veerendra
-
అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్!
సినీ ఇండస్ట్రీలో నటుడిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత వీరేంద్రబాబును బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో వీరేంద్ర స్నేహితుల ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు.. ప్రాణహాని ఉందంటూ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. కాగా.. శాండల్‌వుడ్‌లో వీరేంద్రబాబు స్వయం కృషి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ అంబరీష్ ప్రధాన పాత్రలో నటించారు. (ఇది చదవండి: 'జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో ధనుష్ రచ్చ) అసలేం జరిగిందంటే.. 2021లో అపస్మారక స్థితిలోకి వెళ్లగా వీరేంద్ర తనపై అత్యాచారం చేసినట్లు ఆ మహిళ ఆరోపించింది. ఆ తర్వాత మొత్తం వీడియో చిత్రీకరించి తనను మహిళను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులకు తెలిపింది. రూ.15 లక్షలు ఇవ్వకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడని.. అతని వేధింపులు భరించలేక వీరేంద్రకు కొంత డబ్బు ఇచ్చినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత జులై 30న మళ్లీ ఆ మహిళకు ఫోన్ చేసిన వీరేంద్ర బాబు.. ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకున్నాడని తెలిపింది. ఈ వ్యవహారంలో అతని స్నేహితుల ప్రమేయం కూడా ఉందని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదుతో వీరేంద్ర, అతని స్నేహితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొడిగేహళ్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!) -
కవల పిల్లలకు జన్మనిచ్చిన హీరోయిన్ నమిత..
హీరోయిన్ నమిత గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంది. ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నమిత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. 'నాకు ట్విన్ బాయ్స్ పుట్టారు. కృష్ణాష్టమి రోజున(శుక్రవారం)ఈ గుడ్‌న్యూస్‌ను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. హాస్పిటల్ సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నన్ను గైడ్ చేసినందుకు, నా పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను' అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా సొంతం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నమిత వెంకటేశ్‌తో నటించిన జెమిని సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. 2017లో ప్రియుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. ఇక నమితకు ట్విన్స్ పుట్టారని తెలిసి పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) -
రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు
న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకొని, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్న భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా మరో అస్త్రం సంధించింది. నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు పంపిస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ నుంచి ప్రముఖ అథ్లెట్ పీటీ ఉషా, తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌ను పార్లమెంట్ ఎగువసభకు నామినేట్ చేసింది. పెద్దల సభలో అడుగుపెట్టబోతున్న నలుగురు ప్రముఖులకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. సంబంధిత రంగాల్లో వారు అందించిన సేవలను కొనియాడారు. పీటీ ఉషా ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అని తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. ఇళయరాజా మధురమైన సంగీతంతో ప్రజలను రంజింపజేశారని గుర్తుచేశారు. భిన్నతరాల ప్రజలు ఆయన సంగీతాన్ని ఆస్వాదించారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, సాంస్కృతిక రంగాల్లో వీరేంద్ర హెగ్గడే అందిస్తున్న సేవలు చిరస్మరణీయం అని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్‌కు సృజనాత్మక ప్రపంచంతో దశాబ్దాల అనుబంధం ఉందని, భారతదేశ ఘనమైన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారని ప్రశంసించారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన కొద్ది రోజులకే నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేయడం గమనార్హం. పాటల ‘పెద్ద’రాజా ‘పచ్చని చేల పావడ గట్టి...కొండమల్లెలే కొప్పున బెట్టి.. వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని..’వంటి అత్యద్భుత గీతానికి అంతే అద్భుతంగా బాణీలు సమకూర్చి పాటకు అమృతత్వాన్ని సాధించిపెట్టారు ఇళయరాజా. ఇలాంటి పాటలెన్నో ఆయన పాటల పూదోటలో అలా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ పాటలోని ‘పచ్చని చేల’కు ఇళయరాజా జీవితానికి మధ్య సంబంధం ఎంతో బలమైంది. ఇళయరాజాకు పాటపై మక్కువ ఏర్పడింది, ఆయన్ను సంగీతం వైపు అడుగులేయించింది ఈ పచ్చని చేలల్లో రైతులు, కూలీలు పాడే పాటలే. ‘అన్నక్కిళి’తర్వాత బిజీ సంగీత కచేరీల్లో పాల్గొంటూ మరోవైపు పశ్చిమ బెంగాల్‌కి చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు కళాకారుడిగా చేశారు ఇళయరాజా. కన్నడ సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ దగ్గర దాదాపు 200 సినిమాలకు (చాలావరకు కన్నడ చిత్రాలే) సహాయకుడిగా చేశారు. ఇక తమిళ చిత్రం ‘అన్నక్కిళి’తో (1976)తో పూర్తిస్థాయి సంగీతదర్శకుడిగా మారారు. ‘అన్నక్కిళి’నిర్మాత పంజు అరుణాచలం రాజాకి ‘ఇళయ’(యంగ్ అని అర్థం) అని చేర్చి ‘ఇళయరాజా’గా మార్చారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో దాదాపు 1,500 చిత్రాలకు 7 వేల పాటలకు పైగా స్వరపరిచారు ఇళయరాజా. 2010లో భారత ప్రభుత్వం ఇళయరాజాను ‘పద్మభూషణ్‘, 2018లో ‘పద్మ విభూషణ్‘పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వాలు సత్కరించాయి. ‘సాగర సంగమం’, ‘రుద్రవీణ’, తమిళ చిత్రం ‘సింధుభైరవి’, మలయాళ ‘పళసి రాజా’చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు. మధురైలోని పన్నైపురమ్‌లో జననం 1943 జూన్ 3న తమిళనాడులోని మధురైలో గల పన్నైపురమ్‌లో రామస్వామి, చిన్నతాయమ్మాళ్ దంపతులకు మూడవ సంతానంగా జ్ఞాన దేశిగన్ (ఇళయరాజా) జన్మించారు. స్కూల్లో చేర్చేటప్పుడు ‘రాసయ్యా’అని మార్చారు. 14వ ఏటనే ఇళయరాజాకి సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. దాంతో సోదరుడు పావలార్ వరదరాజన్ నిర్వహించే సంగీత బృందంతో ఊరూరూ తిరుగుతూ కచేరీలు ఇచ్చేవారు. ఆ సమయంలోనే భారతదేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నివాళిగా తమిళ కవి కన్నదాసన్ రాసిన పాటకు బాణీ కట్టారు. తీవ్ర వేదనతో సాగే ఈ పాట ఎంతోమంది మనసుల్ని కదిలించింది. 1968లో మద్రాసులో ధన్‌రాజ్ మాస్టర్ వద్ద సంగీతం అభ్యసించారు. ధన్‌రాజ్ మాస్టర్ రాసయ్యా పేరుని ‘రాజా’గా మార్చారు. రాజ్యసభకు ‘కథ’ల బాహుబలి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు వి.విజయేంద్ర ప్రసాద్ తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో 1942 మే 27న జన్మించారు. ఆయన పూర్తిపేరు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్. కొవ్వూరు, ఏలూరు, విశాఖపట్ణణంలో చదువుకున్న విజయేంద్ర ప్రసాద్ తన అన్నయ్యతో కలసి విశాఖపట్టణంలో కాంట్రాక్ట్ పనులు చేసేవారు. అక్కడే రాజనందినిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో ఉన్న తన దగ్గరి బంధువు, అన్నయ్య అయిన పాటల రచయిత శివశక్తి దత్తా (సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి) వద్దకు చేరారు. దర్శకుడు రాఘవేంద్రరావు వద్ద విజయేంద్ర ప్రసాద్‌ని అసిస్టెంట్ రైటర్‌గా చేర్పించారు శివశక్తి దత్తా. మూడేళ్లు అసిస్టెంట్ రైటర్‌గా చేసిన ఆయన శివశక్తి దత్తాతో కలిసి ‘జానకి రాముడు’సినిమాకి తొలిసారి కథ రాశారు. ‘బంగారు కుటుంబం’, ‘బొబ్బిలి సింహం’సినిమాలకు కథలు రాశారు. ‘బొబ్బిలి సింహం’చిత్రం తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలకు కథలు అందించారు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’చిత్రాలకు కథలు అందించారు. 1996లో అన్నయ్య శివశక్తి దత్తాతో కలిసి ‘అర్ధాంగి’, ‘శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లీ’చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘రాజన్న’చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నంది అవార్డు అందుకున్నారు. హిందీ ‘బజరంగీ భాయీజాన్’సినిమాకి బెస్ట్ స్టోరీ విభాగంలో ‘ఫిల్మ్‌ఫేర్’తో పాటు, ‘ది ఐకానిక్ ట్రేడ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ 2015’, ‘సోనీ గిల్డ్ 2016’అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. విజయేంద్ర ప్రసాద్ సతీమణి రాజనందిని 2012 అక్టోబర్ 21న మరణించారు. ఆయనకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు. ‘‘విజయేంద్రప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేశాయి. రాజ్యసభకు ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు’’అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవే శ్వాసగా.. లక్షల మందికి ఆరాధ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్గడే కర్ణాటకలోని ప్రఖ్యాత ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా సేవలందిస్తూ సామాజిక సేవా రంగంలోనూ విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన డాక్టర్ వీరేంద్ర హెగ్గడేను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆయన 1948 నవంబర్ 25న దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాల్లో జన్మించారు. తల్లిదండ్రులు రత్నమ్మ, రత్నవర్మ హెగ్గడే. వీరేంద్ర హెగ్గడేకు భార్య హేమావతి హెగ్గడే, కుమార్తె శ్రద్ధ హెగ్గడే ఉన్నారు. విద్యాభ్యాసం అనంతరం కేవలం 20 ఏళ్ల వయసులో 1968 అక్టోబర్ 24న ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా(పాలకుడు) బాధ్యతలు స్వీకరించారు. గత ఐదు దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. గ్రామీణాభివృద్ధి, ప్రజల స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. రూరల్ డెవలప్మెంట్, సెల్ఫ్–ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఆర్డీఎస్ఈటీఐ)ని నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నారు. వారికి తగిన శిక్షణ అందిస్తున్నారు. అలాగే కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా శ్రీక్షేత్ర ధర్మస్థల రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద 6 లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయి. 49 లక్షల మందికిపైగా సభ్యులు ఉన్నారు. అంతేకాకుండా శ్రీధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్టును డాక్టర్ హెగ్గడే నెలకొల్పారు. 25కు పైగా పాఠశాలలు, కళాశాలల ద్వారా నాణ్యమైన విద్యనందిస్తున్నారు. హెగ్గడేకు ధర్మరత్న, ధర్మభూషణ అనే పేర్లు కూడా ఉన్నాయి. లక్షలాది మందికి ఆరాధ్యుడిగా కొనసాగుతున్నారు. పరుగుల రాణికి ‘రాజ్య’ యోగం ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటిన అథ్లెట్ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అమ్మాయిలకు చదువెందుకనే ఆ రోజుల్లో ఆటల పోటీల్లోకి వెళ్లడమంటే సాహసం. అలాంటి పరిస్థితుల్లో ‘పయ్యోలి’అనే పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రపంచవేదికపై ‘పరుగుల రాణి’గా నిలిచింది. పతకాలతో ‘గోల్డెన్ గర్ల్’గా మారింది. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’గా ఎదిగింది. ఆమె పరుగు ఎందరో అమ్మాయిలకు ప్రేరణ. ఊరి పేరునే.. ఇంటిపేరుగా మార్చుకున్న పయ్యోలి తెవరపరంపిల్ ఉష (పీటీ ఉష) 1976 నుంచి 2000 వరకు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 4–400 మీటర్ల రిలే, 400 మీటర్ల హర్డిల్స్‌లో అలుపెరగని పరుగుతో దిగ్గజ అథ్లెట్‌గా ఎదిగింది. 25 ఏళ్ల కెరీర్లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఉష మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కానీ అంతకుముందు... ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో ఎదురేలేని స్ప్రింటర్‌గా ఎదిగింది. ప్రత్యేకించి 1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె 16 స్వర్ణాలు (ఓవరాల్‌గా 18 బంగారు పతకాలను) సాధించింది. కెరీర్ తదనంతరం అకాడమీ నెలకొల్పి.. తన జీవితాన్నే భారత అథ్లెటిక్స్‌కి అంకితం చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందజేసింది. 58 ఏళ్ల ఉష తాజాగా రాజ్యసభకు నామినేట్ అయ్యింది. ఇళయరాజాపై అభినందనల వర్షం రాజ్యసభకు వెళ్లబోతున్న సంగీత దిగ్గజం ఇళయరాజాపై అభినందనల వర్షం కురుస్తోంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, సూపర్‌స్టార్ రజనీకాంత్ అభినందనలు తెలిపారు. అసాధారణ సంగీత కళాకారుడు ఇళయరాజా వివిధ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారని రాజ్‌భవన్ ట్వీట్ చేసింది. ప్రియమైన మిత్రుడు ఇళయరాజాకు అభినందనలు అని రజనీకాంత్ పేర్కొన్నారు. ఇళయరాజాను ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ కూడా అభినందించారు. దేశాన్ని గర్వపడేలా చేశారు: అమిత్ షా ప్రముఖులు పీటీ ఉషా, ఇళయరాజా, డాక్టర్ వీరేంద్ర హెగ్గడే,విజయేంద్ర ప్రసాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందనలు తెలియజేశారు. అంకితభావం, నిరంతర శ్రమతో వారు దేశాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఎగువ సభకు వెళ్లబోతున్న వారికి అభినందనలు తెలిపారు. Shri V. Vijayendra Prasad Garu is associated with the creative world for decades. His works showcase India's glorious culture and have made a mark globally. Congratulations to him for being nominated to the Rajya Sabha. — Narendra Modi (@narendramodi) July 6, 2022 Shri Veerendra Heggade Ji is at the forefront of outstanding community service. I have had the opportunity to pray at the Dharmasthala Temple and also witness the great work he is doing in health, education and culture. He will certainly enrich Parliamentary proceedings. pic.twitter.com/tMTk0BD7Vf — Narendra Modi (@narendramodi) July 6, 2022 The creative genius of @ilaiyaraaja Ji has enthralled people across generations. His works beautifully reflect many emotions. What is equally inspiring is his life journey- he rose from a humble background and achieved so much. Glad that he has been nominated to the Rajya Sabha. pic.twitter.com/VH6wedLByC — Narendra Modi (@narendramodi) July 6, 2022 The remarkable PT Usha Ji is an inspiration for every Indian. Her accomplishments in sports are widely known but equally commendable is her work to mentor budding athletes over the last several years. Congratulations to her on being nominated to the Rajya Sabha. @PTUshaOfficial pic.twitter.com/uHkXu52Bgc — Narendra Modi (@narendramodi) July 6, 2022 -
శరత్‌బాబుతో హీరోయిన్ నమిత పెళ్లి పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన భర్త
Namitha Husband Reaction On Namitha Marriage With Sarath Babu Rumours: హీరోయిన్ నమితకు తెలుగు, తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'సొంతం' సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ భామ తర్వాత వెంకటేష్ సరసన జెమినీ, రవితేజకు జోడీగా ఒక రాజు..ఒక రాణి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామరస్ హీరోయిన్గా పాపులర్ అయిన నమిత 2017లో వ్యాపారవేత్త, నిర్మాత వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అయితే నమితపై గతంలో అనేక రూమార్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరేంద్రతో పెళ్లి ఫిక్సయిన తర్వాత కూడా సీనియర్ నటుడు శరత్‌బాబుతో నమిత పెళ్లంటూ అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నమిత భర్త వీరేంద్ర స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సరిగ్గా మా పెళ్లి సమయంలోనే సీనియర్ నటుడు శరత్‌బాబుతో నమిత పెళ్లంటూ వార్తలు వచ్చాయి. నా లైఫ్‌లోనే నేను విన్న వరస్ట్ కామెంట్స్ ఇవి. అసలు అలాంటి రూమర్స్ ఎందుకు వచ్చాయో కూడా తెలియదు. ఆయన చాలా పెద్దాయన. అలాంటి వ్యక్తితో ఎఫైర్ క్రియేట్ చేయడం చాలా తప్పు. అలాంటి రూమర్స్‌ని పట్టించుకోవాల్సిన పనిలేదు' అంటూ పుకార్లకి చెక్ పెట్టారు. -
ఏమి జరిగిందంటే..
పెరంబూరు: ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు గుంజుకోవడానికి రాజకీయ నాయకులు బయలుదేరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల అధికారులు డబ్బును అక్రమంగా తరలిస్తున్న వాహనాలను తనిఖీలు చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించారు. వారు ఇప్పటికే సరైన ఆధారాలు లేని కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంటున్నారు. కాగా నటి నమిత ఫ్లయింగ్ స్క్వాడ్‌తో వాగ్వాదానికి దిగినట్లు, వారితో గొడవ పడినట్లు గరువారం ప్రచారం హోరెత్తిన విషయం తెలిసిందే. దీంతో నటి నమిత భర్త వీరేంద్ర స్పందించారు. ఆయన శుక్రవారం ఒక ప్రకటనను మీడియా పర్సన్ ద్వారా విడుదల చేశారు.అందులో తాము షూటింగ్లో పాల్గొనడానికి 8 గంటల పాటు కారులో ప్రయాణం చేస్తున్నామన్నారు. నమిత ప్రయాణ బడలికతో కారు వెనుక సీటులో నిద్రిస్తోందని చెప్పారు. అప్పటికే దారిలో రెండు మూడు చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్స్ తమ కారును తనిఖీ చేశారన్నారు. అలా సేలం జిల్లా, ఆర్కాడు ప్రధాన కూడలిలో మరోసారి ఫ్లయింగ్ స్క్వాడ్స్ తమ కారు ఆపారని చెప్పారు. అయినా తాము తనిఖీకి సహకరించామని తెలిపారు. అయితే వెనుక సీటులో నమిత నిద్రపోతుండడంతో అవసరం అయితే తానే ఆమెను లేపుతానని చెప్పానన్నారు. అయితే వారు తన మాటను వినిపించుకోకుండా కారు డోర్‌ను టక్కున ఒపెన్ చేశారని, దీంతో పడుకున్న నమిత సడన్‌గా కిందకు పడిపోయే పరిస్థితి నెలకొందని చెప్పారు. అయినా వారు నమిత బ్యాగ్‌ను పరిశీలించాలని అన్నారని,, దీంతో నిరాకరించిన నమిత మహిళా పోలీస్‌నే తన బ్యాగ్ చెక్ చేయాలని చెప్పిందన్నారు. అప్పుడు మహిళా పోలీస్ వచ్చి నమిత బ్యాగ్‌ను చెక్ చేసిందని తెలిపారు. అసౌకర్యమైన పరిస్థితుల్లో మహిళా పోలీస్‌ను తనిఖీకి కోరడం ప్రతి మహిళా హక్కు అని నమిత భర్త వీరేంద్ర అన్నారు. జరిగింది ఇదయితే మీడియా వేరే విధంగా వక్రీకరించిందని ఆయన అన్నారు. -
మీటూపై స్పందించిన నమిత
మహిళల ఫిర్యాదులను ముందు వినాలని నటి, ఒకప్పటి యువత కలల రాణి నమిత అంటోంది. మీటూ సినీ పరిశ్రమలో కలకలాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి కొందరిపై మీటూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకూ ప్రైమ్ టైమ్‌లో లేని నటి నమిత తాజాగా మళ్లీ హెడ్‌లైన్స్‌కు ఎక్కుతోంది. తన చిరకాల ప్రేమికుడు వీరేంద్రను పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టిన నమిత ఇప్పుడు నటిగా అహంభావం అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ అమ్మడు మాట్లాడుతూ ఇంతకుముందులా గ్లామరస్ పాత్రల్లో నటించడం ఇష్టం లేదని పేర్కొంది. కథానాయకి పాత్రకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాలపైనేనని తాజాగా నటిస్తున్న అహంభావం చిత్రంలో పాత్రికేయురాలిగా బలమైన పాత్రలో నటిస్తున్నట్లు చెప్పింది. ఈ చిత్రంపై చాలా నమ్మకం ఉందని పేర్కొంది. గ్లామర్‌గా నటించనంటున్న నమిత తన అభిమానులకు పెద్ద షాక్‌నే ఇచ్చింది. ఎందుకంటే ఆమె అందాలకు గులాం అయ్యే చాలా మంది యువత అభిమానులైపోయారన్నది వాస్తవం. మరి ఇప్పుడు వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే మీటూపై స్పందించిన నమిత అందరూ మీటూ గురించి అడుగుతున్నారని, మీటూ పేరుతో మహిళలు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదులు చేస్తున్నారని, అలా తమకు జరిగిన అక్రమాల గురించి చెప్పడానికి ధైర్యం కావాలని అంది. ముందు వారు చేసే ఫిర్యాదులను వినాలని అంది. ఆ తరువాత నిజానిజాల గురించి విచారించాలని పేర్కొంది. అయితే మీటూను తప్పుగా ఉపయోగించకూడదంది నమిత. -
బంధించి ఆధ్యాత్మిక బోధనా?
న్యూఢిల్లీ: ఢిల్లీలో అమ్మాయిలను బంధించి ఉంచిన ‘ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ్’ ఆశ్రమం స్థాపకుడు వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. ఆశ్రమంలా ఉండే ఈ ఆధ్యాత్మిక వర్సిటీ తరఫు న్యాయవాది వాదిస్తూ అమ్మాయిలంతా ఇష్టపూర్వకంగానే అక్కడ ఉంటున్నారని చెప్పడంతో కోర్టు ‘వందలమందిని గదుల్లో ఉంచారు. కుటుంబీకులను, స్నేహితులను ఎవ్వరినీ కలవనివ్వడం లేదు. బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు. అలాంటప్పుడు వారు ఇష్ట ప్రకారమే ఉంటున్నారని ఎలా చెప్పగలుగుతున్నారు? జంతువుల్లా బంధించి ఏం ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నారో అర్థం కావట్లేదు’ అని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్, జస్టిస్ హరిశంకర్ల బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో దీక్షిత్ నడుపుతున్న ఇలాంటి మరో 8 కేంద్రాలనూ తనిఖీ చేయాలని సంబంధిత కమిటీని కోరింది. ఎన్జీవో కేసుతో వెలుగులోకి ఈ ఆశ్రమం బాగోతం ‘ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్’ అనే ఎన్జీవో, ఆశ్రమంలో ఉంటున్న ముగ్గురు బాలికల తల్లిదండ్రులు వేసిన పిటిషన్లతో నాలుగు రోజుల క్రితం వెలుగులోకొచ్చింది. రోహిణిలో ‘ఆధ్యాత్మిక్ విశ్వ విద్యాలయ్’ పేరుతో ఉన్న ఆశ్రమంలో వందలాది అమ్మాయిలను, మహిళలను గదుల్లో బంధించారు. లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి వారిని వాడుకుంటున్నారనీ, కొందరు గతంలో సూసైడ్ చేసుకున్నారనీ, పోలీసుల దృష్టికి ఈ విషయం వెళ్లినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఎన్జీవో పేర్కొంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు వెంటనే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్, ఇద్దరు న్యాయవాదులతో ఓ కమిటీని రంగంలోకి దింపింది. గురువారం ఆశ్రమాన్ని కమిటీ తనిఖీ చేసింది. మొత్తం నాలుగు అంతస్తులున్న ఆశ్రమ భవంతిలో దాదాపు 200 మందికి పైగా అమ్మాయిలు, మహిళలు బందీలుగా ఉన్నారనీ, అదొక కోటలా, రహస్య గదులు ఉన్నాయని కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ వివరించారు. -
వీరేంద్ర హత్య కేసులో ఐదుగురి అరెస్టు
మరోకరి కోసం గాలింపు కాకినాడ రూరల్ : ఇంద్రపాలెం శ్రీనివాసనగర్‌కు చెందిన దొమ్మ వీరేంద్రకు హత్య కేసులో శుక్రవారం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ వి.పవన్‌కిశోర్, ఎస్సై డి.రామారావు వివరాలను వెల్లడించారు. ఇంద్రపాలెం గొల్లపేటకు చెందిన భీమాల రమణ (సున్నంబట్టి రమణ) అదేగ్రామం శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్న ముద్దాడ లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇంద్రపాలెం అర్జున్‌నగర్‌కు చెందిన మాంసం వ్యాపారి దొమ్మ వీరేంద్ర కొంత కాలంగా తన కోర్కె తీర్చాలని, లేదంటే యాసిడ్ పోస్తానని లక్ష్మిని బెదిరించసాగాడు. రమణ లేని సమయంలో లక్ష్మి ఇంటికి వెళ్లి ఆమె తమ్ముళ్లను కొట్టి వేధిస్తుండేవాడు. దీంతో వీరేంద్రను హతమార్చాలని భావించి లక్ష్మి రమణకు, అతని స్నేహితులు చీడిగకు చెందిన అనసూరి బాబూప్రసాద్, కాకినాడ పాత బస్‌స్టాండ్ వెంకటేశ్వరకాలనీకి చెందిన దంగేటి జగదీష్‌కు విషయాన్ని చెప్పింది. అదును కోసం ఎదురు చూస్తున్న రమణ తన స్నేహితులతో తీసుకున్న గ్రూప్ఫోటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేయగా, అది చూసిన వీరేంద్ర మేనల్లుడు ఆరి సింహాచలం ఛీ అని కామెంట్ పెట్టాడు. దీన్ని సాకుగా తీసుకుని సింహాచలం నుంచి ఫోన్ లాక్కొని రమణ స్నేహితులు వెళ్లిపోయారు. మేనల్లుడు ఫోన్ కోసం వెళ్లిన వీరేంద్రను రమణ, అతని స్నేహితులు అనసూరి బాబూప్రసాద్, దంగేటి జగదీష్, ముద్దాడ లక్ష్మి, ఆమె తమ్ముళ్లు పితాని ఎర్రయ్య, బుల్లియ్య గొడ్డలి, కత్తి, క్రికెట్ స్టంపులతో దాడి చేసి చంపి పారిపోయారని సీఐ పవన్‌కిశోర్ వివరించారు. శుక్రవారం తెల్లవారుజామున బెయిల్ కోసం లాయర్‌ను కలిసేందుకు సొమ్ములు సిద్ధం చేసుకోవడానికి సమావేశమైనట్లు తమకు వచ్చిన సమాచారం దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ముద్దాయిల్లో ఒకడైన ముద్దాడ లక్ష్మి చినతమ్ముడు బుల్లియ్య పరారయ్యాడని సీఐ పవన్‌కిశోర్ తెలిపారు. అనంతరం వారి నుంచి వీరేంద్రను చంపడానికి ఉపయోగించిన గొడ్డలి, కత్తి, క్రికెట్ స్టంపులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరి ఐదుగురిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఇంద్రపాలెం ఎస్సై డి.రామారావు వివరించారు. ముద్దాయిలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని డిఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ పవన్కిశోర్లు అభినందించారు.