Sandalwood Actor Veerendra Babu Arrest In Molestation Case - Sakshi
Sakshi News home page

Veerendra Babu Arrest: మహిళపై నటుడి అత్యాచారం.. ఆపై వీడియో తీసి మరీ..!

Published Sat, Aug 12 2023 7:35 PM | Last Updated on Sat, Aug 12 2023 8:50 PM

Sandalwood Actor Veerendra Babu Arrest In Molestation case - Sakshi

సినీ ఇండస్ట్రీలో నటుడిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత వీరేంద్రబాబును బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో వీరేంద్ర స్నేహితుల ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు.. ప్రాణహాని ఉందంటూ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. కాగా..  శాండల్‌వుడ్‌లో వీరేంద్రబాబు స్వయం కృషి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ అంబరీష్ ప్రధాన పాత్రలో నటించారు.

(ఇది చదవండి:  'జైలర్‌' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో ధనుష్‌ రచ్చ)

అసలేం జరిగిందంటే..
2021లో అపస్మారక స్థితిలోకి వెళ్లగా వీరేంద్ర తనపై అత్యాచారం చేసినట్లు ఆ మహిళ ఆరోపించింది. ఆ తర్వాత మొత్తం వీడియో చిత్రీకరించి తనను మహిళను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులకు తెలిపింది. రూ.15 లక్షలు ఇవ్వకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తానని బెదిరించాడని.. అతని వేధింపులు భరించలేక  వీరేంద్రకు కొంత డబ్బు ఇచ్చినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

 ఆ తర్వాత జులై 30న మళ్లీ ఆ మహిళకు ఫోన్ చేసిన వీరేంద్ర బాబు.. ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకున్నాడని తెలిపింది. ఈ వ్యవహారంలో అతని స్నేహితుల ప్రమేయం కూడా ఉందని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదుతో వీరేంద్ర, అతని స్నేహితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కొడిగేహళ్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

(ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement