్రలో నటింన రాంగీ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇందులో ఆమె యాక్షన్‌ సన్నివేశాల్లో దుమ్మురేపారు అనే చెప్పాలి. ఈ చిత్రం కోసం త్రిష ఉజ్జెకిస్థాన్‌ దేశాన్ని కూడా చుట్టొచ్చారు. జర్నలిస్ట్‌గా చాలా బోల్డ్‌ పాత్రలో యాక్షన్‌ సన్నివేశాలు కూడా డూప్‌ లేకుండా నటించి అభిమానులకు కొత్త అనుభతిని కలిగిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్ర ప్రవెషన్లు విరివిగా పాల్గొంటున్నారు. ఒక భేటీలో ఆమె పేర్కొంటూ దర్శకుడు మణిరత్నంకు థాంక్స్‌ చెప్పుకుంటున్నానన్నారు.

ఇప్పటికీ తనను కుందవైగానే ప్రేక్షకులు చూస్తున్నారని పేర్కొన్నారు. కల్కి నవల చదివిన వారికి అందులోని కుందవై పాత్రపై చాలా పెద్ద ఇమేజ్‌ ఉంటుందన్నారు. ఆ పాత్రకు తాను సరిపోతానా అన్న సందేహం చాలామందికి ఉండేదన్నారు. అలాంటిది ఇప్పుడు తానే కుందవై అన్నంతగా ప్రేక్షకులు భావించడం సంతోషంగా ఉందన్నారు. 2022 సంవత్సరం ఎలా గడిచింది అన్న ప్రశ్నకు చాలా బాగా గడిచిందన్నారు.

పొన్నియిన్‌ సెల్వన్‌ పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలై మంచి పేరు తెచ్చిపెట్టింది అన్నారు. ఇప్పుడు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రం రాంగీ విడుదల అయ్యిందని చెప్పారు. అదేవిధంగా మణిరత్నం, గౌతమ్‌ మీనన్, శరవణన్, ప్రేమ్‌ వంటి దర్శకుల చిత్రాల్లో నటించడం సంతోషకరమని, అయితే నటుడు రజినీకాంత్‌కు జోడీగా పూర్తిస్థాయి పాత్రలో నటించాలని కోరుకుంటున్నాను అని త్రిష పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement