నటనకు వయసుతో పనేంటి? అందం, అభినయం ఉంటే చాలు. పెళ్లితో పనేంటి? నమ్ముకున్న వాళ్లు, నమ్మకమైన వాళ్లు మన చుట్టూ నలుగురు ఉంటే చాలు. ఇదే నటి త్రిష భావనగా తెలుస్తోంది. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్యూటీ వయసు అక్షరాల నాలుగు పదులు. నటిగా 24 ఏళ్ల పయనం. తమిళం తెలుగు హిందీ కన్నడం భాషల్లో ఇప్పటికీ తిరుగులేని హీరోయిన్‌గా రాణిస్తున్న వైనం. గురువారం(మే 4న) త్రిష తన 40వ పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా త్రిష గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే తాను అందగత్తెను అనే విషయాన్ని గ్రహించిన త్రిష వాణిజ్య ప్రకటనల్లో నటించడం ప్రారంభించారు. అంతేకాకుండా అందాల పోటీల్లో పాల్గొని మిస్ చైన్నె కిరీటాన్నీ గెలుచుకున్నారు. అయితే వెంటనే సినిమాల్లో కథానాయికగా నటించే అవకాశాలు వరించలేదు. ముందుగా జోడీ అనే చిత్రంలో నటి సిమ్రాన్‌కు స్నేహితురాలుగా చిన్న పాత్రలో నటించే అవకాశం వరించింది. అలా 1999లో త్రిష నటిగా సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ప్రియదర్శన్ దష్టిలో పడి లేసా లేసా అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.
మరో విషయం ఏంటంటే ఆరంభంలో త్రిషకు సినిమాల్లో నటించాలనే ఆసక్తే లేదట. ఆమధ్య ఓ భేటీలో త్రిష.. సినీ రంగంలోకి వచ్చే ఛాన్సే లేదని, అది తాను కోరుకున్న స్థానం కాదని పేర్కొన్నారు. అయితే కాల ప్రభావంతో తనకు ఇష్టం గాని సినిమా రంగంలోకే వచ్చాననే భావాన్ని వ్యక్తం చేశారు. నిజంగా ఆమె కోరుకున్నట్లే జరిగితే సినీ ప్రేక్షకులు ఒక అందమైన నటిని కోల్పోయేవారు. ఇకపోతే తన విచిత్రమైన కోరికను త్రిష మరో భేటీలో వ్యక్తం చేశారు.
పురుషుల గురించి మీ అభిప్రాయం ఏంటన్న ప్రశ్నకు ఆడవారిని అర్థం చేసుకోవడం కష్టమని అందరూ అంటుంటారు గాని నిజానికి మగవారిని అర్థమే చేసుకోలేమని బదిలించారు. వారు మనసులో వేరే విధంగా అనుకుంటూ బయటికి మరో విధంగా నటిస్తారని అన్నారు. తనకు మగ స్నేహితులు ఎక్కువ అనీ వారి మనసులను గాయపరచాలని ఇది చెప్పడం లేదని పేర్కొన్నారు. ఒకరోజు మగవాడిగా పుట్టాలన్నది తన గట్టి కోరిక అని, ఇదే విషయాన్ని తన తల్లితో చెప్పాననీ అన్నారు. దీనికి కారణం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదని ఒక మగవారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందన్నది తెలుసుకోవాలనే కుతూహలమే దీనికి కారణమని త్రిష పేర్కొన్నారు.
చదవండి: నంది పురస్కారం లేక ఆరేళ్లు.. ఎవరికి ఎక్కువ నందులు వచ్చాయంటే?
Comments
Please login to add a commentAdd a comment